pizza
Producer Bekkam Venugopal interview
నిర్మాత‌గా నా జ‌ర్నీ చాలా హ్యాపీగా ఉంది - బెక్కం వేణుగోపాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 April 2018
Hyderabad


‘నాన్న నేను నా భాయ్‌ ఫ్రెండ్స్, నేను లోకల్, సినిమా చూపిస్త మావ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు బెక్కం వేణుగోపాల్. ఈయన పుట్టిన రోజు ఏప్రిల్ 27. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ``2006లో టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. నిర్మాత‌గా 12ఏళ్ల ప్ర‌యాణం చాలా బావుంది. ప‌ది సినిమాల‌ను నిర్మించాను. ఈ జ‌ర్నీ ఇలాగే కొన‌సాగుతుంద‌ని ఉంది. నిర్మాత‌గా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా కూడా.. ఏదో క‌థ‌తో సినిమా చేసేయాల‌ని కాకుండా క‌థ‌ను న‌మ్మి సినిమాల‌ను చేసుకుంటూ వ‌స్తున్నాను. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు హర్ష కొనగంటి దర్శకత్వంలో `హుషారు* సినిమా చేస్తున్నాను. నాలుగు రోజలు చిత్రీకరణ మినహా సినిమా అంతా పూర్తయ్యింది. క‌థ ప‌రంగా ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసే మూవీ అవుతుందని గట్టి నమ్మకం ఉంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. మంచి, చెడును రెంటిని సినిమాలో చూపిస్తున్నాం. నలుగురు కుర్రాళ్ల కథ. అందులో రాహుల్ రామకృష్ణ మినహా మిగిలిన ముగ్గురు కొత్తవారే. అందాల రాక్షసికి సంగీతం అందించిన రథన్ సంగీతాన్ని, అర్జున్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించారు. తదుపరి దిల్‌రాజుగారితో కలిసి ఓ ఫ్యామిలీ హీరోను పరిచయం చేయబోతున్నాను. ఆ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారు. ‘నేను లోకల్’ స్టయిల్లో ఉండే మూవీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో సినిమా మొదలవుతుంది. అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను’’ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved