pizza
Avika Gor interview about Thanu Nenu
నేను కీర్తి అంత మెచ్యూర్డ్ కాదు - అవికా గోర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2015
Hyderabad

చిన్నారి పెళ్ళికూతురుగా మ‌హిళా లోకానికి సుప‌రిచితురాలు అవికా గోర్‌. ఈ భామ తెలుగులో `ఉయ్యాల జంపాల‌` సినిమాతో అడుగుపెట్టింది. ఆ సినిమాను నిర్మించిన రామ్మోహ‌న్ తాజాగా `త‌ను-నేను` సినిమాను రూపొందించారు. కాక‌పోతే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారాయ‌న‌. రామ్మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త‌ను-నేను శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా అవికా గోర్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు...

* మీ పాత్ర గురించి చెప్పండి?
- కీర్తి అనే పాత్ర చేశా. త‌ను చాలా మెచ్యూర్డ్ గ‌ర్ల్. సెన్సిబిల్ గ‌ర్ల్. సెన్సిటివ్ ప‌ర్స‌న్‌. త‌న‌కి త‌న ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఇంత‌కు ముందు నేను ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌లేదు.

* మ‌రి మీ వ్య‌క్తిగ‌త జీవితానికి, కీర్తి పాత్ర‌కు ఎలాంటి పోలిక‌లున్నాయి?
- చాలా తేడాలున్నాయి. నేను కీర్తి అంత మెచ్యూర్డ్ ప‌ర్స‌న్‌ని కాదు. అంత సెన్సిబుల్ కాదు. త‌ను వేసుకునే చెప్పుల నుంచి, త‌న హెయిర్ స్టైల్ నుంచి, డ్ర‌స్సుల నుంచి ప్ర‌తిదీ వేరుగా ఉంటుంది.

* రామ్మోహ‌న్‌గారు ద‌ర్శ‌కుడిగా ఎలా ఉన్నారు? నిర్మాత‌గా ఎలా ఉన్నారు?
- చాలా తేడా ఉంది. ఉయ్యాల జంపాల సినిమా చేసేట‌ప్పుడు ఆయ‌న చాలా గంభీరంగా వ‌చ్చి సెట్‌లో కూర్చునేవారు. కానీ ఈ సినిమా ప‌రిస్థితి వేరు. చాలా స‌ర‌దాగా ఉన్నారు. షూటింగ్ స్పాట్‌లో చాలా ఫ‌న్ ఉండేది. చాలా ఎఫిషియంట్ ప‌ర్స‌న్‌. చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు.

* ఇందులో మీరు కాలేజ్ గోయింగ్ గ‌ర్లా?
- అలాంటిదేమీ లేదు. చాలా సింపుల్‌, స్ట్రెయిట్ ఫర్వ‌ర్డ్ గ‌ర్ల్ ని. వ‌ర్క్ చేస్తుంటాను.

* క‌థ‌ను సింగిల్ లైన్ లో చెప్తారా?
- హీరో న‌న్ను ప్రేమిస్తుంటాడు. దాన్ని ఎలా చెప్పాలా? అని స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు.

* కొత్త‌గా ఏమైనా చేశారా?
- ఈ సినిమాలోనే కాదు.. నేను ఇప్ప‌టిదాకా చేసిన ప్ర‌తి సినిమాలోనూ ద‌ర్శ‌కుడు ఏం చెబితే అదే చేశాను.

* సంగీతం గురించి చెప్పండి?
- నేను సౌత్‌లో సినిమాలు చేయ‌క‌ముందు ఇక్క‌డి పాట‌లు వినేదాన్ని కాదు. హిందీ, ఇంగ్లిష్ పాట‌ల్నే వినేదాన్ని. కానీ ఇప్పుడు ప‌రిస్థితి వేరు. ఇక్కడి పాట‌ల‌న్నీ వింటున్నాను. నా సినిమాలోని అన్ని పాట‌లూ రేడియోల‌లో బాగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని పాట‌లకు కూడా చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.

* సీరియ‌ళ్ళ‌లో న‌టించ‌డానికి సినిమాలో న‌టించ‌డానికి తేడా ఉంటుందా?
- చాలా ఉంటుంది. సీరియ‌ళ్ళ‌లో ప్రాప్టింగ్ చెప్ప‌రు. అన్నీ మ‌న‌మే చెప్పేయాలి. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సినిమాల షూటింగ్‌లో క్ర‌మ‌శిక్ష‌ణ ఇంకో ర‌కంగా ఉంటుంది.

* ప్ర‌స్తుతం మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
- తెలుగులో ఓ మంచి ప్రాజెక్ట్ వ‌చ్చింది. ఆ సినిమా గురించి నేను ఇప్పుడ‌ప్పుడే ఏమీ చెప్ప‌ను. ఆ సినిమా కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నా.Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved