pizza
Allu Sirish interview (Telugu) about ABCD
‘ఏబీసీడీ’ మనకు తగ్గట్టు ఉంటుంది! - అల్లు శిరీష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 May 2019
Hyderabad

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఏబీసీడీ’. సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌ రెడ్డి నిర్మాత. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి అల్లు శిరీష్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు.

* ఒక్క క్షణం ఎందుకు ఆడలేదనుకుంటున్నారు?
- ఏమో నాకు తెలియడం లేదు. సినిమా విడుద‌ల‌య్యాక‌ తొలి మూడు రోజులు నేను అసలు ఎందుకు అలా జరిగిందని ఆలోచిండంతోనే సరిపోయింది. తర్వాత కొత్త ఏడాది వచ్చినప్పుడు కాస్త అర్థమైంది. నేను ఆ తర్వాత సినిమా చూస్తున్నప్పుడు శీరత్, అవసరాల ట్రాక్‌ కాస్త పొడవైందనిపించింది. మర్డర్‌ మిస్టరీ కాబట్టి సురభి ఎలా హత్యకు గురైందో తెలుసుకోవాలనేదాని మీదే ప్రేక్షకుల ఆలోచనలన్నీ తిరిగినట్టు అనిపించాయి. ఒరిజినల్‌ క్లైమాక్స్‌ హట్కీగా ఉండేది. కానీ ఇక్కడ క్లైమాక్స్‌ పోర్షన్ కాస్త స్ట్రెచ్ అయినట్టు అనిపించింది. ఫస్టాఫ్‌ లో అబ్బాయి, అమ్మాయి అంతగా ప్రేమించుకున్నప్పుడు, క్లైమాక్స్‌లో ఎంత బాగా రిలేట్‌ అవుతార‌న్నది ఇందులో కీలకం. ఇంకొకటేంటంటే అప్పట్లో చాలా మందికి అస‌లు ఈ సినిమా వస్తున్నట్టు తెలియదు. ఇప్పుడు ఆడియన్స్ లో తిరుగుతుంటే ‘ఏబీసీడీ’ ఎప్పుడండీ అని అడుగుతున్నారు. అప్పట్లో అయితే ‘మీ శ్రీరస్తు.. బావుంటుందండీ. నెక్స్ట్‌ సినిమా ఎప్పుడు’ అని అడిగేవారు. ‘వారం క్రితం వచ్చింది’ అని చెప్పాల్సి వచ్చేది. ఇయర్‌ ఎండ్‌ సినిమా అన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ప్రమోట్‌ చేసుకోవాల్సింది. ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కి సినిమా విడుదలవుతుందని పెద్దగా రీచ్ కాలేదనిపించింది. చూసిన ప్రతి ఒక్కరికీ బాగా నచ్చింది. నాకు ఆ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ కంప్లెయింటూ లేదు. చూసినవారందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతకు ముందు నేను చెప్పిందంతా రివ్యూలు చూసిన వాళ్లు, మిగిలిన వాళ్లు చెప్పింది. అంతేగానీ, ప్రాడెక్ట్‌గా నాకు పెద్ద ఇబ్బందేమీ లేదు. డైరక్టర్‌ నాకు కథ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యే చేశా.

* అంటే సినిమా ఆడకపోయినా ఫర్వాలేదనిపించిందా?
- అబ్బెబ్బె... కన్విన్స్ అయింది దర్శకుడు కథ చెప్పినప్పుడు, నేను ఫస్ట్‌ కాపీ చూసినప్పుడు మాత్రమే.

* అయితే సినిమా పోవడం వల్ల మీరు బాధపడ్డారన్నమాట.
- చాలా పడ్డాను. తొలి రెండు రోజులు ఆ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పటికే ఆ సినిమాపై ఏడాది సమయాన్ని వెచ్చించా. 90-100 రోజులు పనిచేశాం. అంత కష్టాన్ని జనం ఒప్పుకోనప్పుడు కాస్త బాధనిపించింది. అప్పుడు నేను నా జనాల్లో ‘సినిమా ఎందుకు అందుకోలేదు? ఓవర్సీస్‌లో ఇండియాకన్నా బాగా ఎందుకు ఆడింది’ వంటి విషయాలన్నీ అడిగా. ఒక వారం రోజులు మాత్రం ఇవన్నీ జరిగాయి.

* ఏబీసీడీ విషయంలో మీకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన విషయం ఏంటి?
- నేను ఫస్ట్‌ కాపీ చూశా. చాలా బాగా వచ్చింది.

* ఒరిజినల్‌ వర్షన్ కూడా చూశారా?
- రెండేళ్ల క్రితం చూశా. దాన్ని తెలుగుకు తగ్గట్టు చాలా మార్చాం. ఇందులో డ్రామాతో పాటు రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా గ్రాఫ్‌ నాకు చాలా నచ్చింది. నాకు నేను ఇందులో బాగా నచ్చా. రాంచరణ్‌ ఈ సినిమాను చేయమని నాకు సజెస్ట్‌ చేశాడు. ఆ తర్వాత మారుతి, వరుణ్‌ అందరూ చెప్పారు.

* ఆ తర్వాత మీకు ఇంకా నచ్చిందా?
- నేను ముందు సినిమా చూసినప్పుడే నచ్చింది. కాకపోతే నాకు నచ్చిందని, ఆ స్ర్కిప్ట్‌ను నాకోసం చేయమని నేను అడగలేను కదా, ఈ దర్శకుడు కాన్సెప్ట్‌ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.

interview gallery



* ఏబీసీడీని అందరూ పిల్లజమీందారుతో పోలుస్తున్నారు?
- థీమ్‌ని వదిలిస్తే, పిల్ల జమీందారుకు, దీనికీ పెద్ద పోలిక ఉండదు. అమెరికాలో ఉండి, గారాబంగా పెరిగిన అబ్బాయిని ఇండియాకు తరిమేస్తే, అక్కడ అతను జీవితం విలువను ఎలా తెలుసుకున్నాడనేది కథాంశం. అంతేగానీ, ఆస్తి అనేది ఉండదు. ఇందులో ఫాదర్ సన్ విషయం ఉంటుంది.

* మీ నాన్నగారు అలా ఎప్పుడైనా చేశారా?
- లేదండీ. మా నాన్న ఎప్పుడూ అలాంటివి చేయలేదు. కాకపోతే స్పోర్ట్స్‌ కార్‌ అడిగితేనే, ‘ఇన్ని లక్షలిస్తా. మిగిలింది నువ్వు వేసుకుని కొనుక్కో’ అని అన్నారు. అప్పుడు రోషానికి పోయి నేను అది కూడా వద్దనుకుని నా సొంతంగా కొనుకున్నా. ఏ కారైతే కావాలని నాన్నను అడిగానో, దానికి మూడింతలు తక్కువ కారే కుదిరింది. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే.. డబ్బులు సంపాదించడం అంత కష్టమా? అని. సింగిల్‌ డిజిట్స్‌ను, లాక్స్‌ను సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మరో విషయానికి కూడా నేను కనెక్ట్‌ అయ్యా. అదేంటంటే ముంబై జీవితం. అబ్రాడ్‌ జీవితం. మా నాన్న ఒక అమౌంట్‌ ఇచ్చేసేవారు. దాంతోనే నేను నెలంతా సర్దుకునేవాడినన్నమాట.

* యు.ఎస్‌.కి, ముంబైకి వెళ్లినప్పుడు పార్ట్‌టైమ్‌ పనిచేయాలనిపించిందా?
- లేదండీ. నేను మాస్‌ కమ్యూనికేషన్ స్టూడెంట్‌ కాబట్టి నేను ఓ పేపర్‌లో ఇంటర్న్‌షిప్‌ చేశా. డీఎన్ఏ పత్రికలో అవకాశం వచ్చింది. కానీ దానికి చాలా సమయం పడుతుందని నేను వెళ్లలేదు.

* మీ ఇన్నేళ్ల నటన మీకు ఏం నేర్పింది?
- చాలానే నేర్పింది. కెమెరా అంటే ఉన్న భయాన్ని పోగొట్టింది. అలాగే చాలా మంది సీనియర్లతో పనిచేశాను. వాళ్లు ఎలా సీన్లో జీవిస్తారో తెలుసుకున్నా. ‘కొత్తజంట’ చేసేటప్పుడు సుకుమార్‌గారిని ఒకసారి డీసెంట్‌ ఆర్టిస్ట్‌ అంటే ఎవరు? అని అడిగా. అందుకు ఆయన దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు డీసెంట్‌ ఆర్టిస్ట్‌. దర్శకుడు చెప్పిందానికి, తన సొంత విషయాన్ని కలగలపి నటంచేవాడు ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పారు. ఆయన కృతిసనన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్పారు. అప్పటి నుంచి ఇంప్రవైజ్‌ చేసేవాడిని. అంతకు ముందు దర్శకుడు చెప్పింది కాకుండా ఎక్కువ ఏదైనా చేస్తే వినయం లేదనుకుంటారేమోనని అనుకునేవాడిని. కానీ సుకుమార్‌గారు చెప్పిన తర్వాత చాలా మార్చుకున్నా. నన్ను నేను స్పాంటానియస్‌గా ఇంప్రవైజ్‌ చేసుకుంది అవార్డు వేడుకల్లో హోస్ట్‌ చేస్తున్నప్పుడు. అక్కడ రీటేక్‌లుండవు. 70 శాతం స్ర్కిప్ట్‌ ప్రకారమే వెళ్తాం. క్లోజ్‌, కట్‌.. వంటివి ఉండవు. అందుకే నాకు హోస్టింగ్‌ వల్లనే సమయస్ఫూర్తి వచ్చింది. ‘ఏబీసీడీ’లోనూ ఇలాంటి స్కిట్‌లు చాలా ఉన్నాయి.

ఇది పొలిటికల్‌ డ్రామానా?
- అలాంటిదేమీ కాదు. కానీ కొన్ని సన్నివేశాలు నా దగ్గరకు ఎలా వచ్చాయి, వాటి నుంచి నేను ఎలా మారాను? అనే కథలో భాగంగా కాస్త పొలిటికల్‌ డ్రామా ఉంటుంది. మన ఆడియన్స్కి తగ్గట్టు ఉంటుంది.

‘ మీకు సినిమా నిర్మాణం గురించి అవగాహన ఉంది. మీరు పనిచేసే సినిమాల్లో ఇన్వాల్వ్‌ అవుతారా?
- లేదండీ. ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమాలు తీసేవారికి, సినిమాను ఎలా అమ్మాలి? ఎంతకు అమ్మాలి? వంటివన్నీ తెలుసు. అందుకే వాటిని గురించి నేను ఎప్పుడూ అడగను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved