pizza
Bellamkonda Sai Sreenivas interview (Telugu) about Rakshasudu
అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు - బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 August 2019
Hyderabad

తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే నిలదొక్కుకున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. హీరోలు అదే పనిగా కావాలి.. కావాలి అంటూ కృషి చేసే మాస్‌ ఇమేజ్‌ అతనికి ఐదేళ్లలోనే వచ్చేసింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటించిన చిత్రాల హిందీ అనువాదాల శాటిలైట్‌ రైట్స్‌ మంచి ధర పలుకుతున్నాయి. ఈ మధ్య ‘సీత’ ఆయనకు అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. ఆగస్ట్‌ 2న ‘రాక్షసుడు’ విడుదల కానుంది. తమిళ చిత్రం ‘రాక్షసన’కు అది రీమేక్‌. ఈ సినిమా గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...

* ఎలా ఉందండీ రాక్షసుడు చేసిన అనుభవం?
- నా మీద చాలా ఉంది. మామూలుగా సినిమా మొదలుపెట్టిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్‌ అయిపోతే నేను డిటాచ అవుతా. కానీ ఈ సినిమా విషయంలో నేను డిటాచ కాలేకపోయాను. ఎక్కడ చూసినా పత్రికల్లో మా సినిమాలో జరిగిన ఘటనలకు రిలేజ్‌ అయ్యే ఇంటర్వ్యూలే కనిపించేవి. మామూలుగా అయితే వాటిని మనం పెద్దగా పట్టించుకోను కూడా పట్టించుకోం. కానీ నాకు చాలా కనెక్ట్‌ అయ్యాయి.

* రెండోసారి పోలీస్‌గా నటించడం ఎలా ఉంది?
- ‘కవచం’ చేశాను కానీ, ఎక్కడో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. కానీ ఈ సారి నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో యాక్షన లేదు, పాటలు, డ్యాన్సులూ లేవు. డిఫరెంట్‌గా ఉంది. ఇందులో నా మరదలి పాత్రకు దారుణం జరుగుతుంది. అలాంటి దారుణాన్ని ఇంట్లో వాళ్లకు జరిగినట్టు మనం ఊహించుకోలేం. నేను కూడా మా ఇంట్లో కొందరు అమ్మాయిలను నా చేతుల మీదుగా పెంచా. అలాంటివారి విషయంలో ఇలా జరిగితే నేను తట్టుకోలేను. అదంతా మనసుకు బాగా కనెక్ట్‌ అయింది. అందుకే సినిమాతో డిటాచ కాలేకపోయా.

* సినిమా ఎలా ఉంటుంది?
- ఇన్వెస్టిగేటివ్‌ కాప్‌ స్టోరీగా ఉంటుంది. ఓ విషయంలో ఒకడు రాక్షసుడిగా ప్రవర్తిస్తుంటాడు? వాడు ఎవరు? వాడిని సీఐ ఎలా పట్టుకున్నాడనేదే కథ.

* నెగటివిటీ ఎక్కువగా ఉంటుందా?
- దాన్ని నెగటివిటీ అని అనలేం కానీ, అంత ఇంటెన్సిటీ ఉంటుంది. మామూలుగా నేను నెగటివిటీకి దగ్గరగా ఉండను. ఎక్కడ పాజిటివ్‌ వాతావరణం ఉంటే, అక్కడ నేనుంటాను.

* పరిశ్రమకు వచ్చిన ఐదేళ్ల తర్వాత ‘ఇదే నా మొదటి సినిమా’ అని చెప్పడంతో ఉద్దేశం ఏంటి?
- ఇన్ని రోజులు నేను మా దర్శకులు ఏం చెబితే అదే చేశా. నాకోసం ‘ఇంకో టేక్‌ చేద్దాం సార్‌’ అని కూడా ఎవరితోనూ అడగలేదు. కానీ ఈ సినిమాకు ఆ స్వాతంత్రం వచ్చింది. ఇంకా ఎక్కువ బాగా చేయగలిగాను. 85 రోజులు షూటింగ్‌ చేశా. నిర్విరామంగా ఆదివారం, సెలువులు లేకుండా పనిచేశా. ఎక్కువగా నైట్‌ షూటింగ్‌లు జరిగాయి. అందుకే అలా ఫీలయ్యా.

* అంటే ఇంతకు ముందువాటిని తక్కువ చేసిన భావన కలగలేదా?
- అలా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నా ప్రతి సినిమాకూ నేను ప్రాణం పెట్టి పనిచేస్తాను. గత ఏడాది జులై నుంచి ఈ జులై వరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి అని అంటే... అవి చిన్న చిత్రాలైతే ఫర్వాలేదు కానీ, అవి పెద్ద చిత్రాలు. వాటిని చేయడం అంత మామూలు విషయం కాదు.

interview gallery



* రెండోసారి రీమేక్‌ చేస్తున్నారు. కష్టంగా ఏమైనా అనిపించిందా?
- అలా ఏమీ అనిపించలేదు. రీమేక్‌ ఎప్పుడూ 90 శాతం ఈజీగానే ఉంటుంది. 10 శాతం కష్టంగా ఉంటుంది. ఆ కష్టం కూడా కంపేరిజన వస్తుందనే.

* సినిమా చూసుకున్నారా? నచ్చిందా?
- చూశాం. నాతో పాటు నా ఫ్రెండ్స్‌కి కూడా నచ్చింది. రియల్‌ కాప్‌గా ఉన్నానని అన్నారు. మా ఇంట్లో వాళ్లకు కూడా బాగా నచ్చింది.
* మాస్‌ సినిమాలకు దూరంగా వెళ్తున్న భావన కలగడం లేదా?
- డ్యాన్సులు, ఫైట్లు మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ మాక్కూడా ఉంది.

* మీ నాన్న ఏమంటున్నారు?
- ఆయన పూర్తిగా కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌. ఎక్కడ సక్సెస్‌ ఉంటే, ఆ కాంబినేషనలో సినిమా చేయడానికి ఇష్టపడతారు.

* మీకు హిందీలో క్రేజ్‌ ఉంది. మరి అటువైపు చూస్తున్నారా?
- నేను కనిపిస్తే హిందీవాళ్లు ఇనస్పెక్టర్‌ విజయ్‌ అని అరుస్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఢిల్లీ పోలీసులు, ముంబై పోలీసులు అసలు అంతలా ఎలా చేయగలుగుతున్నానని అడుగుతున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. హిందీలోకి వెళ్లడానికి నాకు హిందీ మీద కమాండ్‌ రావాలి. ఆ కమాండ్‌ వచ్చేవరకు నేను అక్కడ చేయలేను. ఒకవేళ ట్యూటర్‌ని పెట్టుకుని నేర్చుకుంటే ప్రయత్నించవచ్చేమో.

* మీ నెక్స్ట్‌ ప్రాజెక్టులు ఏంటి?
- ఇంకా ఏమీ అనుకోలేదండీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved