pizza
Aadhi Pinisetty interview (Telugu) about Neevevaro
రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం అని అనుకోవ‌డం లేదు - ఆది పినిశెట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2018
Hyderabad

రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం అని అనుకోవ‌డం లేదు - ఆది పినిశెట్టి

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం 'నీవెవరో` . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 24న విడుద‌ల కానుంది ఈ సినిమా. గురువారం ఆది పినిశెట్టి ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

* నీవెవ‌రో గురించి చెప్పండి?
- నీవెవ‌రో డివోష‌న‌ల్ ట‌చ్ ఉన్న మాట కాదు. కాక‌పోతే ప‌ర్టిక్యుల‌ర్ సంద‌ర్భంలో అలా అనుకుంటారు. సినిమా క‌థ‌కు యాప్ట్ టైటిల్ ఇది.

* తాప్సీ సినిమాకు అసెట్ అని అన్నారు?
- నిజ‌మే. అలా ఎందుకు అన్నావు అని నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. కాక‌పోతే నేను ఆ మాట‌ను ఎందుకు అన్నాన‌న్న‌ది సినిమా చూశాక అర్థ‌మ‌వుతుంది.

* ఇందులో పూర్తిగా అంధుడిగా క‌నిపిస్తారా? లేక వేరియేష‌న్స్ ఉన్నాయా?
- లేదండీ. సినిమాలో మామూలుగానూ ఉంటాను. ఫ‌స్ట్ టు లాస్ట్ అంధుడిని మాత్రం కాదు.

* త‌మిళ సినిమా `అదే క‌న్‌గ‌ళ్‌`కు రీమేక్ అని అన్నారు?
- నిజ‌మే. అందులోని సోల్ తీసుకుని తెలుగుకు త‌గ్గట్టు మేం చాలా విష‌యాలు యాడ్ చేశాం.

* రీమేక్ సినిమాలో న‌టించ‌డం ఈజీయా?
- లేదండీ. రీమేక్ అన‌గానే చాలా మందికి అదేదో ఈజీ ప్రాసెస్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ మేం కాపీ, పేస్ట్ చేయ‌డం లేదు. అందువ‌ల్ల కొత్త‌గానే చేస్తాం. అందువ‌ల్ల ఈజీ ఏం కాదు. కాక‌పోతే ఒక భాష‌లో హిట్ అయిన సినిమాను తీసుకుని, దాన్ని మ‌న ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఆత్రుత‌తో చేస్తాం.

* ఆర్ ఎక్స్ 100లోనూ మార్పులు చేస్తారా?
- త‌ప్ప‌కుండా చేస్తాం. చాలా మార్పులే ఉంటాయి. డైర‌క్ట‌ర్‌, హీరోయిన్‌.. ఇంకా ఏదీ ఫైన‌లైజ్ కాలేదు.

* తెలుగులో హీరోగా చేయ‌డానికి మీకు చాన్నాళ్లే ప‌ట్టిన‌ట్టుంది..?
- అదేం లేదండీ. నాకు సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి . కాక‌పోతే నేనే అంగీక‌రించ‌ను. తొంద‌ర‌ప‌డిపోయి డ‌బ్బుల కోసం సినిమాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. మా నాన్న బాగా సంపాదించారు. నాలాగా చాలా మంది ఈ వెసులుబాటు ఉండ‌క‌పోవ‌చ్చు. నాకు ఉంది. అందుకే నేను నిలిచినిదానంగా స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటున్నా.

* బ్లైండ్ పాత్ర కోసం హోమ్ వ‌ర్క్ చేశారా?
- బ్లైండ్ పీపుల్ కోసం ప్ర‌తి వారం ఒక‌రు వెళ్లి చదువుతుంటారు. చెన్నైలో అలా ఓ పాఠ‌శాల‌కునాలుగువారాలు నేను వెళ్లి చ‌దివా. అప్పుడు వారితో ప‌రిచ‌యం పెరిగింది. బ్లైండ్‌లోనూ చాలా ర‌కాలుంటాయ‌ని తెలిసింది. అయితే నేను ఇందులో అద్దాలు పెట్టుకోలేదు. ఆ ర‌కంగా నాకు నేనే పోటీగా అనుకుని ఈ సినిమా చేశా. త‌ప్ప‌కుండా మంచి అప్లాజ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నా.

* ఓ వైపు త‌మిళ్‌.. మ‌రో వైపు తెలుగు.. ఎలా చేస్తున్నారు?
- రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం అని అనుకోవ‌డం లేదు. నేను దేని గురించీ ఎక్కువ‌గా ఆలోచించ‌ను. ఈ క్ష‌ణంలో బ‌త‌క‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటా.

* నెక్స్ట్ మూవీ ఎప్పుడు?
- ప్ర‌స్తుతం ఆర్‌.ఎక్స్.100 త‌మిళ్ వెర్ష‌న్ జ‌రుగుతోంది. అదే స‌మయంలో హేమంత్ అని ఓ ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేస్తున్నా. బైక్ రేస్‌లు నేప‌థ్యంలో సాగే ఆ సినిమా తెలుగు, త‌మిళంలో రిలీజ‌వుతుంది.

 


interview gallery




 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved