pizza
Ajay Bhupathi interview (Telugu) about RX 100
ఈ క్రెడిట్ అంతా ఆయ‌న‌దే - అజ‌య్ భూప‌తి
You are at idlebrain.com > news today >
Follow Us

4 July 2018
Hyderabad

కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్‌భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `ఆర్.ఎక్స్ 100`. ఇన్ టెన్స్ ల‌వ్‌స్టోరీ అనే ఉప‌శీర్షికతో సినిమా రూపొందుతోంది. కె.డ‌బ్ల్యు.సి ప‌తాకంపై అశోక్‌రెడ్డి గుమ్మ‌డికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా జూలై 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తితో ఇంట‌ర్వ్యూ విశేషాలు..

ఆయ‌న స్ఫూర్తితోనే...
- మాది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆత్రేయ‌పురం. డిగ్రీ వ‌ర‌కు మా ఊరి కాలేజ్‌లోనే చ‌దువుకున్నాను. వ‌ర్మ‌గారి మ‌ర్రిచెట్టు సినిమా చూసి `ద‌ర్శ‌కుడు కావాలి` అనుకున్నాను. చిన్న‌ప్పుడు కూడా `వ‌ర్మ‌ను క‌ల‌వాలి` అని నా నోట్ బుక్స్‌లో కూడా రాసుకున్నాను. వ‌ర్మ‌గారు గొప్ప టెక్నీషియ‌న్‌.. సినిమాలో సౌండింగ్ ఎలా ఉండాలి. షాట్ డివిజ‌న్ ఎలా చేసుకోవాల‌నేది ఆయ‌న చేసినంత బాగా మ‌రేవ‌రూ చేయ‌లేర‌ని నా అభిప్రాయం. నేను ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన త‌ర్వాత వ‌ర్మ‌గారి ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా అనిపించింది. వ‌ర్మ‌గారి ద‌గ్గ‌ర ఎటాక్‌, కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌, వంగ‌వీటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశాను. ఆయ‌న త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వారిని బాగా ఎంక‌రేజ్ చేస్తారు. ఆయ‌నిచ్చే కాన్ఫిడెన్స్ కార‌ణంగా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసేవారు ఏ నమ్మ‌కంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడతారు.

ముందు అనుకున్న హీరో...
- ఈ సినిమా క‌థ‌ను మూడేళ్ల ముందు త‌యారు చేసుకున్నాను. మంచి ఎమోష‌న‌ల్ పాయింట్‌ను కొత్త‌వాళ్ల‌తో ఎందుకు చెప్ప‌కూడ‌దు అని అనిపించింది. ఆ స‌మ‌యంలో ముందుగా ఈ క‌థ‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వినిపించాను. అప్ప‌టికి `పెళ్ళిచూపులు` షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. త‌ను అప్ప‌టికే పెళ్ళిచూపులు సినిమా ఒప్పుకుని ఉండ‌టమో ఏమో కానీ.. త‌ర్వాత చూద్దాం అని అనేశారు. ఆ స‌మ‌యంలో కార్తికేయ‌ను క‌లిశాను.

టైటిల్ వెనుక పెట్ట‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను...
- బుల్లెట్ అంటే ఓ రౌడీ గుర్తుకు వ‌స్తాడు. స్కూటీ అంటే అమ్మాయి గుర్తుకు వ‌స్తుంది. ఆర్‌.ఎక్స్ 100 అంటే మాసీ అబ్బాయి గుర్తుకు వ‌స్తాడు. అందుకే క‌థ రాసుకునేట‌ప్పుడే నా సినిమాకు `య‌మ‌హా ఆర్‌.ఎక్స్ 100` అనే టైటిల్ పెట్టుకున్నాను. ఈ టైటిల్ హీరో క్యారెక్ట‌ర్‌ను ఇండికేట్ చేస్తుంది. అయితే టైటిల్ రిజిస్ట్రేష‌న్ కోసం వెళితే య‌మ‌హా కంపెనీ నుండి ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌డంతో హైద‌రాబాద్ బ్రాంచ్ య‌మ‌హా కంపెనీ వారిని కలిశాను. వారి స‌హ‌కారంతో చెన్నైలోని య‌మ‌హా కంపెనీ సౌత్ ఇండియ‌న్ హెడ్‌ను క‌లిశాను. అస‌లు నా క‌థ‌కు ఆ టైటిల్ ఎందుకు పెట్టాల‌నుకుంటున్నాను అంటూ ఓ లెట‌ర్ రాసి .. నా స్క్రిప్ట్‌ను వారికి మెయిల్ చేశాను. వారు కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. నేను స‌మాధానం ఇచ్చాను. కొంత‌కాలానికి వారు `య‌మ‌హా అనే పేరు కాకుండా ఆర్‌.ఎక్స్ 100 అనే టైటిల్ అయితే పెట్టుకో` అని అన్నారు. అలా ఈ టైటిల్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను.

interview galleryకొత్త‌వార‌ని ఎవ‌రూ అనుకోరు..
- సినిమాలో నాలుగు పాత్ర‌లు మెయిన్ పిల్ల‌ర్స్‌లాంటివి. హీరో, హీరోయిన్‌, రాంకీ, రావు ర‌మేశ్‌గారు. ముఖ్యంగా హీరో కార్తికేయ‌, హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ల న‌ట‌న‌ను తెర‌పై చూస్తే కొత్త‌వారు కాదు అని మీరే అంటారు. అంత గొప్ప‌గా న‌టించారు. హీరో కార్తికేయ న‌ట‌న పీక్స్‌లో ఉంటుంది. త‌ను అంత బాగా పెర్‌ఫార్మ్ చేస్తాడ‌ని నేను కూడా అనుకోలేదు. త‌ను ఈ సినిమాలో ఓ మూర్ఖ‌పు ప‌ల్లెటూరి కుర్రాడి పాత్ర‌లో న‌టించాడు. అస‌లు ఓ కుర్రాడు అలాఎందుకు ఉండాల్సి వ‌చ్చింద‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.

ఇన్‌స్పిరేష‌న్‌...
- ఇది నిజ జీవితంలో జ‌రిగిన‌వి . నేను చూసినవి.. విన్న ఘ‌ట‌న‌లు ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. ఇందులో హ్యాపీ ఎండింగ్ ఉంటుందా? శాడ్ ఎండింగ్ ఉంటుందా? అనేది సినిమా చూడాలి.

నిర్మాత గురించి...
- ఓ కొత్త ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఏదో చేయాల‌నుకుంటాడు.. అలాగే ఓ కొత్త హీరో ఏదైనా కొత్త‌గా చేసి త‌న న‌ట‌న‌ను ప్రూవ్ చేసుకోవాల‌నుకుంటాడు. అయితే అంద‌రినీ న‌మ్మి.. సినిమా చేస్తే డ‌బ్బులు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతో సినిమా చేస్తాడే నిర్మాత అత‌నే గొప్ప‌వాడు. ఈ సినిమా ఈ స్టేజ్‌కు రావ‌డానికి కార‌ణ‌మైన నిర్మాత అశోక్ రెడ్డిగారికే ఈ క్రెడిట్ అంతా ద‌క్కుతుంది.

త‌దుప‌రి చిత్రాలు..
- కొంద‌రు హీరోలు, కొన్ని ప్రొడక్ష‌న్ హౌసెస్ నుండి ఫోన్స్ వ‌చ్చాయి. ఈ సినిమా రిజ‌ల్ట్‌ను బ‌ట్టి నెక్ట్స్ మూవీ ఎంట‌నేది తెలుస్తుంది

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved