pizza
Bheemaneni Srinivasa Rao interview about Speedunnodu
అందుకే నిర్మాతగా మారాను – భీమనేని శ్రీనివాస్ రావు
You are at idlebrain.com > news today >
Follow Us

28 January 2016
Hyderaba
d

అందుకే నిర్మాతగా మారాను – భీమనేని శ్రీనివాస్ రావు

భీమ‌నేని రోషితాసాయి స‌మ‌ర్ప‌ణ‌లో గుడ్ విల్ సినిమా బ్యాన‌ర్‌పై బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `స్పీడున్నోడు`. భీమ‌నేని శ్రీనివాస్‌రావు ద‌ర్శ‌క‌త్వంలో భీమ‌నేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిభ్ర‌వ‌రి 5న సినిమా విడుద‌ల అవుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాస్‌రావుతో ఇంట‌ర్వ్యూ ....

మంచి స్క్రిప్ట్...
త‌మిళ్ సినిమా ‘సుంద‌రపాండ్య‌న్’ సినిమాకు రీమేక్‌గా రూపొందిన చిత్ర‌మే ‘స్పీడున్నోడు’. ‘సుడిగాడు’ సక్సెస్ త‌ర్వాత అంటే మూడేళ్ళ త‌ర్వాత ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ‘సుడిగాడు’ త‌ర్వాత‌నే ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ స్క్రిప్ట్‌పై వ‌ర్క్ చేయాల్సి వ‌చ్చింది. 10-15 ఏళ్ళ త‌ర్వాత నాకు దొరికిన మంచి స్క్రిప్ట్ ఇది.

ఆడియెన్స్ కనెక్టవిటీ కోసం....
‘సుస్వాగ‌తం’, ‘శుభాకాంక్ష‌లు’ నేను చేసిన సినిమాల్లో నాకు బాగా ఇష్ట‌మైన సినిమాలు. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లో డిప‌రెంట్ క్ల‌యిమాక్స్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఇప్ప‌టికీ నేను బ‌య‌ట‌కు వెళితే ‘సుస్వాగ‌తం’ సినిమా డైరెక్ట‌ర్‌గానే న‌న్ను గుర్తుప‌డుతున్నారు. మ‌ద్య ఒక‌ట్రెండు సినిమాలు అటు ఇటు అయినా ‘సుడిగాడు’తో స‌క్సెస్ సాధించాను. త‌ర్వాత ఈ సినిమా చూడ‌గానే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో రైట్స్ తీసుకున్నాను. త‌మిళ్ మాతృక చూస్తే వాళ్ళ నెటివిటీకి త‌గిన విధంగా ఉంటుంది. సినిమాను అలాగే చేస్తే మ‌న ఆడియెన్స్‌లో కొంత మంది క‌నెక్ట్ కాక‌పోయే అవ‌కాశం ఉంది. అది కాకుండా నా గ‌త చిత్రాల‌ను చూస్తే ఎంట‌ర్‌టైన్మెంట్‌, కామెడి, మ్యూజిక్‌ల‌కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. అందువ‌ల్ల ‘స్పీడున్నోడు’కు ఎంట‌ర్‌టైన్మెంట్‌ను జోడించి సినిమా తీశాను.

రీమేక్ సమయంలో తీసుకునే జాగ్రత్తలు...
‘సుడిగాడు’ సినిమా విష‌యానికి వ‌స్తే అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. చూస్తాం కానీ బ‌య‌ట‌కు రాగానే సినిమా గుర్తుండ‌వ‌చ్చు, లేక‌పోవ‌చ్చు. కానీ ‘స్పీడున్నోడు’లో సోల్ ఉంటుంది. హార్ట్ ట‌చింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే రీమేక్ చిత్రాలు చేసేట‌ప్పుడు సోల్ దెబ్బ‌తిన‌కుండా, ఏ పాయింట్స్ ద‌గ్గ‌ర ఆడియెన్స్ క‌నెక్ట్ అవుతారో వాటిని డిస్ట్ర‌బ్ కాకుండా ఉండేలా చూసుకుంటాను.

మ్యూజిక్ గురించి...
నా ప్ర‌తి సినిమా మ్యూజికల్ హిట్ అయిన సినిమాలే. డి.జె.వసంత్ ఈ సినిమాకు ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. మూడు సంవ‌త్స‌రాలు నాతో పాటే ట్రావెల్ చేశాడు. అన్నీ టైప్ ఆఫ్ సాంగ్స్‌తో బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆడియో స‌క్సెస్ కావ‌డం చాలా హ్య‌పీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌తి స‌క్సెస్ క్రెడిట్‌లోనూ నా టీం స‌భ్యులంద‌రికీ భాగ‌ముంది.

లేట్ కావడానికి రీజన్....
సినిమా మేకింగ్‌కు ఎందుకంతా ఆల‌స్య‌మైందంటే ప్ర‌తి విష‌యంలో చాలా కేర్ తీసుకున్నాను. మంచి స్క్రిప్ట్ కోసం త‌ప‌న ప‌డ్డాం. అలాగే మంచి టీం, అవుట్‌పుట్ కోసం వెయిట్ చేశాం. ఇందులో న‌టించిన వారందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కావ‌డం వారి డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం, అందుకోసం వెయిట్ చేయ‌డం చేశాను. సినిమా క‌థ అనుకోగానే ర‌వితేజ‌, సునీల్ స‌హా మ‌రో ముగ్గురు న‌లుగురు హీరోల‌ను క‌లిశాను. వారికెందుకో ఈ స‌బ్జెక్ట్ క‌నెక్ట్ కాలేదు. అంటే నేను చూసే పాయింట్‌లో సినిమాను వారు చూడ‌లేద‌నుకుంటాను.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి....
వేరే హీరోతో ఈ సినిమా చేస్తే ఎలా వ‌స్తుందో చెప్ప‌లేను కానీ ఇలాంటి సినిమా చేయ‌డానికి ఒక ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరో కావాలి. కానీ ఒక సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరో చాలా గుడ్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోలా యాక్ట్ చేశాడు. తొలి సినిమాతో డ్యాన్సులు, ఫైట్స్‌తోనే కాకుండా యాక్ట‌ర్‌గా కూడా ప్రూవ్ చేసుకుంటాడు. త‌నకి బ్ర‌యిట్ ఫ్యూచ‌ర్ ఉంది. మంచి హీరోకు కావాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ఉన్నాయి.

ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌.....
ఫ్రెండ్‌ఫిప్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌. ఈ పాయింట్‌ను హార్ట్ ట‌చింగ్ గా ఎంట‌ర్‌టైన్మెంట్‌గా తెర‌కెక్కించాను. ఐదేళ్ళు క‌లిసి చ‌దువ‌కున్న ఐదుగురు స్నేహితుల మ‌ధ్య‌లో ఓ అమ్మాయి కార‌ణంగా ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హీరో ఆ స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మిస్తాడ‌నేదే సినిమా.

అందుకే నిర్మాత‌గా మారాను...
వేరే నిర్మాత‌ల‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు మ‌న‌కు ప‌రిమితులు వ‌చ్చేస్తాయి. ఆ ప‌రిమితులు ఉండ‌కూడ‌ద‌నే నేను నిర్మాత‌గా మారాను. అదీ కాకుండా మూడేళ్ళ త‌ర్వా త సినిమా అంటే స‌క్సెస్ ఉన్న‌ప్ప‌టికీ న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి కూడా ఉంటుంది.అందుకే నేనే నిర్మాత‌గా మారాను.

రీమేక్‌లు రీజన్స్...
ఎవ‌రైనా న‌టుడు ఓ క్యారెక్ట‌ర్‌తో స‌క్సెస్ అయితే ఆ న‌టుడుకి ఆ వేషాలే ఎక్కువ‌గా వ‌స్తాయి. ఇండ‌స్ట్రీ అదే దృష్టితో చూస్తుంది. నేను కూడా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాతో ఇంట్ర‌డ్యూస్ కావ‌డం, స‌క్సెస్ కావ‌డంతో ఆ ముద్ర ప‌డిపోయింది. నేను కూడా ఆడిక్ట్ అయిపోయానేమో అనే ఆలోచ‌న కూడా ఉంది. అయితే రీమేక్ సినిమా అంటే ప్రూవ్‌డ్ స‌బ్జెక్ట్ కాబ‌ట్టి నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రికీ ఓ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దీనివ‌ల్లే రీమేక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడియెన్స్ సినిమాలు చూసే దృష్టి మారింది. మ‌నం సినిమాలు చేస్తే ఆడియెన్స్ చూసేస్తార‌నుకోవ‌డం లేదు. వారు మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి సినిమా ఎవ‌రూ చేసినా ఆద‌రిస్తారు. ఈ స‌బ్జెక్ట్ చేస్తే ఆడియెన్స్ క‌చ్చితంగా క‌నెక్ట్ అవుతార‌నిపిస్తే క‌చ్చితంగా స్ట్ర‌యిట్ సినిమా చేస్తాను.

లేడీస్ కూడా ఇష్ట‌ప‌డే త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌....
త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం అనేది గ‌తంలో ఆమె శ్రీనివాస్‌తో అల్లుడు శీనులో స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం, వారి మ‌ధ్య ఉన్న ఫ్రెండ్ ఫిఫ్, రెమ్యున‌రేష‌న్ ఇలాంటివి వ‌ర్క‌వుట్ అయ్యాయి. త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ మేకింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. లేడీస్ కూడా ఈ స్పెష‌ల్‌సాంగ్‌ను ఇష్ట‌ప‌డేలా ఉంటుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌....
నేను ఒక సినిమా పూర్తి చేసి, విడుద‌లైన త‌ర్వాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంట‌ని ఆలోచిస్తాను. కాబ‌ట్టి ప్ర‌స్తుతం నా త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన ఆలోచ‌న‌లేవీ లేవు.

 

 Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved