pizza
Anushka interview about Rudramadevi
రుద్రమ జీవితంలో ఆ ఇన్సిడెంట్‌ తెరపైనే చూడాలి - అనుష్క
You are at idlebrain.com > news today >
Follow Us

06 October 2015
Hyderabad

స్వీటీ అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం రుద్రమదేవి. గుణటీమ్‌ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్‌ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. దేశంలోనే తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రమిది. ఈనెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా అనుష్క శెట్టి హైదరాబాద్‌లోని గుణశేఖర్‌ కార్యాలయంలో సినిమా విశేషాలు ముచ్చటించారు.

రుద్రమదేవి యూనిక్‌ విశేషాలు?
అరుంధతి పీరియడ్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిక్షన్‌ సినిమా. బాహుబలి జానపదం బ్యాక్‌డ్రాప్‌ ఫిక్సన్‌ సినిమా. రుద్రమదేవి జెన్యూన్‌ హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా. పాఠ్య పుస్తకాల్లో రుద్రమదేవి చరిత్ర గురించి చదువుకున్నాం. కాకతీయుల సామ్రాజ్యంలో, రుద్రమదేవి జీవితంలో ఎన్నో ఎమోషన్స్‌ ఉన్నాయి. వాటన్నిటినీ వెండితెరకెక్కించే అసాధారణ ప్రయత్నం గుణశేఖర్‌ చేశారు. ఇది సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. అద్భుత విజయం అందుకుంటాం.

3డి మేకింగ్‌ కష్టమా?
3డి అంటే కష్టమైనదే. అలైన్‌మెంట్‌ ఏదైనా మార్చాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. లెన్స్‌ వంటివి మార్చాలంటే 45 నిమిషాల సమయం వృథా అవుతుంది. అది చాలా కష్టం. అందుకే ఆన్‌సెట్స్‌ ఎంతో జాగ్రత్తపడి చేసిన చిత్రమిది. డైలాగ్‌ డెలివరీ ప్రతిదీ 3డికి తగ్గట్టే జాగ్రత్త పడాల్సి వచ్చింది.

రుద్రమదేవి షూటింగ్‌ ఆలస్యం .. ఎందువల్ల?
రుద్రమదేవి షూటింగ్‌ డిలే అయ్యిందని అనుకుంటున్నారు కానీ, అలాంటిదేం లేదు. విజువల్‌ గ్రాఫిక్స్‌తో పని అంటే చాలా సమయం తీసుకుంటుంది. 3డి, గ్రాఫిక్స్‌ అంటే వందల కోట్ల పెట్టుబడులతో వ్యవహారం కాబట్టి ప్రతిదీ చివరి వరకూ చెప్పలేం. కాకతీయుల చరిత్ర మనదే అయినా దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్‌ దొరకలేదు. దాని కోసం రీసెర్చ్‌తోనే చాలా సమయం తీసుకుంది. ప్రతిదీ కాన్వాస్‌ రెడీ చేసి నెలల పాటు కేవలం డిష్కసన్‌కే కేటాయించాం. ప్రతిదీ కూలంకుషంగా చర్చించాకే సెట్స్‌కి వెళ్లేవాళ్లం.

రానా సరసన నటించారు. మీ పెయిర్‌ ఎలా ఉంటుంది?
రానా నాకు సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచి తెలుసు. ఈ సినిమాలో రానాతో పెయిర్‌గా నటించా. తెరపై మా జంట చాలా ఫ్రెష్‌ అనిపిస్తుంది. రానా చూడటానికి కాస్త భారీ ఆకారంతో కనిపిస్తాడు కానీ, ఈ చిత్రంలో రొమాంటిక్‌ యాంగిల్‌లో కనిపిస్తాడు.

అరుంధతికి, .. బాహుబలి, రుద్రమదేవి.. పోలికలు? అప్పటికి ఇప్పటికి మేకింగ్‌లో మార్పులు?
అరుంధతి చిత్రంతో వేరే ఏ సినిమాని పోల్చలేను. అరుంధతి నా కెరీర్‌లో యూనిక్‌. నా కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ సినిమా అది. అలాగే గ్రాఫిక్స్‌, టెక్నాలజీ పరంగా అప్పటికి ఇప్పటికి చాలా మార్పొచ్చింది. ఇప్పుడు ప్రతిదీ చాలా ఈజీ అయిపోయింది. జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న టెక్నీషియన్స్‌ బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు పనిచేశారు. విఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌లో దిగ్గజాలు పనిచేశారు. రాజమౌళి, గుణశేఖర్‌ వంటి గొప్ప టెక్నీషియన్స్‌ ఔట్‌పుట్‌ని అద్భుతంగా తీసుకున్నారు.

రుద్రమదేవిలో స్పెషాలిటీ?
రుద్రమదేవి జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ ఎప్పటికీ మర్చిపోలేనిది. అది ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశమది. రుద్రమదేవి పాత్రలో బ్యూటీ ఉంది. పెయిన్‌ ఉంది. ఎమోషన్‌ ఉంది. అవన్నీ తెరపై మెస్మరైజ్‌ చేస్తాయి.

మీకు మాత్రమే యూనిక్‌ ఛాన్సెస్‌.. ట్యాలెంటు వల్లనా? అదృష్టమా?
నా జీవితంలో ఇన్ని మంచి అవకాశాలు వచ్చాయంటే అది నా అదృష్టం. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి అవకాశాలు వచ్చాయంటే ట్యాలెంటు ఒక్కటే కాదు, అదృష్టం కూడా ఉంది కాబట్టే.

ఆభరణాలు అంటే ఇష్టమా?
రుద్రమదేవి ఆభరణాలు యూనిక్‌. వాస్తవంగా నాకు జువెలరీ పెద్దగా నచ్చవు. పెళ్లిళ్లకు వెళ్లినా పెట్టుకోను. కానీ రుద్రమదేవి డిజైన్లు చూశాక నేను కూడా నగలు, ఆభరణాలు కొనుక్కుంటున్నా. చరిత్ర ఆధారంగా, స్కల్ప్చర్‌ డిజైన్స్‌ చూసి నీతాలుల్లా ఆభరణాల్ని డిజైన్‌ చేశారు.

నిత్యా మీనన్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
నిత్యామీనన్‌ అద్భుతమైన నటి. ఫోకస్సివ్‌గా ఉంటుంది. రుద్రమదేవి చిత్రంలో మామధ్య కొన్ని ఇంట్రెస్టింగ్‌ సీన్స్‌ ఉన్నాయి. ఆన్‌సెట్స్‌ మేం స్నేహంగా కలిసిపోయి యోగా తదితర విషయాల్ని ముచ్చటించుకునేవాళ్లం. నిత్యాకి యోగా అంటే చాలా ఆసక్తి. అలాగే క్యాథరిన్‌, నిత్యా క్యారెక్టర్లు సినిమాలో అత్యంత కీలకమైనవి. అందుకే వాటి గురించి ఎక్కడా రివీల్‌ చేయలేదు.

గోనగన్నారెడ్డి ఎవరో తెలియక ముందు.. సీన్‌? బన్ని అని తెలిశాక పరిస్థితి?
గోనగన్నారెడ్డి .. గోన గన్నారెడ్డి అంటూ అరుపులు వినిపించే సన్నివేశాల్ని తెరకెక్కించారు. అక్కడ నిజంగా గన్నారెడ్డి పాత్రధారి లేకపోయినా జనాలు ఊహించుకుని అరవాలి. ఎవరు చేస్తారు.. ఈ రేంజు క్యారెక్టర్‌? అనుకుంటుండగానే.. ఆ క్యారెక్టర్‌లో బన్ని నటిస్తున్నారని తెలిసింది. అతడే సూటబుల్‌ అని అనుకున్నాం. కొత్తదనాన్ని ప్రోత్సహించే హీరో బన్ని. వేదం చిత్రానికి అతడే కర్త అయ్యాడు. మళ్లీ ఇప్పుడు రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్ర కోసం ముందుకొచ్చాడు.

నిర్మాత నష్టపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా?
నేను డబ్బులు వెనక్కి ఇచ్చేంత ఎదగలేదు. సినిమాని బట్టి రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తా. అలాగే కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోను. అది తెలిస్తే అందరూ వెంటబడతారు. పారితోషికం తీసుకోను.. అంటే కథే వేరుగా ఉంటుంది. కథ నచ్చితే ఏదైనా చేస్తాను. డబ్బు అంటే ఇష్టం. అలాగని డబ్బు కోసమే నటించను. నా కెరీర్‌లో గెయిన్‌ ఉంది కానీ లాస్‌ లేదు. డబ్బు, నటన అన్నీ గెయిన్‌. నాగార్జున, శ్యాంప్రసాద్‌ రెడ్డి, రాజమౌళి, ప్రభాస్‌ .. ఇంతమంది ఫ్యామిలీస్‌తో నాకు చక్కని అనుబంధం ఉంది. ఇదంతా గెయిన్‌. దశాబ్ధం కెరీర్‌లో అమ్మానాన్న సపోర్ట్‌ వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

కెరీర్‌లో మిస్‌ చేసుకున్నా అనిపించే సినిమాలు?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, విశ్వరూపం 1 సినిమాల్ని మిస్‌ చేసుకున్నా. శ్రీకాంత్‌ అడ్డాల కథ చెప్పాడు. అందులో సీత క్యారెక్టర్‌ ఆఫర్‌ చేశాడు. బాగా నచ్చింది. కానీ చేయలేకపోయాను. అంజలి ఆ పాత్రలో అద్భుతంగా నటించింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved