pizza
Aadi interview (Telulgu) about Next Nuvve
`నెక్ట్స్ నువ్వే`... జౌట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ - అది
You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2017
Hyderabad

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్‌, యు.వి.క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ కలిసి వి4 క్రియేషన్స్‌ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌పై 'నెక్స్‌ట్‌ నువ్వే' పేరుతో ఓ హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్‌, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి టి.వి. యాంకర్‌, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. బన్ని వాసు నిర్మాత. నవంబర్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఆది సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు..

సినిమా స్టార్ట్ అయ్యిందిలా...
గ‌త ఏడాది ప్ర‌భాక‌ర్‌గారిని ఈ సినిమా కోసం క‌లిశాను. త‌ను ఇర‌వై నిమిషాల క‌థ‌ను చెప్పాడు. క‌థ విన‌గానే నాకు చాలా బాగా న‌చ్చింది. ప్ర‌భాక‌ర్‌గారి బ్యాగ్రౌండ్ తెలుసు. సీరియ‌ల్స్ ప‌రంగా మంచి న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు. త‌నెంటో తెలుసు కాబ‌ట్టి, ఆయ‌న డైరెక్ట్ చేస్తే బాగానే డైరెక్ట్ చేస్తార‌ని భావించి వెంట‌నే సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. అంతా పూర్త‌యిన త‌ర్వాత గీతాఆర్ట్స్ బేన‌ర్ ఈ సినిమా నిర్మిస్తుందని ప్ర‌భాక‌ర్‌గారు చెప్ప‌గానే నాకు ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. ఆయ‌న ఈ క‌థ‌ను ఏడాదిన్న‌ర‌గా రాసుకుని వెయిట్ చేస్తున్నారని త‌ర్వాత చెప్పారు. అంతా ఒకే అని వాసుగారితో మాట్లాడుక‌న్న త‌ర్వాత జ్ఞాన‌వేల్ రాజాగారు, యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ కూడా నిర్మాణంలో భాగ‌మ‌య్యారు. ఈ సినిమా ఒప్పుకున్న వారంలోపు `శ‌మంత‌క మ‌ణి` సినిమాలో కార్తీక్ అనే క్యారెక్ట‌ర్ చేసే అవకాశం వ‌చ్చింది. ఆ సినిమాకు కూడా ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేశాం. సినిమాను ప్ర‌భాక‌ర్‌గారు సింగిల్ షెడ్యూల్ ..36 రోజుల్లో పూర్తి చేసేశారు. క్యారెక్ట‌రైజేష‌న్స్‌, క‌థ‌, మంచి నిర్మాత‌లు ఉండ‌టంతో మ‌రో ఆలోచ‌న‌కు అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు.

రీమేక్ అని తెలుసు...
- `యామిరిక్క భ‌య‌మేన్‌` అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌లు నాకు ముందుగానే చెప్పారు. అయితే తెలుగులో పూర్తిగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయ‌ని తెలిపారు. మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేశారు. రెండేళ్ల క్రితం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని నాకు మ‌న‌సులో ఉండేది. అయితే ఆ రైట్స్ వాసుగారి ద‌గ్గ‌ర ఉంద‌ని తెలిసింది. దాంతో నేను కామ్ అయిపోయాను. అయితే సినిమా చివ‌ర‌కు నా ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది.

క్యారెక్ట‌ర్ గురించి...
- సినిమాలో నా పాత్ర పేరు కిర‌ణ్‌. సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు. త‌న‌కు రాజ‌మౌళి అంత పేరు సంపాదించాల‌నే కోరిక‌. కానీ వీడేమో `సంసారం సెమియా ఉప్మా` అనే సీరియ‌ల్ తీస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో ఇత‌నే నిర్మాత‌గా మారి ఓ సీరియ‌ల్ తీసి అప్పుల పాల‌వుతాడు. ఆ అప్పుల భారి నుండి త‌ప్పించుకోవ‌డానికి ఓ రిస్టార్ట్ స్టార్ట్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ నుండి అస‌లు కథ మొద‌లవుతుంది. సినిమా మొద‌లు నుండి చివ‌రి వ‌ర‌కు హాస్యం ప్ర‌ధానంగా సాగే జౌట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.

interview gallery

బ్ర‌హ్మాజీతో క‌లిసి ప‌నిచేయ‌డం...
- సందీప్ కిష‌న్ చేసిన `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌` సినిమాలో బ్రహ్మాజీగారు, సందీప్‌కిష‌న్ అన్న పాత్ర‌లో క‌న‌ప‌డుతారు. ఆ పాత్ర చూడ‌గానే, నేను కూడా ఈయ‌న‌తో ఓ సినిమా చేస్తే బావుంటుందే అనుకున్నాను. ల‌క్కీగా బ్ర‌హ్మాజీగారితో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. ఆయ‌న‌తో చేయ‌డం హ్యాపీగా అనిపించింది. ర‌ఘుబాబు, పోసాని, పృథ్వీగారు ఇలా అంద‌రూ చ‌క్క‌గా స‌హ‌కారం అందించారు.

త‌దుప‌రి చిత్రాలు...
- జ్ఞాన‌వేల్ రాజాగారి స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌లో మూడు బై లింగువ‌ల్ సినిమాలు ఓకే చేశాను. ఇవి కాకుండా జ్ఞాన‌వేల్ రాజాగారు తెలుగులో చేసే స్ట్ర‌యిట్ మూవీలో కూడా న‌ట‌స్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved