pizza
Anupama Parameshwaran interview (Telugu) about Premam
విలక్షణమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను - అనుపమ పరమేశ్వరన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

4 October 2016
Hyderaba
d

చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లోదర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మించిన  చిత్రం 'ప్రేమమ్`  ఈ సినిమా అక్టోబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. న‌న్ను తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. వారు చూపిస్తున్న ఆద‌ర‌ణ చూస్తుంటే నాకు ఎంతో ఎన‌ర్జినిస్తుంది. అందుకే నేను స‌రికొత్త పాత్ర‌ల్లో న‌టించాల‌నుకుంటున్నాను. ప్రేమ‌మ్ సినిమాలో నాగ‌చైత‌న్యతో క‌లిసి యాక్ట్ చేయ‌డాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పుకొంటున్న మ‌ల‌యాళీ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో ఇంట‌ర్వ్యూ విశేషాలు....

క్యారెక్టర్‌ గురించి....
- `ప్రేమమ్‌` తెలుగు వెర్షన్‌లో నా క్యారెక్టర్‌ పేరు సుమ. మలయాళంలో ఓ యంగ్‌ టీంతో కలిసి చేసిన ఎంజాయ్‌ చేస్తూ చేసిన సినిమా ప్రేమమ్‌అలాగే తెలుగులో కూడా మంచి యంగ్‌ టీం కుదిరింది. తెలుగులో నటిస్తున్నప్పుడు పిక్నిక్‌లా భావించాను. అయితే తెలుగు భాష తెలియకపోవడం ఒక్కటే కాస్తా ఇబ్బందిగా అనిపించింది. నెటివిటీ ప్రకారం తెలుగులో చేంజస్‌ చేశారు. మలయాళంలో కంటే తెలుగులో నా క్యారెక్టర్‌ లెంగ్త్‌ కూడా ఎక్కువే.

నాగచైతన్యచందు మొండేటి వర్కింగ్‌ స్టయిల్‌ గురించి....
- నాగచైతన్య డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. సినిమా ప్రారంభంలో చాలా టెన్షన్‌ పడేదాన్ని. అయితే చైతన్య సెట్‌కు వచ్చి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. దాంతో నాలో భయం తగ్గిపోయింది. అలాగే డైరెక్టర్‌ చందు మొండేటి చాలా కామ్‌ అండ్‌ కూల్‌. ఏ పరిస్థితినైనా చక్కగా హ్యాండిల్‌ చేసేవాడు. సెట్‌లో అంతా కంఫర్ట్‌గా ఉండేలా చూసేవాడు. మంచి టాలెంటెడ్‌ దర్శకుడు.

వద్దని చెప్పడానికి కారణం కనిపిచంలేదు......
- నేను మలయాళ వెర్షన్‌లో ప్రేమమ్‌ చేసినప్పుడు నా క్యారెక్టర్‌నే కాదుసినిమాను కూడా బాగా ప్రేమించాను. ఇక తెలుగులో రీమేక్‌ చేస్తున్నామని యూనిట్‌ సభ్యులు నన్ను కలిసినప్పుడు కాస్ట్‌ అండ్‌ క్రూ గురించి నాకు తెలిసింది. మంచి టీం కావడంతో అక్కడో వద్దని చెప్పడానికి వేరే కారణం లేదనిపించి తెలుగులో కూడా నటించడానికి ఒప్పుకున్నాను.

Glam gallery from the event

బోర్‌ ఫీల్‌ కాలేదు...
- తెలుగుమలయాళ వెర్షన్స్‌కు సంబంధించి నా పాత్ర పరంగా ఏ మార్పులు లేదు. తెలుగు వెర్షన్‌ను నేను చూడలేదు. తెలుగులో సుమ అనే క్యారెక్టర్‌లో కనిపించాను. మలయాళంలో ప్రేమమ్‌ మూవీ చేసి రెండేళ్లయ్యింది. అందుకే తెలుగులో చేసేటప్పుడు బోర్‌గా ఫీల్‌ కాలేదు.

డిఫరెంట్‌ రోల్స్‌ ఇష్టపడతాను...
- నేను నెగటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేయడానికి ఇష్టపడతాను. 'అ...ఆసినిమాలో నేను నటించడానికి ముఖ్యమైన కారణాల్లో అదొకటి. అలాగే త్రిక్రమ్‌గారి గురించి చాలా విన్నాను. ఆయనతో వర్క్‌ చేయాలనుకున్నాను. నేను విలక్షణంగా ఉండే రోల్స్‌ చేయడానికి ఇష్టపడతాను.

ఎవరితోనూ ప్రేమలో లేను...
- అందరికీ ఎవరితో ఒకరితో క్రషెష్‌ ఉంటాయి. అలాగే నాకు క్రష్‌ ఉంది కానీనేను ఎవరితోనూ ప్రేమలో పడలేదు.

డబ్బుకు ప్రాధాన్యతనివ్వను....
- సినిమాల్లో అవకాశం వస్తున్నాయి కానీ మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాను. మంచి పాత్రలు వస్తేనే చేయడానికి ఇష్టపడతాను. నేను చేసే క్యారెక్టర్‌కు సినిమాలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉండాలని భావిస్తాను. డబ్బుకు అంత ప్రాధాన్యతనివ్వను. నేనే చేసే పనితో నేను హ్యాపీగా ఉండాలనుకుంటాను.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌..
- తెలుగులో శతమానం భవతి నేను చేస్తున్న మూడో సినిమా. మలయాళంలో ప్రేమమ్‌ తర్వాత ఓ సినిమా చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేశాను. అది దీపావళికి విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved