pizza
Allu Sirish interview (Telugu) about Okka Kshanam
దర్శకుడిపై గౌరవం పెరిగింది - అల్లు శిరీష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

29 December 2017
Hyderabad

అల్లు శిరీష్‌, సురభి, అవసరాల శ్రీనివాస్‌, శీరత్‌ కపూర్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఒక్క క్షణం'. వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. సినిమా డిసెంబర్‌ 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్‌తో ఇంటర్వ్యూ...

రెస్పాన్స్‌ ఎలా ఉంది?
- సినిమాకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఓ హీరోగా ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఫైట్స్‌ బాగా చేశానని, ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా చేశానని అంటున్నారు.

కెరీర్‌ ప్రారంభంలోనే కాన్సెప్ట్‌ సినిమాలు చేయడానికి రీజనేంటి?
- ఒక్క క్షణం నా 5వ సినిమా. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు చాలా సేఫ్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ కావడంతో మరోసారి కొత్త కాన్సెప్ట్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకుంటున్నాను. అదే సమయంలో ఆనంద్‌ దర్శకత్వంలో ఇలాంటి కథ చెప్పారు. ఆనంద్‌ 40 నిమిషాలు కథ చెప్పిన విధానం నాకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ప్యారలల్‌ లైఫ్‌ అనే పాయింట్‌ వినగానే.. ఆ కాన్సెప్ట్‌ చాలా రోజులు నన్ను హాంట్‌ చేసింది. మంచి పాయింట్‌ ఎప్పుడూ మనల్ని హాంట్‌ చేస్తుందనే కాన్సెప్ట్‌తో 'ఒక్కక్షణం' సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

కథ విన్న అరవింద్‌ ఏమన్నారు?
- నాన్నగారికి కథ బాగా నచ్చింది. అప్పటికింకా క్లైమాక్స్‌ ఇంకా రాయలేదు. కథలో చిన్న చిన్న చేంజస్‌ తప్ప నాన్నగారు ఏం చెప్పలేదు. బన్ని కథ వినలేదు కానీ..సినిమా అంతా పూర్తయిన తర్వాత సినిమా చూశాడు. అంతకు ముందు టీజర్‌ చూసి సినిమా బావుందని అప్రిసియేట్‌ చేశాడు.

ప్యారలల్‌ లైఫ్‌ అనే కాన్సెప్ట్‌ను మీరు నమ్ముతారా?
- కథ విన్న దగ్గర నుండి..నిజంగా మనకు, వేరొకరితో ప్యారలల్‌ లైఫ్‌ ఉండొచ్చునేమో, యాదృచ్చికంగా ఒకరికి జరిగింది మనకు కూడా జరగొచ్చునేమో అని నమ్ముతాను.

కామెడీ లేదని అంటున్నారు కదా?
- ఒక సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ కామెడీ ఎందుకు లేదని అంటారు. మరో సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ ప్యారలల్‌ లైఫ్‌ అనే కాన్సెప్ట్‌ కోసం వచ్చినప్పుడు ఈ కామెడీ ఎందుకు అని అంటారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సినిమాలో ఉన్న దాని కంటే ఎక్కువగా షూట్‌ చేశాం. అయితే దాన్ని తగ్గించేసి మెయిన్‌ కథలోకి త్వరగా వచ్చేస్తామనిపించి ఆ సీన్స్‌ను ఎడిట్‌ చేశాం. ఆనంద్‌ కథను ఎంత బాగా చెప్పాడో అంత కంటే బాగా తీశాడు. తనపై గౌరవం పెరిగింది.

ఫోక్‌ సాంగ్‌ను తీసేశారెందుకు?
- నిజానికి అవసరమనే షూట్‌ చేశాం. అది కూడా చివరి నిమిషంలో చిత్రీకరించిన ఈ సాంగ్‌ను రన్‌ టైమ్‌ సమస్య రావడంతోపాటు, కథ నుండి బయటకు వెళ్లిపోతామనిపించి..ఎడిట్‌ చేయాల్సి వచ్చింది. అందుకే టైటిల్స్‌ రోలింగ్‌ సమయంలో ఆ సాంగ్‌ను పెట్టాం.

కథల ఎంపిక ఎలా ఉంటుంది?
- నాకు లవ్‌ స్టోరీస్‌, ఫ్యామిలీ స్టోరీస్‌ అంటే ఇష్టం. అలాగని అన్నీ అలాంటి చిత్రాలే చేయలేం. బన్ని వేదంలో కేబుల్‌ రాజు పాత్ర, రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రను చేసినట్టు..మనం కూడా కొత్తగా చేద్దామనిపిస్తుంటుంది. అందుకనే ఎంటర్‌టైనింగ్‌తో సాగే కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తిని చూపుతుంటాను. ఇలాంటి సినిమాలు చేస్తే ఆడియెన్స్‌కు కూడా నా సినిమాలు కొత్తగా అనిపిస్తాయి. నేను కథలు ఓకే చేశాక..నాన్న కూడా విని కథలో మార్పులేమైనా ఉంటే చెబుతారు.

తదుపరి చిత్రాలు?
- రెండు, మూడు కథలు విని..ఓకే చెప్పాను. ప్రస్తుతం అవి డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉన్నాయి. కొత్త వాళ్లతో చేయడానికి నేను రెడీయే. ఎందుకంటే వాళ్ల ఆలోచనలు అవుటాఫ్‌ ది బాక్స్‌ ఉంటాయి. మంచి కసి, కమిట్‌మెంట్‌ ఉన్న డైరెక్టర్స్‌తో పనిచేస్తే అవుట్‌పుట్‌ బావుంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved