pizza
Actor Ashish Gandhi interview
సూపర్ స్టార్ కృష్ణ వంటి లెజెండ్ తో కలిసి శ్రీశ్రీలో నటించడం మరచిపోలేని అనుభవం – అశిష్ గాంధీ
You are at idlebrain.com > news today >
Follow Us

5 June 2016
Hyderaba
d

పటాస్, శ్రీశ్రీ వంటి చిత్రాల్లో విలన్ గా, ఓ స్త్రీ రేపు రా చిత్రంలో హీరోగా నటించి అటు విలన్ గా, హీరోగా మెప్పిస్తున్న నటుడ అశిష్ గాంధీ. తనకు నటుడిగా అన్నీ రకాల పాత్రలు చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఈ యువ నటుడు ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ‘’నాన్నగారు నటుడవుదామని చెన్నై, ముంబై వెళ్లారు కానీ అక్కడ ఆయనకు అర్ధికంగా ఎవరూ సపోర్ట్ లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. నటుడు కావాలనుకున్న నాన్నగారు నన్ను నటుడుగా చూసి ఎంతో సంతోషపడుతున్నారు. నటుడిగా నెగటివ్ రోల్ చేసిన చిత్రం పటాస్.

ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాను. ఆ సినిమాలో సీన్ లోనటించిన ప్రతిసారి హీరో కల్యాణ్ రాం సహా అందరూ బాగా చేశావని మెచ్చుకునేవారు. అయితే ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. పర్సనల్ ప్రొఫైల్ రెడీ చేయించుకుని సినిమా ఆఫీస్ కు వెళ్లి చాలా సార్లు కలిశాను. చివరకు నా ప్రయత్నాన్ని గుర్తించి డైరెక్షన్ టీం నాకు విలన్ గా ఆ చిత్రంలో అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత ఓ స్త్రీ రేపు రా చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. నటుడిగా ఏ పాత్రనైనా చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. తర్వాతే నాకు సూపర్ స్టార్ కృష్ణవంటి లెజెండ్ సరసన నటించే అవకాశం వచ్చింది.

Ashish Gandhi interview gallery

ఆయనతో కలిసి నటించిన అనుభవం మరచిపోలేనిది. ఆయన నా నటనను చూసి బాగా చేశావని మెచ్చుకోవడాన్ని నేను జీవితంలో మరచిపోలేను. పటాస్ సినిమాలో నా నటనను చూసి ముప్పలనేని శివగారు నన్ను కాంటాక్ట్ చేసి శ్రీ శ్రీలో నటించమని అన్నారు. కృష్ణవంటి గొప్ప నటుడుతో నటించే అవకాశాన్ని ఎవరూ వదులుకుంటారు. అందుకే నేను చేయడానికి రెడీ అయిపోయాను. ఇక నటన విషయానికి వస్తే నేను సినిమాల్లో రాకముందు షార్ట్ ఫిలింస్ లో యాక్ట్ చేశాను. మోడలింగ్ చేశాను. ముంబైలో నటనలో మూడు నెలలు పాటు శిక్షణ తీసుకున్నాను. అలాగే హైదరాబాద్ లోని జాక్సన్ మాస్టర్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు తమిళంలో ఓ పెద్ద స్టార్ హీరో మూవీలో నటించబోతున్నాను. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాను. నేను విలన్ రోల్స్ కు ఎక్కువ ప్రాధానమిస్తాను. నటన పరంగా హీరో సూర్యగారే నాకు ఇన్ స్పిరేషన్. ఏ పాత్రలోనైనా ఇమిడిపోగల నటుడాయన’’ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved