pizza
Aditi Rao Hydari interview (Telugu) about Cheliyaa
మణిరత్నంగారితో 'చెలియా' సినిమా చేయడం కల నిజమైనట్లు ఉంది - అదితిరావు హైదరీ
You are at idlebrain.com > news today >
Follow Us

3 April 2017
Hyderabad

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై మద్రాస్‌ టాకీస్‌ రూపొందించిన చిత్రం 'చెలియా'. ఏప్రిల్‌ 7న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా అదితిరావు హైదరీ ఇంటర్వ్యూ....

కల నిజమైంది...
- మణిరత్నంగారితో పనిచేయడం ఇబ్బంది కాదు..ఓ కల నిజమైనట్లుగా భావిస్తున్నాను. అయినా ఛాలెంజింగ్స్‌ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేము. మణిరత్నం వంటి దర్శకులతోపనిచేసేటప్పుడు మన లిమిట్స్‌ను దాటేలా నటనను ఆయన మన నుండి రాబట్టుకుంటారు. అలాగే ఆయన నటుడుకి ఇవ్వాల్సిన స్వేచ్చను, స్పేస్‌ను ఇస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఓ కొత్త క్యారెక్టర్‌ను మనకు మనముగా కనుగొనే అవకాశం ఏర్పడుతుంది.

సినిమాకు హద్దులు లేదు....
- నాకు తెలిసి సినిమాకు ఏ భాషా, ప్రాంతం వంటి హద్దులు లేవు. మణిరత్నం వంటి గ్రేట్‌ డైరెక్టర్‌ గ్రేట్‌ స్క్రిప్ట్‌తో సినిమా చేస్తున్నప్పుడు అది ఎక్కడి సినిమానో అని చూడకూడదు. అన్నీ భాషల్లో నటించే నటీనటులు గొప్ప అదృష్టవంతులని నేను భావిస్తాను.

కార్తీతో వర్క్‌ చేయడం గురించి...
- కార్తీ వంటి కోస్టార్‌తో పనిచేయడం వల్ల మనకు కూడా నటించడం చాలా సులువు అవుతుంది.

Aditi Rao Hydari interview gallery

క్రెడిట్‌ అంతా ఆయనదే...
- సుహాసినిగారు ఆడియో వేడుకలో చేసిన అప్రిసియేషన్‌ క్రెడిట్‌ అంతా మణిరత్నంగారికే చెందుతుంది. నేను సినిమాలో ఏదీ చేసినా ఆయన చలవే. మణిగారి దర్శకత్వంలో సినిమా చేశాననడం ఈరోజుకు కూడా కలలాగానే ఉంది.

తదుపరి చిత్రాలు...
- సంజయ్‌దత్‌గారితో భూమి సినిమా చేస్తున్నాను. అలాగే పద్మావతి మూవీలో నటిస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved