pizza
Indra about Super Sketch
కరాటే మాస్టర్‌కి గౌరవం ఎక్కువ! - ఇంద్ర
You are at idlebrain.com > news today >
Follow Us

5 September 2018
Hyderabad

ఆయన వృత్తి రీత్యా మాస్టారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించే మాస్టారు. మరో వైపు జిమ్‌ నేర్పిస్తారు. ఇంకో వైపు టెక్స్‌టైల్స్‌ షాపూ ఉంది. అయినా ఆయనకు సినిమాలంటే ఆసక్తి. ఆయన పేరు ఇంద్ర. ఆయన నటించిన ‘సూపర్‌ స్కెచ్‌’ గురించి ఇంద్ర బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..

- మాది హైదరాబాద్‌ దగ్గరే. శంషాబాద్‌లో పుట్టిపెరిగాను. మా నాన్నది వ్యవసాయం. మా అన్నయ్య టెక్స్‌టైల్స్‌ షాప్‌ చూస్తారు. మాకు అత్తాపూర్‌లో సెలబ్రిటీస్‌ జిమ్‌ కూడా ఉంది. దాదాపు 20వేల మంది విద్యార్థులకు కరాటే నేర్పించాను. పోలీస్‌ అకాడమీలోనూ 900 మందికి శిక్షణ ఇచ్చాను. నా దగ్గర నేర్చుకున్నవారు కొంతమంది సినిమా హీరోలకు శిక్షణ ఇస్తున్నారు. నాకు అంత తీరిక లేదు. అందుకే నేను వెళ్లడం లేదు.

- చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మార్షల్‌ ఆర్ట్స్‌లో చాలా మంచి గౌరవం ఉంటుంది. అయినా నాకు సినిమాల మీద ఉన్న ఇంట్రస్ట్‌తో ఇక్కడికి వచ్చాను.

- మార్షల్‌ ఆర్ట్స్‌ వ్యక్తిని కాబట్టి నన్ను సుమన్‌గారు బాగా ప్రోత్సహించేవారు. అలా రాజమౌళిగారు ‘సై’కోసం స్పోర్ట్స్‌ పర్సన్స్‌ కోసం వెతుకుతున్నారని తెలిసి వెళ్లి కలిశాను. అలా నా సినిమా ప్రస్తానం మొదలైంది.

- నాకు పరిశ్రమలో సురేందర్‌రెడ్డి మంచి ఫ్రెండ్‌. కిక్‌2, ధ్రువ చేయకముందు నుంచే ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది.

- ‘సూపర్‌స్కెచ్‌’ నా కెరీర్‌లో కీలకమైన సినిమా. ఇందులో యాంటీ హీరోగా చేశా. మూడు పాటలు కూడా ఉన్నాయి. నెగటివ్‌ షేడ్స్‌ కూడా ఉన్నాయి. అన్ని రకాల పాత్రలూ చేయాలన్నదే నా డ్రీమ్‌.

- ప్రస్తుతం సైరాలోనూ మంచి కేరక్టర్‌ చేస్తున్నా. ఆ డీటైల్స్‌ త్వరలో చెబుతా.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved