pizza
Adah Sharma interview about Garam
ఆమెలా యాక్ట్ చేయడానికి ప్రయత్నించాను – ఆదాశర్మ
You are at idlebrain.com > news today >
Follow Us

8 February 2016
Hyderaba
d

పూరి జ‌గ‌న్నాథ్ హార్ట్ ఏటాక్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఆదాశ‌ర్మ త‌ర్వాత స‌న్నాఫ్ సత్యమూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల్లో చిన్న‌పాత్ర‌ల్లో కూడా మెరిసింది. ఇప్పుడు ఆది హీరోగా న‌టిస్తున్న గ‌రం సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో పి.సురేఖ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఫిభ్ర‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఆదాశ‌ర్మ‌తో ఇంట‌ర్వ్యూ....

క్యారెక్ట‌ర్ గురించి...
- ఈ సినిమాలో ముస్లిం యువ‌తిగా క‌నిపిస్తాను. క‌ళ్ళ‌తోనే ఎక్కువ‌గా న‌టించాను. డైలాగ్స్ చాలా త‌క్కువ‌. ఇలాంటి పాత్ర చేయ‌డానికి మ‌ణిర‌త్నంగారు డైరెక్ట్ చేసిన బొంబాయి చిత్ర‌మే ఇన్‌స్పిరేష‌న్‌. మ‌నీషాలాగా యాక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను.

`గ‌రం` అవ‌కాశం....
- మ‌ద‌న్‌గారు ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్న‌ప్పుడు నేను న‌టించిన హార్ట్ ఏటాక్ సినిమా చూశారు. న‌చ్చ‌డంతో న‌న్ను సంప్ర‌దించారు. క‌థ న‌చ్చ‌డంతో నేను యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నాను. మ‌ద‌న్ గారు న‌న్ను సెల‌క్ట్ చేసుకోవ‌డానికి కార‌ణం హార్ట్ ఏటాక్‌లో ఎమోష‌న‌ల్ సీన్స్‌లో క‌ళ్ళ‌తో న‌టించ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌డ‌మే.

అలాంటి పేరు కావాలి...
- బ‌బ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాల‌ని కాకుండా సెటిల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాల‌ని అనుకుంటున్నాను. సెటిల్డ్ హీరోయిన్ అని పేరు కావాలి.

డ్యాన్స్‌కు స్కోప్ దొరికింది...
- తెలుగులో మూడు సినిమాలు చేశాను. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు బాగా డ్యాన్స్ చేసే స్కోప్ లేకుండా పోయింది. అయితే `గ‌రం` సినిమాలో ఐదు సాంగ్స్‌లో నాలుగు పాట‌ల‌కు డ్యాన్స్ వేసే అవ‌కాశం క‌లిగింది. ముఖ్యంగా చిల‌క‌పాప‌...అనే మ‌సాలా సాంగ్‌కు డ్యాన్స్ చేయ‌డాన్ని ఎంజాయ్ చేశాను.

నేనెంటో నాకు తెలుసు..
- నేనెంటో నాకు తెలుసు. చిన్న‌, పెద్ద పాత్ర‌ల‌ని ఆలోచించ‌ను, న‌చ్చితే త‌ప్ప‌కుండా చేసేస్తాను. అందుకే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల్లో న‌టించాను.

Adah Sharma interview gallery



హీరో ఆదితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
- ఆది మంచి కో యాక్ట‌ర్‌. టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. ఈ సినిమా టైమ్‌లోనే తండ్రి కూడా అయ్యాడు.

నిర్మాత‌ల గురించి...
- సాయికుమార్‌గారు ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. న‌న్ను బాగా చూసుకున్నారు.

ఖాళీగా ఉన్న‌ప్పుడు...
- ఖాళీగా ఉంటే పెయింటింగ్ వేస్తాను. సినిమాలు చూస్తుంటాను, బుక్స్ చదువుతుంటాను. అలాగే పాట‌లు బాగా పాడుతాను. రైట్ టైమ్ అనిపిస్తే సినిమాలో త‌ప్ప‌కుండా పాడుతాను.

అలాంటి సినిమా చేయాలి...
- నేను క‌థక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. క‌థ‌క్ క‌థాంశంతో ఉన్న పీరియాడిక్ మూవీలో న‌టించాల‌నే కోరిక ఉంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌...
- `క్ష‌ణం` మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. అలాగే హిందీ సినిమాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వివ‌రాలు తెలియ‌జేస్తాను.

 



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved