pizza
Akhil interview about Akhil
You are at idlebrain.com > news today >
Follow Us

07 November 2015
Hyderabad

టెన్త్ నైట్ నిద్ర‌పోను - అఖిల్‌

సిసీంద్రీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన చిచ్చ‌ర‌పిడుగు అఖిల్‌. `మ‌నం`లో ఒక నిమిషం హెల్మెట్ తీస్తే అక్కినేని అభిమానులు వెర్రెత్తిపోయారు అఖిల్‌ని చూసి. తాజాగా అఖిల్ `అఖిల్‌` సినిమాతోనే తెర‌మీద‌కు రానున్నారు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖిల్‌ను నితిన్ , సుధాక‌ర్‌రెడ్డి నిర్మించారు. ఆ సినిమా ఈ నెల 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా అఖిల్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* అఖిల్ వాయిదా ప‌డ్డ‌ప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది?
- చాలా స్ట్రెస్ ఫీల‌య్యాను. అస‌లు దాన్ని నేను ఎక్స్ పెక్ట్ చేయ‌లేదు. ఒక‌వేళ ముందే ఎక్స్ పెక్ట్ చేసి ఉంటే దాని గురించి ముందుగానే ఆలోచించేవాళ్ళం. గ్రాఫిక్స్ కార‌ణంగా బాహుబ‌లిలాంటి సినిమానే వాయిదాప‌డింది. ఒక సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్య‌త ఉన్న‌ప్పుడు అవి సంతృప్తిక‌రంగా వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి. అంతేగానీ త్వ‌ర‌త్వ‌ర‌గా విడుద‌ల చేసేద్దామంటే ప్రేక్ష‌కులు మెచ్చ‌రు. అభిమానులు ఈ సినిమా విడుద‌ల ప‌ట్ల ఎక్కువ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. అందుకే విడుద‌ల వాయిదా అనేస‌రికి కాస్త డిస‌ప్పాయింట్ అయ్యారు. అయితే మొద‌టి నుంచి నాకు స‌పోర్ట్ చేసిన నితిన్‌ని, వినయ్ గారిని ఏమీ అన‌కుండా ఉండాల్సింది. కాక‌పోతే వారి అభిమానాన్ని నేను అర్థం చేసుకోగ‌లిగాను. ఈ సినిమా చూసిన త‌ర్వాత త‌ప్ప‌కుండా వారికి ఎందుకు వాయిదా వేయాల్సి వ‌చ్చిందో అర్థ‌మ‌వుతుంది.

* సినిమా వాయిదా ప‌డ్డందుకు మీరు మీ నాన్న‌గారితో గొడ‌వ ప‌డ్డార‌ని..
- అలాంటి ఆర్టిక‌ల్స్ నేనూ చ‌దివాను. నేను మా నాన్న‌గారితో డిస‌ప్పాయింట్ కావ‌డ‌మేంటి? గ‌్రాఫిక్స్ చూసి మేం పానిక్ అయ్యాం. అలాంటి స్టేజ్‌లో నాన్న‌గారు చాలా కూల్ గా, త‌న ఎక్స్ పీరియ‌న్స్ ను ఉప‌యోగించి మ‌మ్మ‌ల్ని గైడ్ చేశారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్ చెప్పుకోవాలి.

* సినిమాలో గ్రాఫిక్స్ బాగాలేవ‌ని చెప్ప‌డం నెగ‌టివ్ టాక్‌ని స్ప్రెడ్ చేసిన‌ట్టు అనిపించ‌లేదా?
- అలాంటిదేమీ ఉండ‌దండీ. సినిమా చూశాక అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది.

* రిహార్స‌ల్స్ చేస్తూ స్పృహ కోల్పోయార‌ట‌?
- అప్పుడు నేను యాబ్స్ కోసం స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నా. నీళ్ళు కూడా ఎక్కువ‌గా తాగ‌లేదు. దానికి తోడు హెవీ రిహార్సల్స్ చేయ‌డం వ‌ల్ల కాసింత క‌ళ్ళు తిరిగిన‌ట్టు అనిపించింది. అంతే త‌ప్ప నేను పూర్తిగా ఏమీ ప‌డిపోలేదు. ఇంట్లో వాళ్ళ‌కి కూడా ఈ విష‌యాన్ని రెండు రోజుల త‌ర్వాతే చెప్పా.

* మీ కేర‌క్ట‌ర్ ఎలా ఉంటుంది?
- టిపిక‌ల్ వినాయ‌క్ హీరో ఎలా ఉంటాడో నేనూ అలాగే ఉంటా. అన్ని అంశాలను మిళితం చేసి రూపొందించిన సినిమా ఇది. ఎక్క‌డా ఏదీ ఎక్స్ ట్రాగా అనిపించ‌దు. కాక‌పోతే గ్రాండ్ ఎంట్రీతో వ‌చ్చాం.

* ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ గురించి చెప్పండి?
- ఇంట్ర‌డక్ష‌న్ సాంగ్ 5 నిమిషాల పాటు ఉంటుంది. ప్రేక్ష‌కుల‌కు న‌న్ను ప‌రిచ‌యం చేసే పాట అది. అందుకే కాస్త పెద్ద‌గా పెట్టాం. జానీ మాస్ట‌ర్ నాతో ఎక్స్ ట్రీమ్ స్టెప్స్ వేయించారు. 12 రోజులు ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూట్ చేశాం. ప్ర‌తిరోజూ దాదాపు 17-18 గంట‌లు ప‌నిచేశాం. మామూలుగా నాకు చిరంజీవిగారి డ్యాన్స్, ప్ర‌భుదేవాగారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.

* సినిమా ఎలా ఉండ‌బోతోంది?
- ఇలాంటి సినిమానే చేయాల‌ని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే నితిన్ ఈ క‌థ‌ను, వినయ్‌గారిని తీసుకొచ్చిన‌ప్పుడు నాకు క‌థ‌మీదా, విన‌య్‌గారి మీదా న‌మ్మ‌కం కుదిరింది. వెంట‌నే నాన్న‌గారితో చెప్పాను. ఆయ‌నా మొత్తం విని అంతా సెట్ చేశారు. ది ప‌వ‌ర్ ఆఫ్ జువా అంటే సూర్యుడి ప‌వ‌ర్ అని అర్థం. నేను మామూలుగా తెలుగు సినిమాల‌న్నీ చూస్తుంటాను. ఈ త‌ర‌హా సినిమా తెలుగు తెర‌పై ఇటీవ‌లి కాలంలో రాలేద‌ని మాత్రం గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను. 80 రోజులు షూటింగ్ చేస్తే అందులో 60 రోజులు విదేశాల్లోనే షూట్ చేశాం. స్పెయిన్‌లో ఇంట‌ర్వెల్ ఫైట్‌, ఛేజ్‌లు తీశాం. నాకు బేసిగ్గా యాక్ష‌న్ చేయ‌డ‌మంటే ఇష్టం. అందుకే ఈ సినిమాలో అండ‌ర్‌వాట‌ర్ స్టంట్‌, ప్లేన్ లో ఓ స్టంట్‌, పాంథ‌ర్ ఫైట్ వంటివ‌న్నీ చేశాం. సో అలాంటివాటికి గ్రాఫిక్స్ కూడా వాడాల్సి వ‌చ్చింది.

* మీపై మీ అమ్మానాన్న‌ల ప్ర‌భావం ఎలా ఉంటుంది?
- నేను నాన్న‌గారి సినిమాల‌ను చూస్తూ పెరిగాను కాబ‌ట్టి నాకు ఆయ‌న న‌ట‌నా ప్ర‌భావం ఉంటుంది. మామూలుగా నిర్ణ‌యాలు ఏవైనా నేను, నాన్న క‌లిసి తీసుకుంటాం. అమ్మ స‌ల‌హా ఇస్తుంది. డ్యాన్స్ అంటే అమ్మ‌కు చాలా ఇష్టం. ఆ విష‌యంలో మాత్రం త‌న స‌జెష‌న్స్ తీసుకుంటా. మా తాత‌గారు ఏం చెప్పారంటే ఆయ‌న చెప్పిన దాన్ని ఒక్క మాట‌లో చెప్ప‌లేను. అలాంటి లెజండ‌రీ ప‌ర్స‌నాలిటీ జీవిత‌మంతా నాకు పాఠ‌మే. అందుకే ఆయ‌న ఏం చెప్పినా వింటూ ఉండేవాడిని.

* కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకున్నారు?
- నాకు ఇప్పుడ‌ప్పుడే ఎలాంటి ఇమేజ్ వ‌ద్దు. అన్నీ చేయ‌గ‌ల‌న‌ని అనిపించుకోవాలి. అందుకే ముందు నేను ఇలాంటి క‌థ‌ను ఎంపిక చేసుకున్నాను. నేనిప్పుడు ఎస్టాబ్లిషింగ్ స్టేజ్‌లో ఉన్నా. అందుకే నాలుగైదు ఏళ్ళు ఒక సినిమా త‌ర్వాతే మ‌రో సినిమా చేస్తా. తెలుగు నాకు హోమ్‌. ఇక్క‌డ బాగా సెటిల‌య్యాక ఇంకో భాష గురించి ఆలోచిస్తా. బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ నాకు తెలుగులో ఇప్పుడు దృష్టి పెట్టాల‌ని ఉంది. ఈ సినిమా చేసేట‌ప్పుడు బ్ర‌హ్మానందంగారిని చూడ‌గానే న‌వ్వేసేవాడిని. సో నా నెక్స్ట్ సినిమా నుంచి కామెడీ విష‌యంలో కాసింత ఎక్కువ దృష్టి పెట్టాలి.

* ఎలాంటి సినిమాలు చేస్తారు?
- అన్ని ర‌కాల సినిమాలు చేస్తా. ప్ర‌యోగాత్మ‌క సినిమాలు కేవ‌లం నాకోసం, న‌న్ను ప్రూవ్ చేసుకోవ‌డం కోసం చేయ‌ను. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని అనుకుంటే మాత్ర‌మే చేస్తా. అలాగే మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌ను కూడా అంతే. అలాంటి సినిమాల్లో న‌టించ‌డానికి నాతో పాటు మ‌రో హీరో ఓకే అంటే నేనూ సిద్ధ‌మే. దానివ‌ల్ల మార్కెట్ పెరుగుతుంది. స్పోర్ట్స్ సినిమాలు చేయ‌డ‌మంటే బాగా ఆలోచిస్తా. ఎందుకంటే ఇవాళ్రేపు ప్ర‌తి స్పోర్ట్ ను టీవీల్లో అంద‌రూ చూస్తున్నారు. అలాంట‌ప్పుడు ఆ క‌థ‌ల‌ను ఆథంటిక్‌గా తీయాలి. అంతేగానీ న‌వ్వుల పాలు కాకూడ‌దు. తెలుగులో ఇప్ప‌టిదాకా వ‌చ్చిన సినిమాల్లో రాజ‌మౌళి సై మాత్ర‌మే నాకు అలాంటి సినిమా అనిపించింది.

* నితిన్ గురించి చెప్పండి?
- నితిన్ మొద‌టి నుంచి న‌న్ను బాగా స‌పోర్ట్ చేశాడు. వాళ్ళ నాన్న‌గారు ఈ సినిమాకు వెన్నెముక‌. నితిన్ నాకు నిర్మాత క‌న్నా మంచి ఫ్రెండ్‌. త‌ను ఈ సినిమాలో చేయ‌లేదు. యాక్ట‌ర్‌గా న‌న్ను బాగా అర్థం చేసుకున్న వ్య‌క్తి.

* త్రివిక్ర‌మ్‌తో మీ తొలి సినిమా ఉంటుంద‌ని అన్నారు?
- చాలా మందితో అన్నారు. అప్పుడు నేను క్లారిటీ లేకుండా విన్నా. ఎలాగో ఉన్నా. అలాంటి స‌మ‌యంలోనే ఈ క‌థ సెట్ అయింది.

* అమ‌ల‌గారు చాన్నాళ్ళ తర్వాత క‌మ‌ల్ గారితో క‌లిసి న‌టిస్తుండ‌టం...
- అవునా? నాకు తెలియ‌దే. చేస్తే నైస్ పెయిర్‌.

* స‌యేషా సైగ‌ల్ గురించి?
- చాలా మంచి డ్యాన్స‌ర్. నాకు బాగా కాంపిటిష‌న్ ఇచ్చింది. కెమెరాను ఫేస్ చేయ‌డం బాగా తెలుసు. వెరీ వెరీ టాలెంటెడ్‌.

* యు.ఎస్‌.లో ప్ర‌చారం చేయ‌డం ఎలా అనిపించింది?
- ఎవ‌రికైనా ఇవాళ యు.ఎస్‌. మార్కెట్ చాలా ముఖ్యం. అలాంటప్పుడు వారిని క‌ల‌వ‌డం హ్యాపీనే క‌దా. అక్క‌డికెళ్తే మ‌న శిల్ప‌క‌ళావేదిక‌కు వెళ్ళిన‌ట్టు అనిపించింది. అంత బాగా రిజీవ్ చేసుకున్నారు.

* న‌ట‌న‌ను నేర్చుకున్నారు. దానికీ, ప్రాక్టిక‌ల్‌గా చేయ‌డానికి తేడా ఉందా?
- నేను న‌ట‌నను నేర్చుకున్నానో లేదో తెలియ‌దండీ. కాక‌పోతే అక్క‌డికెళ్లి ఓపెన్ అయ్యా. అంత‌కు ముందు కెమెరా చూడగానే ఫ్రీజ్ అయ్యేవాడిని. అక్క‌డికెళ్ళాక ఓపెన్ కావ‌డం మొద‌లుపెట్టా. అది బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఎలా చేశానో 11న అంద‌రూ చూసి చెప్పాలి. 10 రాత్రికైతే నేను నిద్ర‌పోను.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved