pizza
Bellamkonda Srinivas interview about Speedunnodu
ఫ్రెండ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే సినిమా ‘స్పీడున్నోడు’ – బెల్లంకొండ శ్రీనివాస్
You are at idlebrain.com > news today >
Follow Us

04 February 2016
Hyderaba
d

బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని రోషితాసాయి సమర్పణలో గుడ్‌విల్‌ సినిమా బ్యానర్‌పై భీమనేని సునీత నిర్మాతగా భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం స్పీడున్నోడు’. ఈ చిత్రం ఫిభ్రవరి 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఇంటర్వ్యూ...

ఆలోచిస్తారు....
- ‘స్పీడున్నోడు’ ఒక ఫ్రెండ్‌ఫిప్‌ గురించిప్రేమ గురించిఫ్యామిలీ వాల్యూస్ గురించి తెలియజేప్పే చిత్రం. యూత్‌కిఫ్యామిలీ ఆడియెన్స్‌ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే క్లాస్‌మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండే ఓ కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌. స్నేహితులు అందరికీ ఉంటారు. అలా స్నేహితులు ఉన్నవారందరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ చూసిన తర్వాత అందరూ ఒక నిమిషమైనా సినిమా గురించి ఆలోచిస్తారు.

హిట్ అవుతుందని చేయలేదు....
-ఈ చిత్రం తమిళ సినిమా సుందర పాండ్యన్‌’ సినిమా రీమేక్. పెర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉంది. అల్లుడు శీను తర్వాత ఏ సినిమా చేయాలో అని బాగా ఆలోచించాను. 30-40 కథలు విన్నాను. అలాంటి సందర్భంలో భీమనేని శ్రీనివాసరావుగారు కలిసి ఈ పాయింట్ చెప్పడం, నాకు నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. సినిమాను ఏ నమ్మకంతో అయితే స్టార్ట్ చేశామో, ఇప్పుడు సినిమా చూసుకుంటే అదే నమ్మకంతోనే ఉన్నాం.  తమిళ్‌లో నేను సినిమా చూసినప్పుడు క్లయిమాక్స్‌ సీన్‌ నన్ను బాగా హాంట్‌ చేసింది. సినిమాలో ఎమోషన్స్‌ నాకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. దాంతో సినిమా చేయడానికి యాక్సెప్ట్‌ చేశాను. అంతే తప్ప హిట్ కథ కదా, హిట్ అవుతుందని చేయలేదు.

హీరోయిన్ గురించి...
-నిజానికి సినిమాలో తమన్నాను హీరోయిన్ గా అనుకున్నాం. అయితే కథా పరంగా కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించడంతో సోనారికను తీసుకున్నాం. అప్పుడే తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించాలని అనుకున్నాం. నా మొదటి సినిమా కంటే పదిరెట్లు ఎక్కువగా కష్టపడ్డాను.

క్యారెక్టర్....
-ఈ సినిమాలో కర్నూల్ కుర్రాడిగా కనపడతాను. ప్రేమ విషయంలో ఫ్రెండ్స్ కు సలహాలిస్తుంటాను. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎంటర్ టైనర్ కాబట్టిస్పీడున్నోడు’ ఎమోషనల్‌ కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌. కాబట్టి బాడీ లాంగ్వేజ్‌ నుండి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. లుక్‌ పరంగాహెయిర్‌ స్టయిల్‌ విషయంకాస్ట్యూమ్స్‌ విషయంలో కేర్‌ తీసుకుని ఈ సినిమాలో నటించాను..

డైరెక్టర్‌ భీమనేని శ్రీనివాస్‌ గారితో వర్కింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌...
- రియల్లీట్రూలీఅమేజింగ్‌వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. యంగ్‌ డైరెక్టర్స్‌ తో పనిచేస్తే కొన్ని  విషయాలు నేర్చుకోవచ్చు. సీనియర్‌ దర్శకులతో కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. కంటిన్యూటి విషయంతో పాటు ప్రతి విషయంలో డిటెయిల్డ్‌గా ఉంటారు. వినాయక్‌గారి వంటి కమర్షియల్‌ దర్శకుల వర్క్‌ క్లారిటీగా,స్పీడ్‌గా ఉంటారు. భీమినేని శ్రీనివాస్‌గారి విషయానికి వస్తే క్లారిటీతో పాటు పర్టిక్యులారిటీ ఎక్కువగా ఉంటుంది. సీన్‌  చేసేటప్పుడే పర్‌ఫెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ ఉండేలా చూసుకుంటారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, శ్రీవసంత్, విజయ్ ఉలగనాథన్ ఇలా అందరి కష్టమే ఈ చిత్రం.

హైలైట్స్‌....
- సాధారణంగా సినిమా చూసి ఎక్కువ శాతం థియేటర్‌ నుండి బయటకు రాగానే మరచిపోతుంటాం. కానీ ఈ సినిమాలో చెప్పిన కాన్సెప్ట్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా కర్నూల్‌ క్వారీలో షూట్‌ చేసిన క్లయిమాక్స్‌ హైలైట్‌ అవుతుంది. మంచి కంటెంట్‌ ఉన్న కథ. ఇలాంటి కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ కావడం చాలా ప్లస్‌ అయింది.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?
-ఈ సినిమా రిలీజ్‌ తర్వాత బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాను. విజయ్‌కుమార్‌ కొండాగారు కథ చెప్పారు. అది బాగా నచ్చింది. ఆయన దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుంది. 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved