pizza
Adivi Sesh interview about Kshanam success
ఆ సినిమాతో నేను తీసుకున్న నిర్ణయమది – అడివి శేష్
You are at idlebrain.com > news today >
Follow Us

19 March 2016
Hyderaba
d

టాలీవుడ్ నిర్మాణ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రం ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో నటించింది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. సినిమా ఫిభ్రవరి 26న విడుదలై మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈచిత్రం సక్సెస్ లో భాగమైనందుకు అడివిశేష్ పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు....

థియేటర్స్ పెరిగాయి....
-సినిమా విడుదలైన నాలుగు వారాల దాటింది. నాలుగు వారాల తర్వాత కూడా సినిమా హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఆనందకరమైన విషయమేమంటే విడుదలై నాలుగు వారాలు అయినా రీసెంట్ గా సినిమా థియేటర్స్ పెరిగాయి.

జీరో బడ్జెట్...
-సినిమాను ముందుగా ఇంగ్లీష్ లో కొత్త నటీనటులతో జీరో బడ్జెట్ లో ప్రొడక్షన్ లో ఉన్న చిన్న చిన్న ఖర్చులు చూసుకుని నా దగ్గర ఉన్న ముప్పై నలబై లక్షలతో సినిమా చేసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ కు పంపుదామనుకున్నాను. కథ రాయండం స్టార్ట్ చేశాం. రెండు నెలలు తర్వాత ఓ జిమ్ లో పివిపిగారు, వినయ్ గారు కలిశారు. వారి వద్ద పదిహేను నిమిషాలు పర్మిషన్ తీసుకుని ఆఫీస్ లో వినయ్ గారిని కలిసి వినయ్ గారికి కథను వినిపించాను. ఆయన కథ వినగానే ఇంప్రెస్ అయ్యారు. అప్పుడు ఆయనే రాజీవ్ గారికి కథను చెప్పమన్నారు. రాజీవ్ గారు కథ వినగానే ఇంప్రెస్ అవడమే కాకుండా రెండురోజుల్లోనే ఆఫీస్ ను కేటాయించి వర్క్ స్టార్ట్ చేశారు. పివిపి బ్యానర్ యాడ్ కావడంతో సినిమాకు పెద్ద ప్లాట్ ఫాం దొరికినట్టయింది.

ఆ సినిమాతో తీసుకున్న నిర్ణయమే....
-నేను నా డైరెక్షన్ లో కిస్ వంటి డిజాస్టర్ మూవీ తీశాను. అయితే ఆ సినిమాలో ఫీల్ బావున్నప్పటికీ కొంత మంది శాటిస్పాక్షన్ కోసం చేయడంతో సినిమా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. దాంతో నేను కిస్ తర్వాత ప్రొఫెషనల్ గా నా మనసుకు నచ్చిన సినిమాలనే చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తర్వాత రన్ రాజా రన్, బాహుబలి, దొంగాట వంటి సినిమాలు చేశాను. ఆ నమ్మకానికి, నిర్ణయానికి సాక్ష్యమే క్షణం మూవీ.

ఆయన మమ్మల్ని గైడ్ చేశారు....
-ఈ సినిమా స్క్రీన్ ప్లేను నేను, రవికాంత్ కలిసి రాశాం. ఈ సక్సెస్ లో ఇప్పడు మా ఇద్దరిదీ 40-40 భాగముంటే మిగిలిన 20 శాతం భాగం రచయిత అబ్బూరి రవిగారిది ఎందుకంటే ఆయన సినిమాలో ఎక్కడా తప్పులు చేశాం, ఎక్కడ బావుంది. ఎక్కడేం చేయాలంటూ సినిమా డెవలప్ మెంట్ లో మమ్మల్ని గైడ్ చేశారు.

అందుకే నేను డైరెక్షన్ చేయలేదు....
-కిస్ సినిమాను డైరెక్ట్ చేసిన నేను క్షణం మూవీనెందుకు డైరెక్ట్ చేయలేదని కొంతమంది అడిగారు. అయితే డైరెక్షన్ అనేది థింకింగ్, డిసిషన్ ప్రాసెస్ అయితే యాక్టింగ్ అనేది ఎమోషనల్ ప్రాసెస్. నా వరకు ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేయలేననిపించి ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయలేదు.

పెద్ద ఆఫర్స్ వచ్చాయి...
-రవికాంత్ సినిమాను చక్కగా డైరెక్ట్ చేశాడు. కొన్నిసార్లు ఇతనేంటి ఇన్ని టేక్స్ తీసుకున్నాడనిపించినా నా నుండి బెటర్ మెంట్ తీసుకున్నాడు. ఈ సినిమా పరంగా తనకు మంచి పేరు రావడమే కాదు, పెద్ద పెద్ద బ్యానర్స్, స్టార్ హీరోస్ నుండి ఆఫర్స్ కూడా వచ్చాయి. నాకు కూడా యాక్టింగ్ పరంగా చాలా అవకాశాలు వచ్చాయి.

Adivi Sesh interview gallery

కాపీ కొట్టలేదు...
-మిస్సింగ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. మేం కూడా అలానే నేను చూసిన ఘటనను క్యాటలాగ్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. అయితే చాలా మంది. ఈ కథను హాలీవుడ్ మూవీస్ నుండి కాపీ కొట్టామని అన్నారు. అయితే మేం ఏ సీన్ ఎలా రాసుకున్నాం. దాని వెనుకున్న పరిస్థితులేంటని కూడా ఎక్స్ ప్లెయిన్ చేయగలను. అంతే కానీ ఇతర సినిమాల నుండి కాపీ కొట్టలేదు.

డిఫైనింగ్ రోల్...
-నేను హీరోగా చేయాలనో, విలన్ గా చేయాలనో అనుకోవడం లేదు. ఎస్.వి.రంగారావుగారు నా ఫేవరేట్ యాక్టర్. నేను నటుడిగా ఉండాలనుకుంటున్నాను. అయితే నా క్యారెక్టర్ డిఫైనింగ్ రోల్ అయితే చేయడానికి నేను రెడీయే.

ఆయన వల్లే ఆ రోల్ చేశాను....
-వంశీగారి వల్లే ఊపిరి చిత్రంలో గెస్ట్ రోల్ చేశాను. అందుకు పివిపి బ్యానర్ తో ఉన్న రిలేషన్, వంశీ పైడిపల్లిగారితో ఉన్న రిలేషనే కారణం.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
-బాలీవుడ్ నుండి నటుడిగా కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఏ సినిమాను సైన్ చేయలేదు. అలాగే హెయిస్ట్ కాన్సెప్ట్ అంటే ఏం జరుగుతుందో అని భయపడే దాని కంటే ఏం జరుగుతుందనే సరదాగా ఉండే కాన్సెప్ట్ తో ఓ కథ రాసుకుంటున్నాను. క్షణం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సాజిద్ నడియద్ వాలా ఫ్యాన్సీ రేటు చెల్లించి కొన్నారు. అసలు ఆ చిత్రంలో హీరో హీరోయిన్స్ ఎవరు? ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై నాకు కూడా ఏ విషయం తెలియదు. త్వరలోనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved