pizza
Ashok interview (Telugu) about Chitrangada
అంజ‌లి చాలా క‌ష్ట‌ప‌డి చేసింది - అశోక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

04 March 2017
Hyderabad

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజు విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తూ..

* సినిమా ఆలస్య‌మైన‌ట్టుందండీ..
- యుఎస్‌లో షూట్ చేయాల‌నుకున్నాం. నేను క‌థ చెప్పేట‌ప్పుడే అంజ‌లి చాలా బిజీగా ఉంది. ఆ అమ్మాయి ఏమ‌న్న‌దంటే స్నో ఫాల్ సీజ‌న్ వ‌ద్దు అని చెప్పింది. ఆ త‌ర్వాత ముందు 20 రోజులు చేద్దామ‌నుకున్నాం. కానీ అప్ప‌టికే 10 రోజులు ఆలస్య‌మైంది. అక్క‌డికి వెళ్లి 25 రోజులు చేసుకుని వ‌చ్చేస‌రికి ఆ అమ్మాయికి మిగిలిన కాల్షీట్లు వేస్ట్ అయ్యాయి. దాంతో మిగిలిన వాళ్లు ఒప్పుకోలేదు. ఆ టైమ్‌లో సింగం మాప్పిళ్లై అని ఇంకేవో త‌మిళ సినిమాలు చేసింది. ఏవో రెండు మూడు క‌మిట్‌మెంట్ల‌ను గ‌బ‌గ‌బా పూర్తి చేసుకుని ఆరు నెల‌ల తర్వాత డేట్లు అని చెప్పేసింది. అంత‌లో మా నిర్మాత‌లు ఏమ‌న్నారంటే `ఏవండీ మ‌నం సినిమా చేస్తున్నామ‌ని అంద‌రికీ తెలియాలి క‌దండీ.. ముందు మనం ఒక టీజ‌ర్ సిద్ధం చేద్దాం అని చెప్పారు. స‌రేన‌న్నాను. అందువ‌ల్ల మీ అంద‌రికీ చాలా రోజులు అయిన‌ట్టు అనిపిస్తోంది.

* చిత్రాంగ‌ద భ‌య‌పెడుతుందా?
- భ‌య‌పెడుతుంది. అదే స‌మ‌యం న‌వ్విస్తుంది. వ‌ర‌ల్డ్ సినిమాలో ఇంత‌వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని ఇన్నొవేటివ్ పాయింట్ ఇది. సౌత్ ఏషియ‌న్ జ‌నాలు బిలీవ్ చేసే ఆ పాయింట్ సాధ్య‌మా? అసాధ్య‌మా అనేది ఈ సినిమా పాయింట్‌.

* చిత్రాంగ‌ద అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
- చిత్రాంగ‌ద అర్జునుడి భార్య‌. మ‌ణిపురి రాజ్య‌పు రాణి. ఆవిడ మ‌గ‌పిల్లాడిలా ఉంటుంది. అర్జునుడి మీద యుద్దానికి వెళ్లిన ఆమె గెల‌వ‌పోయి కూడా అత‌న్ని ప్రేమించి వ‌దిలేస్తుంది. కానీ అర్జునుడు మాత్రం నువ్వు ఇలా ఉంటే ఎలా? అని అడుగుతాడు. అప్పుడామె వ‌రం పొంది చ‌క్క‌టి అమ్మాయిలాగా ఉంటుంది. త‌ర్వాత అర్జునుడు పెళ్లి చూపుల‌కు వ‌చ్చి పెళ్లి చేసుకుంటానంటాడు. పురాణం చెప్పిన‌ట్టి తొలి మ‌గ‌రాయుడు చిత్రాంగ‌ద‌. ఆ అమ్మాయి పాత్ర‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల విగ‌ర‌స్‌గా ఉంటుంది. కొన్ని రోజులు సాఫ్ట్ గా ఉంటుంది. అలా ఎక్క‌డెలా ఉండాలో అక్క‌డ అలా ఉంటుంది. సినిమాలో అంజ‌లి పెర్ఫార్మెన్స్ చూసిన త‌ర్వాత ఆ అమ్మాయి కోసం ఎందుకు వెయిట్ చేశామో అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది.

Director Ashok interview gallery

* మ‌గ‌రాయుడు అంటే ఏంటి?
- అప్రోచ్ అనేది సాఫ్ట్ గా ఆడ‌పిల్ల‌లాగా ఉండ‌దు. గీతాంజ‌లిలో కాస్త భ‌య‌పెడుతుంది. కానీ ప‌ర్స‌న‌ల్‌గా లాస్ జ‌రిగిన‌ప్పుడు ఒక్కొక్క ఆడ‌పిల్ల ఎలా స్ట‌బ‌ర్న్ గా మారుతుంది అనేది ఈ సినిమాలో కీల‌కం. ఆ కాన్షిడెన్స్ ఉన్న పిల్ల ఆమె.

* అంటే టూ షేడ్సా ఇది?
- కాదండీ . నేను రెండు డైమ‌న్షన్స్ గురించి చెప్పాను.

రెండో డైమ‌న్ష‌న్‌ని ఎవ‌రూ గ‌మ‌నించ‌రు. కానీ సినిమా పూర్త‌య్యే స‌రికి అందరికీ అర్థ‌మవుతుంది.

* షూటింగ్ ఎక్క‌డెక్క‌డా చేశారు? అంజ‌లి ఎలా స‌హ‌క‌రించింది.
తొమ్మిది రాష్ట్రాల్లో చేశాం. 11 డిగ్రీల్లో టూమ‌చ్ గ్లామ‌ర్‌లో న‌టించింది.

ఆ సీజ‌న్‌కి యుఎస్‌వాళ్లు అంద‌రూ చాలా ఎక్కువ‌గా కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. కానీ ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. లైబ్ర‌రీ ద‌గ్గ‌ర నిల‌బ‌డి న‌వ్వుతూ ఏమీ తెలియ‌న‌ట్టు చేసింది ఆ అమ్మాయి. మార్నింగ్ 11 నుంచి రాత్రి 11వ‌ర‌కు కూడా షూటింగ్ చేసింది. ఆ అమ్మాయి క‌ష్టం అంతా సినిమాలో చేసింది.

* త‌మిళ్‌లోనూ ఒకేసారి చేశారా?
- అవునండీ. రెండు సార్లు ఒక‌టే చేశాం. మ‌న తెలుగు ఆర్టిస్టుల ప్లేస్‌లో అక్క‌డ త‌మిళ ఆర్టిస్టులు చేశారు. కానీ అంజ‌లి మాత్రం ఇద్ద‌రితోనూ చేశారు. యార్ నీ అనే పేరుతో త‌మిళంలో చేస్తున్నాం.

* సంగీతం గురించి చెప్పండి?
- ఆర్‌.ఆర్‌. బేస్డ్ సినిమా ఇది. సెల్వ‌గ‌ణేశ్‌తో ట్రావెల్ అవుదామ‌ని అనుకున్నాం. కానీ వాళ్ల‌బ్బాయి ఐవ‌ర్ ఆట్టం అనే సినిమా చేస్తున్నాడు. మేమిద్ద‌రం క‌లిసి చేద్దామ‌ని అనుకున్నాం. వ‌ర‌ల్డ్ మ్యూజిక్‌తో ఫాద‌ర్ అండ్‌, స‌న్ క‌లిసి చేసిన తొలి సినిమా నాదే. ఇందులో అంజ‌లి ఒక పాట పాడారు. పెప్పీ సాంగ్ అది. చాలా బాగా పాడింది. డైలాగు కూడా ఉంటుంది.

* భాగ‌మ‌తి సినిమా గురించి చెప్పండి?
- ముందు భాగ‌మ‌తి సినిమానే స్టార్ట్ కావాల్సింది. స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యింది. అయితే బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాల డేట్స్ వ‌ల్ల భాగ‌మ‌తి ఆల‌స్యంగా స్టార్ట్ అయ్యింది. భాగ‌మ‌తి ఆల‌స్యం అవుతుండ‌టం, అంజ‌లి ఈ క‌థ‌ను ఎక్క‌డో విన‌డం వంటి కార‌ణాల‌తో మేం అంజ‌లిని కాంటాక్ట్ అవ‌గానే. నేను గీతాంజ‌లి త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను నాకు ఈ క‌థ బాగా న‌చ్చింది. మీకు ఓకే అనిపిస్తే వెంట‌నే స్టార్ట్ చేసేస్తాం అని చెప్పింది. అంతా పూర్త‌య్యి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉండ‌గా, భాగ‌మ‌తి స్టార్ట్ చేయాల్సి వ‌చ్చింది. రెండు సినిమాల‌కు స‌మాంత‌రంగా వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల ఆలస్యం అయ్యింది. భాగ‌మ‌తికి ప‌నిచేసిన టీం చాలా పెద్ద టెక్నిషియ‌న్స్‌తో కూడుకున్నది. అన్‌కాంప్ర‌మైజ్డ్ నిర్మాత‌లు. భారీ సెట్స్ వేసి సినిమా చేశాం. ప్రేక్ష‌కులు ఎక్స్‌పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved