pizza
Idho Prema Lokam in post production
పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'ఇదో ప్రేమ లోకం'
You are at idlebrain.com > news today >
Follow Us

15 September 2016
Hyderaba
d

శ్రీ శ్రీనివాసా ఫిలింస్‌ బ్యానర్‌లో ఎస్‌.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్‌ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్‌రాజ్‌ దర్శకత్వంలో అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టి. కరణ్‌రాజ్‌ మాట్లాడుతూ..ఇదో అందమైన ప్రేమకథ. ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఓ మేఘమాల కథ. నేను రాసుకున్న కథను నమ్మి..ఈ కథను చిత్రంగా మలిచేందుకు నిర్మాత ఎస్‌.పి. నాయుడు గారు ఎంతగానో సహకరించారు. ఖర్చుకు వెనకాడకుండా అందమైన లోకేషన్లలో చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే ఈ ప్రేమలోకానికి నటీనటులు, టెక్నిషియన్లు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుంది..అని అన్నారు.

నిర్మాత ఎస్‌.పి. నాయుడు మాట్లాడుతూ..దర్శకుడు కరణ్‌రాజ్‌ ఓ మంచి కథా చిత్రాన్ని మా బ్యానర్‌ ద్వారా ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రత్యేకపాత్రలో నటించిన సుమన్‌ మరియు నరేష్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వందేమాతరం శ్రీనివాస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కోదాడ, మట్టపల్లి, వేదాద్రి వంటి ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాము. అరకులోని సుందరమైన లోకేషన్లలో రెండు పాటలను చిత్రీకరించాము. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి చిత్రంగా 'ఇదో ప్రేమ లోకం' ఉంటుందని తెలుపుతున్నాము..అని అన్నారు.

అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య, సుమన్‌, నరేష్‌, భగవాన్‌, మెల్కోటి, దేవిశ్రీ, ప్రభావతి, ఎస్‌.పి. నాయుడు, బాలనటుడు టి. చంద్రమహేష్‌, టి. అశోక్‌కుమార్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, కెమెరా: కె. శివ, కో-డైరెక్టర్‌: దుర్గేష్‌, నిర్మాత: ఎస్‌.పి. నాయుడు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: టి. కరణ్‌రాజ్‌

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved