pizza
Allari Naresh interview about Selfie Raja
స్పీడ్‌గా సినిమాలు చేసేదానికన్నా క్వాలిటీతో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే చిత్రాలు చేయడం మిన్న అని తెలుసుకున్నాను - అల్లరి నరేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

14 July 2016
Hyderaba
d

అల్లరి నరేష్‌సాక్షిచౌదరికామ్నా రనవత్‌ హీరో హీరోయిన్లుగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్‌ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించిన చిత్రం'సెల్ఫీరాజా'. ఈ చిత్రం జూలై 15న భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్‌తో ఇంటర్వ్యూ....

'సెల్ఫీరాజా' అనే టైటిల్‌ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
- బేసిగ్గా కథ అలాంటిది. ప్రతి మనిషికి ఒక వీక్‌నెస్‌ ఉంటుంది. మా సెల్ఫీరాజాకి రెండు వీక్‌నెస్‌లు ఉంటాయి. ఒకటి అందరితో సెల్ఫీలు దిగడంరెండోది నోటి దూల. ఈ రెండిటి వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడువాటి నుండి ఎలా బయటపడ్డాడు అనేది కథాంశం. చివరికి సెల్ఫీల వల్ల తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. దాని నుండి రకరకాల గెటప్‌లతో ఎలా బయటపడ్డాడు అనేది కామెడీని ప్రధానంగా బేస్‌ చేసుకుని చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలో సెల్ఫీ అనేది చాలా కామన్‌ అయిపోయింది. ట్రెండీగా ఫాలో అవుతున్నారు. అందుకే ఈ చిత్రానికి 'సెల్ఫీరాజాఅనే టైటిల్‌ పెట్టడం జరిగింది. అండర్‌ కరెంట్‌గా చిన్న మెసేజ్‌ని కూడా ఈ చిత్రం ద్వారా చెప్పడం జరిగింది.

విజయ్‌మాల్యాలాంటి ప్రముఖులందరితో సెల్ఫీలు దిగారు కదాఅది నిజంగానాప్రమోషన్‌ కోసమా?
- పబ్లిసిటీప్రమోషన్‌ కోసమే. నిజంగా కాదు. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక సెల్ఫీ అనేది బాగా కామన్‌ అయిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లు యూజ్‌ చేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు కట్టాలని విజయ్‌మాల్యా గురించి రోజూ టీవీల్లోనూపేపర్‌లోనూ వింటున్నాం. మా కంటెంట్‌ కోసం చాలా బాగుంటుంది అని ఫొటోసెషన్‌ జరిపి అలా పెట్టడం జరిగింది. విజయ్‌ మాల్యా ఎక్కడ ఉన్నాడో పోలీసులకే తెలియదు. మాకు ఎలా తెలుస్తుంది.

ఒక సెలబ్రిటీ అయిన మీరు సెల్ఫీలు దిగడానికి ఇబ్బంది పడ్డారా?
- కొన్నిసార్లు సెల్ఫీలు దిగడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రావు. అయితే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. ఇటీవలే ఒక సినిమాకి వెళ్లాను. అక్కడ టాయిలెట్‌లో ఒకడు సార్‌ ఒక సెల్ఫీ అని అడిగాడు. ఇక్కడ ఏంటి బాబు బయటికి పద అని చెప్పాను. మరోసారి ఒక ఆర్టిస్ట్‌ చనిపోతే ఎవరో ఒకతను చేయితట్టి పిలిచి నవ్వుతూ సెల్ఫీ అడిగాడు. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎక్కడ ఏం అడగాలో తెలియకుండా బిహేవ్‌ చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

మీ సినిమాల్లో ఎక్కువగా స్పూఫ్‌లు ఉంటాయికారణం?
- అది సరదాగా ఆడియన్స్‌ని నవ్వించడానికి చేసే ప్రయత్నమే తప్ప కావాలని పెట్టి ఎదుటి హీరోలని కించపరిచే ఉద్దేశం కాదు. నా సినిమాల్లో పెట్టిన స్పూఫ్‌ల ద్వారా ఎవరినీ కించపరచలేదు. ప్రతి ఒక్కరూ స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ మీద రెండు మూడు స్పూఫ్‌లను కథకి అవసరమయ్యే విధంగా పెట్టడం జరిగింది. బన్నీ సరదాగా నవ్వుకుంటాడు.

Glam gallery from the event

మీరు హిట్టుఫ్లాపులను ఏవిధంగా స్వీకరిస్తారు?
- నాకు వరుసగా ఏడు ఫ్లాపులు వచ్చాయి. అందులో ఎవర్నీ తప్పు పట్టలేం. ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త సినిమాలు తీయాలని ప్రయత్నం చేస్తుంటాం. ఒక్కోసారి అది సక్సెస్‌ అవుతుంది. మరోసారి ఫెయిల్యూర్‌ వస్తుంది. ఒక యాక్టర్‌గా నా ప్రతి చిత్రం ద్వారా నన్ను నేను పెంచుకుంటూ కొత్తగా చేయడానికి ట్రై చేస్తుంటాను. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని చిత్రాల్లోకంటే ఈ సినిమా ఫుల్‌ శాటిస్‌ఫాక్షన్‌ ఇచ్చింది.

గోపి ఆర్ట్స్‌ బ్యానర్‌లో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
- గోపి ఆర్ట్స్‌లో మా నాన్నగారి డైరెక్షన్‌లో రెండుమూడు చిత్రాలు చేశాను. ఇప్పుడు చౌదరిగారు నాతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అనీల్‌ సుంకరగారితో ఇది నా హ్యాట్రిక్‌ మూవీ. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే నా ఓన్‌ ప్రొడక్షన్‌లాంటిది.

ఈమధ్య కొంచెం స్పీడ్‌ తగ్గించినట్టున్నారు?
- స్పీడ్‌గా సినిమాలు చేసేదానికన్నా క్వాలిటీతో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే చిత్రాలు చేయడం మిన్న అని తెలుసుకున్నాను. సంవత్సరానికి మూడు సినిమాలు ఖచ్చితంగా చేస్తాను. తమిళంలో ఒక సినిమా చేస్తాను. నాతో పనిచేసే ఆర్టిస్టులకి,టెక్నీషియన్స్‌కి అందరికీ బ్రేక్‌ రావాలి.

కామెడీని ప్రధానంగా బేస్‌ చేసుకుని సినిమాలు చేయడానికి కారణం?
- రామారావుగారునాగేశ్వరరావు గారి టైంలో రాజనాలరేలంగిగారు చేసే కామెడీ సపరేట్‌ ట్రాక్‌ ఉంటుంది. చిరంజీవిగారుబాలకృష్ణగారి టైంలో కథలో కామెడీని తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా కామెడీని చూస్తున్నారు. అందరితో పాటు నాకు ఛాలెంజింగ్‌గా కామెడీని కొత్తగా చెయ్యాలని అనిపిస్తుంది. నా మార్కెట్‌కి తగ్గట్టుగా అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు చేసి నిర్మాతలని హ్యాపీగా ఉంచడమే నాకు ఇష్టం.

డైరెక్షన్‌ చేసే ఆలోచన ఉందా?
- రెండు మూడు సంవత్సరాల తర్వాత డైరెక్షన్‌ చేస్తాను. అందులో బయటి హీరో ఉంటాడు. కథ రాసుకున్నాను. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఆ సినిమా ఉంటుంది.

ఈశ్వరరెడ్డితో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
'సిద్ధు ఫ్రం శ్రీకాకుళంతర్వాత ఈశ్వరరెడ్డితో ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రాన్ని మేం అనుకున్న దానికన్నా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అని హ్యాపీగా చెబుతున్నారు.

సాయికార్తీక్‌ మ్యూజిక్‌ ఈ సినిమా హిట్‌కి ఎంతవరకు ప్లస్‌ అయింది?
- సాయి ఈ చిత్రానికి ఫెంటాస్టిక్‌ ఆడియో ఇచ్చాడు. సాంగ్స్‌ అన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. విజువల్‌గా ప్రతి సాంగ్‌ చాలా అద్భుతంగా వచ్చింది.

నెక్ట్స్‌ మూవీ ఏంటి?
- నాగేశ్వరరెడ్డి గారి డైరెక్షన్‌లో భోగవల్లి ప్రసాద్‌గారు నిర్మాతగా 'ఇంట్లో దెయ్యం నాకేం భయంసినిమా చేస్తున్నాను. నెక్ట్స్‌ అనీష్‌కృష్ణ దర్శకత్వంలో 'మేడమీద అబ్బాయిసినిమా ఒకటి కమిట్‌ అయ్యాను. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందే సినిమా నవంబర్‌లో స్టార్ట్‌ అవుతుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved