pizza
Aadii interview about Garam
‘గరం’తో వాల్యూ ఆఫ్ సినిమా తెలిసింది – హీరో ఆది
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2016
Hyderaba
d

ఆది హీరోగా, శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'. ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఫిభ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో ఆదితో ఇంట‌ర్వ్యూ....

సోల్ బాగా వ‌చ్చింది....
- సినిమా ప్రారంభంలో మేం ఏదైనా అనుకుని సినిమాను చేశామో ఆ సోల్ బాగా వ‌చ్చింద‌ని న‌మ్మ‌కం. సినిమాలో సెంటిమెంట్, కామెడి అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. నాన్న‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ క‌లిసి చేసిన టీం వ‌ర్క్‌.

మదన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్....
- మ‌ద‌న్‌గారు మంచి డైరెక్ట‌ర్‌, మంచి రైట‌ర్‌. ఓ మంచి డైరెక్ట‌ర్ ఏ సినిమాను అయినా చ‌క్క‌గా డీల్ చేయ‌గ‌ల‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయన ఈ టైప్ ఆఫ్ మూవీ చేయ‌లేదంతే. గ‌రం విష‌యానికి వ‌స్తే ఎమోష‌న‌ల్ ఫీల్‌ను బాగా డీల్ చేశారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌, యాక్ష‌న్ పార్ట్‌పై ఆయ‌న‌కున్న హోల్డ్ చూసి స్ట‌న్ అయ్యాను. మంచి కామెడి టైమింగ్, సెటిల్డ్ గా ఉండే డైరెక్టర్. క్యారెక్ట‌ర్‌..

- వ‌రాల బాబు క్యారెక్ట‌ర్‌. యూత్ బాగా క‌నెక్ట్ అవుతారు. ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ త‌ర్వాత నా క్యారెక్ట‌ర్ అంత బాగా కుదిరింది. రాజమండ్రి స్లాంగ్‌లో మాట్లాడాను. అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసే క్యారెక్ట‌ర్‌. మంచి ఫైట్స్‌,డ్యాన్సులు ఉన్నాయి. ఫైట్స్ చాలా థ్రిల్లింగ్‌గా కంపోజ్ చేశారు. నాన్న‌తో వ‌ర్క్ చేసిన థ్రిల్ల‌ర్ మంజు, స‌త్యప్ర‌కాష్‌ల‌తో వ‌ర్క్ చేయ‌డం హ్య‌పీగా అనిపించింది. యాక్షన్ ఈ సినిమాలో బాగా జెల్ అయ్యింది.

రిస్కీ ఫీల్డ్‌.....
- సినిమా చేయ‌డం అంత సులువు కాద‌ని ఈ సినిమాతో నాన్న నిర్మాత‌గా చేయ‌డంతో అనిపించింది. ఈ ఫీల్డే రిస్క్‌. కానీ ఈ రిస్క్‌ ను ఎంజాయ్ చేస్తాం. ఓ విధ‌మైన టెన్ష‌న్ ఉండేది. ఏ హీరో అయినా ఓ సినిమా స్వంత బ్యాన‌ర్‌లో చేయాలి. అప్పుడు ప్రొడ్యూస‌ర్ ఎంత ప్యాష‌నేట్‌గా ఉన్నారో తెలుస్తుంది. వాల్యూ ఆఫ్ సినిమా తెలిసింది. సినిమా తీయ‌డం, ప‌బ్లిసిటీ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో తెలిసింది. దీంతో నిర్మాత‌ల హీరోగా ఇంకా ఎద‌గాల‌ని కోరుకుంటాను. సినిమా అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగింది.

Aadi interview gallery



 

సినిమాలో ఇవే ముఖ్యం....
- సినిమాకు స్టోరీ, ద‌ర్శ‌కుడు, క్యారెక్ట‌ర్, మంచి డైలాగ్స్ ఉంటే మిగ‌తావ‌న్నీ యాడ్ చేసుకుంటూ పోవ‌చ్చు. మంచి ద‌ర్శ‌కులుంటే సింపుల్ స్టోరీని కూడా ఎక్స్‌ట్రార్డిన‌రీగా చూపిస్తాడు.

మిగ‌తా తారాగ‌ణం గురించి...
- త‌నికెళ్ళ భ‌ర‌ణిగారు మా నాన్న‌గారి క్యారెక్ట‌ర్‌లో ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేశారు. అలాగే న‌రేష్‌గారు మ‌రో క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించారు. పృథ్వీగారు రెండు సీన్స్‌లో క‌న‌ప‌డినా మంచి కామెడితో న‌వ్వించారు. ఎలియ‌న్‌లా ఫీలలై పీకె గెట‌ప్‌లో క‌న‌ప‌డే బ్ర‌హ్మానందంగారు, పోసానిగారు ఇలా చాలా మంచి కాస్టింగ్ కుద‌రింది. ఎక్క‌డా స్పూఫ్ ఉండుదు. నాన్న‌గారితో కూడా ఓ చిన్న పాత్ర చేయించాల్సింద‌ని ఇప్పుడ‌నిపిస్తుంది.

ఇప్పుడు తెలుగులోనే కాన్‌స‌న్ ట్రేషన్‌...
- క‌న్న‌డ‌లో ప‌టాస్ చేయ‌మ‌ని ప్రొడ్యూస‌ర్ ఎస్‌.పి.బాబుగారు న‌న్ను అడిగారు. అయితే అది మెచ్చూర్ రోల్, ఇప్పుడు చేస్తే టు ఎర్లీ అయిపోతుంది. అందువ‌ల్ల నేను చేయ‌న‌ని అన్నాను. తెలుగులో నాన్న‌గారి పాత్ర‌ను క‌న్న‌డ‌లో కూడా ఆయ‌నే చేస్తున్నారు. క‌ళ్యాణ్‌రాంగారి రోల్‌ను గ‌ణేష్ చేస్తున్నారు. తెలుగులో కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేస్తున్నాను. గ‌రం క‌ర్ణాట‌క‌లో మంచి బిజినెస్ అయింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
- చుట్టాల‌బ్బాయి సినిమా చేస్తున్నాను. హీరోయిన్‌గా న‌మిత ప్ర‌మోద్‌ను ప‌రిచయం చేస్తున్నాం. 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మొన్న‌నే బ్యాంకాక్‌లో ఓ పాట కూడా షూట్ చేశాం. ఈ నెల 22 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట‌వుతుంది. కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. క‌థలు వింటున్నాను. మంచి క‌థ దొరికితే ఇమిడియేట్‌గా స్టార్ట్ చేస్తాం.



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved