pizza
A Guru Raj interview (Telugu) about Rakshaka Bhatudu
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `ర‌క్ష‌క‌భ‌టుడు` అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది - ఎ.గురురాజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

05 May 2017
Hyderabad

నటుడుగా చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించిన గురురాజ్‌ పలు చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో నటించారు. ఓ స్పెషల్‌ ఐడెంటిటీ వుండాలనే లక్ష్యంతో రియల్‌ ఎస్టేట్‌లో వ్యాపారంలో అడుగిడి అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్తగా ఎన్నో జాతీయ అవార్డులు, రివార్డులు సంపాదించారు. సుఖీభవ ప్రాపర్టీస్‌లో కస్టమర్లకు నమ్మకంగా నిలుస్తూ ఎన్నో వేలమందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. సినిమా మీద ప్యాషన్‌తో ఎంతో మంది టెక్నీషియన్స్‌కి, ఆర్టిస్టులకి పని కల్పిస్తూ ఓ మంచి చిత్రం చేయాలనే సదుద్దేశంతో సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి 'రక్షకభటుడు' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అండర్‌ ప్రొడక్షన్‌లోనే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆంజనేయ స్వామి మోషన్‌ పోస్టర్‌కి, ట్రైలర్‌కి ట్రమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రక్ష, జక్కన్న చిత్రాలతో తనకంటూ సపరేట్‌ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిచా పనయ్‌, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌లో ప్రముఖ హీరో నటిస్తున్నారు. ఆ హీరో ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. రిలీజ్‌కి ముందే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగాచిత్ర నిర్మాత ఎ.గురురాజ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.

రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న మీరు నిర్మాతగా టర్న్‌ అవడానికి ముఖ్య కారణం ఏమిటి?
- సుఖీభవ ప్రాపర్టీస్‌ని ఉన్నత స్ధాయిలో ఉంచిన నా కస్టమర్ల దేవుళ్లకు కృతజ్ఞతలు. మా కంపెనీలో ఎన్నో వేలమంది వర్క్‌ చేస్తున్నారు. వారందరికీ నా వంతు బాధ్యతగా జీవనోపాధి కల్పిస్తున్నాను. సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి పని కల్పిస్తూ 'రక్షకభటుడు' చిత్రాన్ని నిర్మించాను. మా సుఖీభవ ప్రాపర్టీస్‌ రేంజ్‌కి తగ్గకుండా ఈ చిత్రం అందరికీ నచ్చేవిధంగా నిర్మించడం జరిగింది.

రిలీజ్‌ డిలే అవడానికి రీజన్‌?
- ఏప్రిల్‌ 7న ఈ చిత్రం రిలీజ్‌ అనుకున్న మాట వాస్తవం. ఆన్‌లైన్‌ సెన్సార్‌ వల్ల క్లైమాక్స్‌లో గ్రాఫిక్‌ వర్క్‌ బాలెన్స్‌ ఉండడం వల్ల డిలే అయింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మే 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ చిత్రాన్ని మినిమమ్‌గా 500 థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.

అసలు సినిమా మెయిన్‌ సబ్జెక్ట్‌ ఏంటి?
- సినిమా ప్రధానంగా అరకులోని పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంగా సాగుతుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగే సినిమా ఇది. ఇండస్ట్రీలోని టాప్‌ కమెడియన్స్‌ అయిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ధనరాజ్‌, కాట్రాజు, ప్రభాకర్‌ అందరూ నటించారు. 85శాతం కామెడితో ఉంటుంది. ఈ సినిమాలో నిత్యం నేను కొలిచే నా ఆరాధ్య స్వామి ఆంజనేయ స్వామి. ఆ స్వామి కీలక పాత్రలో మా చిత్రంలో ఉండడం యాదృచ్ఛికం. ఆంజనేయస్వామి మీద చిత్రీకరించిన ముఖ్య సన్నివేశాలు మా చిత్రంలో హైలైట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామి గెటప్‌లో ఎవరు నటించారు అని అడుగుతున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత ఆసక్తికరంగా మారిందో మా చిత్రంలో ఆంజనేయ స్వామి ఎవరు అనేది కూడా అంతే సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తుంది. సాధారణంగా జాతీయగీతం ఆలపించే సమయంలో అందరూ నిలుచుంటారు. కానీ రక్షకభటుడు సినిమాలో ఆడియెన్స్‌ జాతీయగీతంతో పాటు క్లైమాక్స్‌లో అన్యాయం జరిగినప్పుడు ఆంజనేయస్వామి సీన్‌కు ఆడియెన్స్‌ లేచి నిలబడతారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయినా పూర్తిస్థాయి కామెడి ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది.

ఇటీవల రిలీజ్‌ అయిన ట్రైలర్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- యుట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో మా చిత్ర ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ఉంటుంది.

వంశీకృష్ణతో ఈ సినిమా చేయడానికి కారణం ఏమిటి?
- 'రక్ష', 'జక్కన్న' చిత్రాలతో డిఫరెంట్‌ ఫిలింస్‌ చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్‌ ఫాంటసీ చిత్రంగా 'రక్షకభటుడు' చిత్రాన్ని రూపొందించారు. ఇంతవరకూ ఎకక్కడా రాని డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వంశీకృష్ణ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. గ్యారెంటీగా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది.

మీ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి చెప్పండి?
- ఒక బీద రైతు కుటుంబం నుండి వచ్చిన నేను నటుడి కావాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. నటుడుగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో వ్యాపార రంగంలో స్థిరపడి భూతల్లిని నమ్ముకుని సుఖీభవ ప్రాపర్టీస్‌ని స్థాపించాను. అంచెలంచెలుగా ఎదిగిన నాకు జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. మా సుఖీభవ ప్రాపర్టీస్‌ ఉన్నతస్థాయిలో వుంది. సుఖీభవ మూవీస్‌ ద్వారా 'రక్షకభటుడు' చిత్రంతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. చిత్ర పరిశ్రమకి వస్తే ఎంతోమంది ఆర్టిస్ట్‌లుకి, టెక్నీషియన్స్‌కు ఉపాధిని కల్పిస్తూ అన్నం పెట్టవచ్చు అనే దృక్పధంతో కళామతల్లి మీద వున్న ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

ఈ చిత్రంలో మీకు బాగా నచ్చిన మెయిన్‌ ఎలిమెంట్స్‌ ఏంటి?
- సరదా సరదాగా సాగే సస్పెన్స్‌ హార్రర్‌ చిత్రం ఇది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ వుంటుంది. కథ వినగానే ఫస్ట్‌ నాకు కామెడీ విపరీతంగా నచ్చింది. మధ్య మధ్యలో వచ్చే ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా థ్రిల్లింగ్‌గా అన్పించింది.

మీరు అనుకున్న బడ్జెట్‌లోనే తీశారా?
- ఫస్ట్‌ వంశీ కథ చెప్పినప్పుడు స్మాల్‌ బడ్జెట్‌లో తీద్దాం అన్నాడు. కథ డిమాండ్‌ మేరకు క్వాలిటీ విషయంలో ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని తీశాం. అలాగే గ్రాఫిక్‌ వర్క్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వుండటంతో అనుకున్నదాని కన్నా బడ్జెట్‌ రెండింతలు పెరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే మెయిన్‌ కథ జరుగుతుంది. సో పోలీస్‌ స్టేషన్‌ సెట్‌ని, మరికొన్ని సెట్స్‌ని ఎక్కువ ఖర్చు పెట్టి వేసాం.

ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు గురించి?
- మా చిత్రంలో ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌లో ఓ ప్రముఖ హీరో నటించారు. అలాగే బ్రహ్మానందం, బ్రహ్మాజీ, బాహుబలి ప్రభాకర్‌, సుప్రీత్‌, సంపూర్ణేష్‌ బాబు, నందు, రీచపనయ్‌ మెయిన్‌ క్యారెక్టర్‌లో నటించారు. కథే మా చిత్రంలో హీరో. హండ్రెడ్‌ పర్సెంట్‌ ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. నవ్విస్తుంది. మరికొన్ని ఎమోషన్‌ సీన్స్‌లో ఏడిపిస్తుంది.

రిచా పనయ్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- సాఫ్ట్‌ క్యారెక్టర్‌లో రీచపనయ్‌ నటించింది. మెయిన్‌ ఆమె క్యారెక్టర్‌ చుట్టూ కథ జరుగుతుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రాబ్లెమ్‌లో పడి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మెయిన్‌ కథాంశం.

ప్రజెంట్‌ హార్రర్‌ మూవీస్‌ ఎక్కువ వస్తున్నాయి. ఈ చిత్రంలో వున్న నావెల్టీ ఏంటి?
- సస్పెన్స్‌, హార్రర్‌ అంటే దెయ్యాలు, భూతాలు వుంటాయి. మా చిత్రాన్ని చాలా కలర్‌ఫుల్‌గా, స్టైలిష్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందించాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయినా ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుంది. ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్‌ చేసే చిత్రం ఇది.

సినిమా రష్‌ చూశాక ఎలా అన్పించింది?
- చాలా హ్యాపీగా వున్నాను. వంశీ కథ ఏదైతే చెప్పాడో దానికి పదింతలు స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడు. డైరెక్టర్‌ వంశీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. అందుకే మా చిత్రాన్ని అద్భుతంగా తీయగలిగాడు. ఎప్పుడైతే డైరెక్టర్‌కి స్వేచ్ఛనిస్తామో అప్పుడే హండ్రెడ్‌ పర్సెంట్‌ రిజల్ట్‌ వస్తుంది.

శేఖర్‌చంద్ర మ్యూజిక్‌ గురించి?
- ఇలాంటి హర్రర్‌ మూవీస్‌కి మ్యూజిక్‌ చాలా ఇంపార్టెంట్‌. శేఖర్‌చంద్ర ఎక్స్‌ట్రార్డినరీగా రీ రికార్డింగ్‌ చేశాడు. అతని మ్యూజిక్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయింది. ఎంతో టాలెంట్‌ ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాతో మరింత పేరు వస్తుంది తనకి.

డైరెక్టర్‌ వంశీకృష్ణ ఆకెళ్ల వర్కింగ్‌ స్టైల్‌ ఎలా ఉంది?
- ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఉన్న డైరెక్టర్‌ వంశీ. తను నాకు ఫ్రెండ్‌ కావడం నా అదృష్టం. అతను సినిమా తీసే విధానం బాగా నచ్చింది. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటాడు. డెఫినెట్‌గా ఈ చిత్రం తర్వాత పెద్ద దర్శకుల జాబితాలో వంశీ చేరతాడు అనే నమ్మకం నాకుంది.

నటుడుగా వచ్చి నిర్మాతగా సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది?
- ఆర్టిస్టుగా వచ్చిన నేను ఇండస్ట్రీ నుండి బయటకెళ్లి వ్యాపారంలో సెటిల్‌ అయి మళ్లీ నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఒక ఆర్టిస్ట్‌గా సక్సెస్‌ అయి ఉండి ఉంటే అది నా వరకే ఫలితం ఉంటుంది. అదే నిర్మాతనయితే కొన్ని వందల మందికి అన్నం పెట్టవచ్చు. ఆ అవకాశం నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను

త‌దుప‌రి చిత్రం...?
- తదుప‌రి చిత్రం ఓ స్టార్ హీరోతో అనుకుంటున్నాను. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు తెలియ‌జేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved