pizza
Aadi Pinisetty interview (Telugu) about Marakatamani
న‌టుడిగా నా జ‌ర్నీని ఎంజాయ్ చేస్తున్నాను - ఆదిపినిశెట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

18 June 2017
Hyderabad

ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం `మ‌ర‌క‌త‌మ‌ణి`. సినిమా జూన్ 16న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా హీరో ఆది పినిశెట్టితో ఇంట‌ర్వ్యూ...

స‌క్సెస్ రెస్పాన్స్‌..
- త‌మిళంలో మూవీ సూప‌ర్‌హిట్ టాక్‌. తెలుగులో మ‌ధ్య కొంచెం స్లోగా ఉంద‌ని అన్నారు కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌, పిల్ల‌లు స‌హా అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు.

బ్యాలెన్స్‌డ్‌గా సాగే సినిమా...
- క‌థ విన్న‌ప్పుడు హీరోగా నాకేలా హెల్ప్ అవుతుందోన‌ని ఆలోచించ‌లేదు. ఓ ఆడియెన్‌గా విన్నాను. క‌థ కొత్త‌గా ఉంది. ఎక్క‌డా వేరే సినిమాల ప్ర‌భావం లేకండా ఉంద‌ని అనిపించింది. క్యారెక్ట‌ర్స్‌కు ప్రాముఖ్య‌త ఇస్తూ సాగే సినిమా. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల‌నుకుని ఉంటే ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వ‌చ్చి ఉండేది కాదు. ద‌ర్శ‌కుడు సినిమాను బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్ళారు.

న‌టుడిగా కిక్ వ‌స్తుంది.....
- డిఫ‌రెంట్ జోన‌ర్స్ మూవీస్ చేసిన‌ప్పుడే ఓ న‌టుడిగా కిక్ ఉంటుంది. అందుకే నా వ‌ద్ద‌కు విభిన్న‌మైన క‌థ‌ల‌తో వ‌స్తున్నారు. ఓ న‌టుడిగా నా జ‌ర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. మొన్న స‌రైనోడుకి, దీనికి, రేపు రాబోయే సినిమాకు సంబంధ‌మే ఉండ‌దు. కోట్ల రూపాయ‌ల జాబ్ శాటిస్పాక్ష‌న్ ఉంది.

Aadi Pinisetty interview gallery

నేను దాన్ని ఆశించ‌డం లేదు..
- నేను ఇమేజ్‌ను ఆశించ‌డం లేదు. నాకు ఇమేజ్ కూడా లేద‌నే అనుకుంటాను. కానీ నా ఎత్తు, ప‌ర్స‌నాలిటీ చూసి కాస్తా యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఆడియెన్స్ ఊహిస్తారు. నేను యాక్షన్ చేయాల‌నుకుంటే మ‌రో ఐదేళ్ళ త‌ర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమాల‌ను చేయ‌లేను. మృగం త‌ర్వాత వైశాలి చేశాను. ఈరోజు చూస్తే మ‌ర‌క‌త‌మ‌ణి సినిమాలో విల‌క్ష‌ణ‌మైన సినిమా చేశాను. అలా చేయ‌డం అనేది ఓ న‌టుడిగా నాకు తృప్తినిస్తుంది.

ద‌ర్శ‌కుడి ఆలోచ‌నే....
- నిధులు అన్వేష‌ణ‌ను చాలా మంది చేస్తుంటారు. మ‌నం కూడా అలాంటి న్యూస్‌ల‌ను చ‌దువుతుంటాం. మ‌న చరిత్ర చూస్తే మ‌న భూమిలో ఎంతో నిధి ఉందనుకోవాలి. అలా ద‌ర్శ‌కుడికి ఓ ఆలోచ‌న నుండే మ‌ర‌క‌త‌మ‌ణి క‌థ పుట్టిందని అనుకుంటున్నాను.

హార్ట్ ట‌చింగ్ మూవీ..
- `రంగ‌స్థ‌లం 1985` మూవీలో నేను చేసే పాత్ర పాజిటివ్‌గా ఉంటుందా లేదా నెగ‌టివ్‌గా ఉంటుందా అని ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను. అయితే సినిమా హార్ట్ ట‌చింగ్‌గా ఉంది. 1985 సెట్టింగ్స్ అన్ని కొత్త‌గా ఉన్నాయి. లోకేష‌న్‌కు వెళుతుంటే మా తాత‌య్య చూడ‌టానికి మా ఊరు వెళుతున్నాన‌నే భావ‌న క‌లుగుతుంది.

మూడు క్యారెక్ట‌ర్స్ జ‌ర్నీ..
- నిన్ను కోరి చిత్రంలో వ‌రుణ్ అనే యువ‌కుడి పాత్రలో క‌న‌ప‌డ‌తాను. మూడు క్యారెక్ట‌ర్స్ ఉమ‌, ప‌ల్ల‌వి, అరుణ్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. ఆ పాత్ర‌ల జ‌ర్నీయే సినిమా. సినిమాటిక్‌గా ఏమీ ఉండ‌దు. మ‌న లైఫ్‌లో జ‌రిగే విష‌యాల‌కు క‌నెక్ట్ అవుతుంటాం. ఆ క‌నెక్టింగ్ పాయింట్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.

ప్ర‌తి సినిమా చేయ‌డం లేదు..
- అవ‌కాశం వ‌స్తున్న ప్ర‌తి సినిమా చేయ‌డం లేదు. జెన్యూన్‌గా, హార్ట్‌కు ద‌గ్గ‌ర‌గా అనిపించే సినిమాల‌నే చేస్తున్నాను. తెలుగులో సోలో హీరోగా త‌ప్పకుండా చేస్తాను. అయితే అందుకు త‌గిన‌ట్లు ఓ స్క్రిప్ట్ దొరికితే చేయ‌డానికి నేను సిద్ధ‌మే. రేపు నా కెరీర్ గ్రాఫ్ చూస్తే ఈ హీరో ఏదో కొత్త‌గా చేశాడురా అనుకోవాలి.

తుది నిర్ణ‌యం నాదే..
- సినిమాల ఎంపిక‌లో నేను నాన్న, అన్న‌య్య ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను కానీ సినిమా చేయాలా..వద్దా అనే ఫైన‌ల్ డిసిష‌న్ నాదే.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved