pizza
Bekkam Venugopal interview (Telugu) about Nanna Nenu Naa Boyfriends
ఓ తండ్రి ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`- బెక్కం వేణుగోపాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

12 December 2016
Hyderaba
d

ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి ప‌దేళ్లుగా మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి) రీసెంట్‌గా `సినిమా చూపిస్త మావ‌`తో సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. సినిమా డిసెంబ‌ర్ 16న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాను దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి)తో సినిమా గురించి విశేషాల‌ను తెలియ‌జేశారు....

- `సినిమా చూపిస్త మావ‌`తో పెద్ద హిట్ కొట్టాను. టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా సినిమా త‌ర్వాత నాకు ఓ మోస్తారు విజ‌యాలే ద‌క్కాయి. అయితే సినిమా చూపిస్త మావ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో నెక్ట్స్ పెద్ద హీరోతోనే సినిమా చేయ‌మ‌ని చాలా మంది అన్నారు. ఈ క్ర‌మంలో నేను చాలా క‌థ‌లు విన్నాను. అయితే ఉయ్యాలా జంపాలా టైంలోనే రైట‌ర్ సాయికృష్ణ ఈ క‌థను నాకు చెప్పాడు. కుమారి 21 ఎఫ్ సినిమా విడుద‌లైన త‌ర్వాత హెబ్బా ప‌టేల్ అయితే ఈ పాత్ర‌కు సూట్ అవుతుంద‌నిపించి ఈ క‌థ‌నే సినిమాగా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాను.

-చిన్న సినిమా, ఓ మోస్తారు సినిమా, పెద్ద సినిమా ఎలా చేయాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు ఓరోజు చోటాగారిని వెళ్లి క‌లిశాను. సార్..నా ద‌గ్గ‌ర క‌థ వినండి. కొత్త‌బంగారు లోకం స్ట‌యిల్‌లో మంచి క‌థ అని చెప్పాను. ఆయ‌న కూడా స‌రేన‌ని క‌థ విన్నారు. ఆయ‌న‌కు క‌థ న‌చ్చింది. ఆయ‌నే దిల్‌రాజుకు ఈ క‌థ గురించి చెప్పారు.

interview gallery

- అప్ప‌టికే దిల్‌రాజుగారికి ఈ క‌థ తెలుసు. ఎప్పుడైతే చోటాగారు చెప్పారో, ఆయ‌న ఫోన్ చేసి క‌థ చెప్ప‌మ‌న్నారు. క‌థ విన‌గానే ఆయ‌న‌కు కూడా న‌చ్చింది. అలా క‌థ విన్న‌ప్ప‌టి నుండి దిల్‌రాజుగారు సినిమా నిర్మాణంలో భాగ‌మ‌య్యారు. ముందు నేను నా బాయ్‌ఫ్రెండ్స్ అనే క‌థ‌ను అనుకున్నాం. అయితే తండ్రి క్యారెక్ట‌ర్ ఇంత ఎమోష‌న‌ల్‌గా ఉన్న‌ప్పుడు టైటిల్ ఎందుక‌లా పెడుతున్నార‌ని దిల్‌రాజుగారే మాకు నాన్న అని టైటిల్‌లో యాడ్ చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. అలా టైటిల్ `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`గా మారింది.

- ప్ర‌తి ఫ్యామిలీ కోసం తండ్రి ప‌డే త‌ప‌నేంటో నాకు తెలుసు. ఈ సినిమాలో తండ్రి పాత్ర‌లో రావు ర‌మేష్‌గారు అద్భుతంగా న‌టించారు. ఆయ‌న న‌ట‌న నాకు గ‌మ్యం నుండి చాలా ఇష్టం. అందుకే ఆయ‌న్ను సినిమా చూపిస్త మావ చిత్రంలో న‌టింప‌చేశాను. ఈ సినిమాకు కూడా ఆయ‌న చాలా బిజీగా ఉన్నా వెయిట్ చేసి డేట్స్ తీసుకుని ఆయ‌న‌తో తండ్రి రోల్ చేయించాం.

- సినిమాలో చివ‌రి ముప్పై నిమిషాలు హార్ట్ ట‌చింగ్‌గా ఉంటుంది. ఓ కూతురు కోసం తండ్రి ప‌డే త‌ప‌న‌. ఓ లైన్ లో చెప్పాలంటే కూతురు పుట్టిన‌ప్ప‌టి నుండి పెళ్లైయ్యే వ‌ర‌కు తండ్రి ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`.

-సాయికృష్ణ అందించిన క‌థ‌కు, ప్ర‌స‌న్న‌కుమార్ చాలా మంచి డైలాగ్స్ అందించాడు. వీటిని భాస్క‌ర్ బండి త‌న డైరెక్ష‌న్‌లో చోటాగారి అద్భుత‌మైన సినిమాటోగ్ర‌పీతో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు.

-హెబ్బా చాలా నేచుర‌ల్‌గా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో త‌న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంటుంది.

-నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రాన్ని 300 పైగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం.

- నేను లోక‌ల్ సినిమాకు నేను అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నాను. వారం రోజులు మాత్రమే చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఈ సినిమాను ముందు డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌నుకున్నాం కానీ చివ‌ర‌కు జ‌న‌వ‌రి చివ‌రి వారం లేదా ఫిభ్ర‌వ‌రి మొద‌టివారంలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం.

- ఇద్ద‌రు కొత్త దర్శ‌కుల‌తో రెండు సినిమాలు చేయ‌బోతున్నాను. ఈ రెండూ ప్రేమ‌క‌థా చిత్రాలే. దిల్‌రాజుగారి స‌పోర్ట్‌తోనే ఈ రెండు సినిమాల‌ను కూడా చేయ‌బోతున్నాను. దిల్‌రాజు వంటి నిర్మాత నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రాన్ని విడుద‌ల చేస్తుండటం ఎంతో హ్యాపీగా ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved