pizza
Allari Naresh interview (Telugu) about Silly Fellows
రఘువరన్‌ని చూసి ఇండస్ట్రీకి  వచ్చా - అల్లరి నరేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 September 2018
Hyderabad

కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అల్లరి నరేష్‌. అలాగని కేవలం కామెడీ మాత్రమే చేయగలరనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ఎమోషన్స్‌ని కూడా బాగా పండించగలరు. ఇప్పుడు ఆయన నటించిన తాజా చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..

* సిల్లీఫెలోస్‌ అనగానే మీకేం అనిపించింది?
- భీమినేని శ్రీనివాస్‌గారు కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. నేను తమిళ సినిమా కూడా చూశాను. అందులో ఫ్రెండ్‌ సూరి పాత్రలో సునీల్‌ నటిస్తారనగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

* సుడిగాలి టీమ్‌ కాబట్టి ప్రెజర్‌ ఫీలయ్యారా?

- లేదండీ. ప్రెజర్‌ కాస్త అనిపించింది కానీ, భీమినేని శ్రీనివాస్‌గారు స్ర్కిప్ట్‌ మీద చాలా వర్క్‌ చేశారు. దాంతో నాకు ఏమీ ప్రెజర్‌ అనిపించలేదు. పైగా సునీల్‌, నేను కలిసి చేస్తాం కదా.. పోటాపోటీగా చేశాం. డిసి్ట్రబ్యూటర్స్‌ కూడా ఈ కథను మేం చేస్తే బావుంటుందని బాగా సపోర్ట్‌ చేశారు.

* మరోవైపు మహేష్‌ సినిమా కూడా చేస్తున్నట్టున్నారుగా?

- మా పాప పుట్టిన తర్వాత నేను సంతకం చేసిన తొలి సినిమా మహర్షి. ఆ సినిమా ఇప్పటికి ఒక షెడ్యూల్‌ చేశా. ఇంకో 100 రోజుల ప్రయాణం ఉంది.

* మహేష్‌తో ఆన్‌సెట్‌లో ఎలా అనిపించింది?

- చాలా మంచి మనిషి మహేష్‌. ఎదుటివారు చెప్పే జోకులకు నవ్వుతూ ఉంటారు. చాలా ఆనందంగా అనిపించింది.

* ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో చాలా మంది కమెడియన్లు ఉండేవారు. ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తోందా?

- తప్పకుండా ఆ మార్పు తెలుస్తోంది. మారుతున్న సినిమాలో అది కూడా భాగమే. ఇంకొన్నాళ్లు పోతే మునుపటిలా మళ్లీ ఉండవచ్చు.

interview gallery



* మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?
- విజన్‌ 2020 అని పేరు పెట్టుకున్నా. అందరూ కొత్తవారితోనే చేస్తా. ఒక్క ఫ్రేమ్‌లోనూ నేను ఉండను.

* మీ నాన్నగారి తరహా సినిమాలు చేయాలని లేదా?

- నాకు శతమానం భవతిలాంటి కథను పూర్తి కామెడీతో చేయాలని ఉంది. నేను రఘువరన్‌లాగా విలన్‌ అవుదామని ఇండసీ్ట్రకి వచ్చా. మా రవిబాబుగారు నన్ను కామెడీ హీరోని చేశారు. అప్పటి నుంచి ప్రేక్షకులు నా దగ్గర నుంచి అదే కోరుకుంటున్నారు.

* తర్వాతి సినిమాలేంటి?

- మారుతిగారితో ఓ సినిమా చర్చల్లో ఉంది. గిరి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. ఈ మధ్యనే పొల్లాచ్చిలో షూటింగ్‌ చేశాం. మహేష్‌ సినిమా మహర్షి ఉంది.

* సిల్లీఫెలోస్‌ ఏ కైండ్‌ మూవీ అవుతుంది?

- నా దగ్గర, సునీల్‌ దగ్గర ఏదైతే ప్రేక్షకులు మిస్‌ అయ్యామని భావించారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అంటే అంత కామెడీ ఉంటుందన్నమాట.

* మీకు ఇప్పటికీ ఫ్రైడే టెన్షన్‌ ఉంటుందా?

- ఇంకా ఉంటుంది. ఇంత అనుభవం వచ్చినా అది పోదు.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved