pizza
Husharu shooting completed
లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న 9 వ చిత్రం 'హుషారు'
You are at idlebrain.com > news today >
Follow Us

23 July 2018
Hyderabad

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం' , ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంతా నూతన తారలే నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ సినిమా లోగో ని అగ్రనిర్మాత 'దిల్ రాజు' సోషల్ మీడియాలో విడుదల చేశారు . ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ''మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది.

కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంటుగా తెరకెక్కిస్తున్నాడు . షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతో0ది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నా0. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved