pizza
Anisha Ambrose interview (Telugu) about Fashion Designer s/o Ladies Tailor
వంశీగారితో చేయ‌డం నా అదృష్టం - అనీషా ఆంబ్రోస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 May 2017
Hyderabad

సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించిన చిత్రం ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్. వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మాత‌. జూన్ 2న విడుద‌ల కానుంది. ఈ చిత్రం గురించి అనీషా ఆంబ్రోస్ హైద‌రాబాద్‌లో విలేకరుల‌తో మాట్లాడారు.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఫారిన్ నుంచి విలేజ్‌కి వ‌చ్చిన అమ్మాయిగా న‌టించాను. విలేజ్ వాతావ‌ర‌ణం, చీర క‌ట్టుకోవ‌డం వంటివ‌న్నీ ఇష్ట‌ప‌డే అమ్మాయిగా న‌టించాను. శారీ క‌ట్టుకోవ‌డం, విలేజ్ క‌ల్చ‌ర్ వంటివి తెలియ‌క‌పోయినా... వాటిని చూసి ముచ్చ‌ట‌ప‌డుతుంది. ఆ మొత్తం ప్రాసెస్ చాలా బాగా ఉంటుంది.

* పెద్ద వంశీగారితో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం నా అదృష్టం. తొలిసారి గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించాను. వంశీగారు డైర‌క్ష‌న్ చేస్తున్నార‌నే నేను గ్లామ‌ర‌స్ రోల్‌కి ఒప్పుకున్నా.

* గ్లామ‌ర‌స్ రోల్ అంటే ఎలా ఉంటుంది?
- అంటే నా గ‌త చిత్రాల్లో చాలా సింపుల్‌గా చేశాను. కానీ ఈ సినిమాలో రొమాన్స్ ఉంటుంది. ఇంకా కాస్ట్యూమ్స్ లో కూడా షాట్స్ వంటివి వేసుకున్నా. అవ‌న్నీ ఇందులో డిఫ‌రెంట్‌గా అనిపిస్తాయి.

* లొకేష‌న్స్ గురించి చెప్పండి?
- అసలు ఆ లొకేష‌న్స్ కి నేను ఇప్ప‌టిదాకా వెళ్ల‌లేదు. కానీ ఈ సినిమా కోసం వెళ్లాను. ఇందులో ఐదు పాట‌లున్నాయి. అన్నీ పాపికొండ‌ల్లో రికార్డ్ చేశాం. అక్కడ నేను ఎనిమిది రోజులున్నా. సెల్‌ఫోన్ లేదు.మా త‌ల్లిదండ్రుల‌తో క‌నెక్ష‌న్ లేదు.. ఇలా నేను ఉండ‌టం అదే తొలిసారి.

* ముగ్గురు హీరోయిన్ల మ‌ధ్య చేయ‌డం ఎలా అనిపించింది?
- ముగ్గురు హీరోయిన్లు ఉన్న మాట వాస్త‌వ‌మే. కానీ మా అంద‌రికీ స‌మ ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు.

* ముగ్గురి మ‌ధ్య క్యాట్ ఫైట్స్ ఉండేవా?
- అస‌లు అలాంటి ఆలోచ‌న‌లు మీకు ఎందుకు వ‌స్తాయి? అలాంటివి మా మ‌ధ్య ఏమీ లేవు. మేం ఫ్యామిలీ మెంబ‌ర్స్ లా ఉన్నాం.

* సుమంత్ అశ్విన్‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- ఒక ఫ్రెండ్‌తో క‌లిసి చేస్తున్న‌ట్టు అనిపించింది. కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు ఫ్రెండ్స్ తో క‌లిసి ప్రోగ్రామ్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది.

* ఈ సినిమా క‌థేంటండీ?
- లేడీస్ టైల‌ర్‌కి ఒక కొడుకుంటే.. అత‌నేం చేస్తుంటాడు అని సినిమా చేశాం. స్టోరీ మా నిర్మాత చెబుతారు.

* మీరు లేడీస్ టైల‌ర్ చూశారా?
- నేను చూశానండీ. ఆ సినిమాకూ, దీనికీ చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది. సీక్వెల్ కాబ‌ట్టి ఆ మార్పును అంద‌రూ గ‌మ‌నిస్తారు.

Anisha Ambrose interview gallery

* శ్రీధ‌ర్‌ గురించి చెప్పండి?
- ఆయ‌న న‌టీన‌టుల్ని చాలా బాగా చూసుకుంటారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌ను కూడా చెప్పుకోగ‌ల చనువు ఉంటుంది ఆయ‌న‌తో. ఆ భ‌రోసాతో ఆయ‌న‌తో ప‌ది సినిమాలు కూడా చేయొచ్చు.

* మీరు డ‌బ్బింగ్ చెప్పారా?
- లేదండీ.. ఆ స‌మ‌యంలో నేను హైద‌రాబాద్‌లో లేను. ఒక‌వేళ ఉంటే చెప్పి ఉండేదాన్ని.

* మీ ఫేవ‌రేట్ సాంగ్ ఏంటి?
- ఒక క్లాసిక‌ల్ సాంగ్ ఉందండీ. చాలా డిఫ‌రెంట్‌గా తీశారు. సినిమాలో చూసిన వారు నా అభిప్రాయాన్ని ఒప్పుకుంటారు. ఈ పాట‌లో కొన్ని యూనిక్ సౌండ్స్ ఉంటాయి. ఇందులో ఆ సౌండ్స్ ను ముందు క‌లెక్ట్ చేసి, ఆ త‌ర్వాత పాట చేశారు. అది చాలా యూనిక్‌గా అనిపించింది. అందుకే నాకు ఆ పాటంటే అంత ఇష్టం.

* ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చాన్ప్ ఎలా మిస్ అయింది?
- ఆయ‌న‌తో చేయ‌డ‌మంటే చాలా నెర్వ‌స్‌గా ఉంటుంది. కాజ‌ల్ సెల‌క్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్టుతో అంటే నాకు నెర్వ‌స్‌గా ఉండేదేమో.

* మీ త‌దుప‌రి సినిమాలేంటి?
- మ‌నోజ్‌తో చేస్తున్నాను. ఆ సినిమా ర‌న్నింగ్‌లో ఉంది. కొత్త క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి. అందువ‌ల్ల ఇప్పుడు చెప్ప‌లేను.

* త‌మిళ్‌లో చేస్తున్నారా?
- చేస్తున్నానండీ. జ‌స్ట్ నిన్ననే ఓ సినిమాకు సంత‌కం చేశాను. వాళ్లే అనౌన్స్ చేస్తారు.

* ఫ్యాష‌న్ డిజైన‌ర్‌లో మీ పాత్ర గురించి మీ ఒపీనియ‌న్ ఏంటి?
- ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు నా పాత్ర త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌ని నా న‌మ్మ‌కం. ఎందుకంటే సింపుల్‌గా న‌న్ను చూసిన త‌ర్వాత ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయ‌డం చాలా హ్యాపీ. చూసేవాళ్ల‌కు కూడా వెరైటీగా ఉంటుంద‌న్న‌మాట‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved