pizza
Allari Naresh interview (Telugu) about Intlo Deyyam Nakem Bhayam
2020లో ఓ లవ్ స్టోరీని డైరెక్ట్ చేస్తాను - అల్లరి నరేష్
You are at idlebrain.com > news today >
Follow Us

27 December 2016
Hyderaba
d

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం డిసెంబర్‌ 30న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో అల్ల‌రి న‌రేష్‌తో ఇంట‌ర్వ్యూ....

2016 ఎలా గడిచింది?
- వ్య‌క్తిగ‌తంగా మాత్రం నాకిది గ్రేట్ ఇయ‌ర్‌. ఈ ఏడాది తండ్రి కూడా అయ్యాను. తండ్రి పాత్ర‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక వృత్తిప‌రంగా చూస్తే ఈ ఏడాది నేను యాక్ట్ చేసిన సినిమాల్లో సెల్ఫీ రాజా మాత్ర‌మే విడుద‌లైంది. ఇప్పుడు `ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం` సినిమా విడుద‌ల‌వుతుంది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది మూడు నాలుగు సినిమాలు విడుల‌య్యేవి. సినిమాలు చేయ‌డంలో స్పీడు త‌గ్గిందనే చెప్పాలి.

సినిమా రంగంపై డీమానిటైజేష‌న్ ఎఫెక్ట్ ఎంత వ‌ర‌కు ప‌డింది?
- డీమానిటైజేష‌న్ ఎఫెక్ట్ సినీ రంగంపైనే ప‌డ‌లేదు. చాలా రంగాల‌పై ప‌డింది. అందులో సినీ రంగం కూడా ఒక‌టి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం సినిమా న‌వంబ‌ర్ 12న విడుద‌ల కావాల్సింది. కానీ జ‌నం అంతా డ‌బ్బుల కోసం క్యూల్లో నిల‌బ‌డి ఉండ‌టంతో, థియేట‌ర్స్‌కు ఎవ‌రు వస్తారనిపించి సినిమాను పోస్ట్ పోన్ చేశాం. ఇప్పుడు సినిమాల క‌లెక్ష‌న్స్ ప‌రిస్థితి బాగానే ఉంది. అక్క‌డ నుండి మాకు రిలీజ్ డేట్ ప్రాబ్లెమ్ అవుతూ వ‌చ్చింది. అల్రెడి ఇత‌ర సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండ‌టం వ‌ల్ల మేం డిసెంబ‌ర 30న రావాల్సి వ‌చ్చింది.

`ఇంట్లో దెయ్యం నాకేంభ‌యం`లో మీ క్యారెక్ట‌ర్ గురించి చెప్పండి?
- సినిమాలో నేను బ్యాండ్‌మేళం గ్రూపులో ప‌నిచేస్తుంటాను. సాధార‌ణంగా దెయ్యాల‌ను, భూతాలంటే న‌మ్మ‌కం ఉండ‌దు. అవ‌న్నీ మూఢ‌న‌మ్మ‌కాల‌ని న‌మ్ముతుంటాడు. అలాంటి ఓ వ్య‌క్తి అనుకోని ప‌రిస్థితుల్లో మాంత్రికుడుగా మారి ఓ ఇంటికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ నిజంగానే దెయ్యం ఉంటే ఏం చేస్తాడు, రాని మంత్రాల‌ను ఎలా చ‌దువుతాడు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు, దెయ్యానికి మ‌ధ్య శాండ్‌విజ్‌ల ఎలా న‌లుగుతాడ‌నేలా నా క్యారెక్ట‌ర్ సాగుతుంది. భ‌య‌ప‌డుతూ, భ‌య‌పెట్టే క్యారెక్టర్ చేశాను.

క‌థ‌లో న‌చ్చిన ఎలిమెంట్‌?
- దెయ్యం సినిమాల‌న‌గానే ఓ పాత ఇంట్లోనో,పాడుబ‌డిన ఇంట్లోనే దెయ్యం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఓ పెళ్లి ఇంట్లోకి దెయ్యం వ‌స్తే ఎలా ఉంటుంద‌నేదే కాన్సెప్ట్‌. క‌థ విన‌గానే కొత్త‌గా అనిపించింది.

ఈ సినిమా ఎలా ప్రారంభమైంది ?
-2014నుండి సినిమా చేయాల‌ని నేను, డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డిగారు, ప్ర‌సాద్‌గారు డిస్క‌ష‌న్స్ మొద‌లు పెట్టాం. గ‌తంలో మేం చేసిన `సీమ‌ట‌పాకాయ్‌`, `సీమ‌శాస్త్రి` సినిమాలు పెద్ద విజ‌యాల‌ను సాధించాయి. రెండు, మూడు క‌థ‌లు అనుకున్నాం కానీ మాకే శాటిస్పాక్ష‌న్‌గా అనిపించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌ని జోన‌ర్లో సినిమా చేద్దామ‌ని అనుకోగానే హ‌ర్ర‌ర్ కామెడి సినిమాల్లో మీరు ఇప్ప‌టి వ‌ర‌కు యాక్ట్ చేయ‌లేద‌ని నాగేశ్వ‌ర‌రెడ్డిగారు అన్నారు. అలా సినిమాకు సంబంధించి ఒక పెళ్ళి ఇంట్లో దెయ్యం ఉంటుంద‌ని నాగేశ్వ‌ర‌రెడ్డిగారు చెప్పగానే నాకు బావుంద‌నిపించి ఓకే చెప్పేశాను.

Allari Naresh interview gallery

ఈ మధ్య మీరు నటించిన సినిమాలు పెద్లద సక్సెస్ కాలేదు ఎందుకు?
- `సుడిగాడు` సినిమా నా కెరీర్‌కు ఒక మ‌గ‌ధీర అయ్యింది. ఆ సినిమా నాకెంతో మంచి చేసిందో కానీ అంతే చెడ్డ కూడా చేసింది. `సుడిగాడు` త‌ర్వాత టైటిల్ న‌వ్వించాల‌ని అంద‌రూ అనుకోవ‌డంతో ఫైట్స్‌, డ్యాన్సుల్లో, సెంటిమెంట్ సీన్స్‌లో కామెడి చేయ‌డం మొద‌లు పెట్టాను. సాధార‌ణంగా ఒక‌ప్పుడు నా సినిమాల్లో చిన్న ఎమోష‌న్ పార్ట్ ఉండేది. ఉదాహ‌ర‌ణ‌కు కిత‌కిత‌లు వంటి సినిమా ఎంత కామెడిగా ఉన్నా, లోప‌ల ఓ ఎమోష‌న్ పార్ట్ కూడా ఉంటుంది. దాన్ని ఆడియెన్స్ ఫీల్ అయితే సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యేది. సుడిగాడు త‌ర్వాత కామెడిపైనే కాన్‌స‌న్ ట్రేష‌న్ అంతా పెట్టేయ‌డంతో అవ‌న్నీ ప‌క్క‌న పెట్టాయాల్సి వ‌చ్చింది. కానీ క‌థ కోసం కామెడి చేయాలి కానీ, కామెడి కోసం సినిమా చేయ‌కూడద‌ని ఈ సినిమాతో డిసైడ్ అయ్యి సినిమా చేశాను.

ఈ సినిమాలో స్పూఫ్ చేశారా?
- లేదండీ...స్పూఫ్‌లు చేయ‌డ‌కూడ‌ద‌ని గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్నాను. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఈ విష‌యాన్ని అల్రెడి చెప్పేశాను కూడా. యాక్టింగ్ కోర్సులో ఇమిటేష‌న్ చేయ‌డం న‌టించ‌డం కాద‌ని చెబుతూనే ఉంటారు. కానీ నేను `దొంగ‌ల‌బండి` నుండి `సుడిగాడు` వ‌ర‌కు విప‌రీతంగా స్పూఫ్‌లు చేశాను. అలా చేసేట‌ప్పుడు వేరే న‌టుల ఫ్యాన్స్ ఫీల్ కాకూడ‌ద‌ని న‌న్ను నేను త‌క్కువ చేసుకునేవాడిని కానీ ఇప్పుడు అలా చేయ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నాను. ఇంత‌కు ముందు నేను చేసిన `ల‌డ్డుబాబు`, `బందిపోటు` సినిమాల్లో స్పూఫ్‌లు క‌న‌ప‌డ‌వు. ఇక‌పై కూడా చేయ‌ను.

దెయ్యాల‌ను న‌మ్ముతారా?
- దెయ్యాలున్నాయ‌ని న‌మ్మేవాళ్ల గురించి నాకు తెలియ‌దు కానీ నేను దెయ్యాల‌ను న‌మ్మ‌ను. అవ‌న్నీ మ‌న మైండ్ సెట్‌కు సంబంధించిన విష‌యాలు. `ఈవిల్ డెడ్` సినిమా చూసేట‌ప్పుడు భ‌య‌ప‌డ్డ‌ను. రీసెంట్‌గా `డోంట్ బ్రీత్` సినిమా చూసేట‌ప్పుడు రెండు, మూడు చోట్ల థ్రిల్ ఫీల‌య్యాను. న‌వ‌ర‌సాల్లో భ‌యం అనేది కూడా ఒక ఎమోష‌న్‌.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
- నేను చాలా బ్యాన‌ర్స్‌లో న‌టించాను. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌గారు నాకు ఫోన్ చేసి నేను, నాగేశ్వ‌రెడ్డిగారు కలిసి సినిమా చేయాల‌ని చెప్ప‌గానే హ్యాపీగా ఫీల‌య్యాను. పెద్ద నిర్మాత‌లు ఎప్పుడూ పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా చేయాలి. అలా చేస్తే చాలా మందికి ప‌ని దొరుకుతుంది. ఇండ‌స్ట్రీ బావుంటుంది.

కామెడి సినిమాల‌కే ప‌రిమిత‌మ‌వుతారా?
- యాక్ష‌న్ సినిమాలు చేసేంత ఫిజిక్ నా ద‌గ్గ‌ర లేద‌ని అనుకుంటున్నాను ఇది త‌ప్ప ఒక యాక్ట‌ర్‌గా నేను అన్ని ర‌కాల సినిమాలు చేయాల‌నుకుంటాను. అయితే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నేను చేయ‌గ‌ల‌ను అని ఆలోచిస్తాను. అలాగే నేను కామెడికీ దూరంగా చేసిన ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఎందుకంటే న‌రేష్ సినిమా అంటే ఆడియెన్స్ కామెడిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కత్వం ఎప్పుడు చేస్తారు?
- ప్ర‌స్తుతం న‌టుడుగా కొన‌సాగుతున్నాను. క‌చ్చితంగా ద‌ర్శ‌క‌త్వం చేస్తాను. ఒకేసారి రెండు ప‌డ‌వ‌ల‌పైన కాలు పెట్ట‌డం ఎందుక‌నిపించింది. అదీ కాకుండా బాపుగారు, కె.విశ్వ‌నాథ్ వంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుల వ‌ద్ద వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. అయితే ద‌ర్శ‌కుడిగా నేను హండ్రెడ్ ప‌ర్సెంట్ రెడీగా లేను. 2020 మేలో ద‌ర్శకుడిగా ఓ సినిమా ను

తదుప‌రి చిత్రాలేంటి?
- మ‌ల‌యాళ చిత్రం ఒరు వ‌డ‌క్క‌న్ సెల్ఫీని అలా ఎలా ఫేమ్ అనీష్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాను. ఫిభ్ర‌వ‌రిలో సినిమా మొద‌లు పెడ‌తాం. భీమినేని శ్రీనివాస‌రావుగారి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, కొత్త ద‌ర్శ‌కుడు స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved