pizza
KS Ravindra (Bobby) interview about Sardaar Gabbar Singh
చిరుని ట‌చ్ చేయాల‌నే అది పెట్టాం - బాబీ
You are at idlebrain.com > news today >
Follow Us

1 April 2016
Hyderaba
d

ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేశారు బాబీ. అంత‌కు ముందు ర‌చ‌యిత‌గానూ, ద‌ర్వ‌క‌త్వ‌శాఖ‌లో చేసిన అనుభవ‌మూ ఉంది బాబీకి. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేసిన ద‌ర్శ‌కుడు బాబీ. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ఈ నెల 8న విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి బాబీ హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ మీకు ఎలా వ‌చ్చిందో చెప్పండి?
- ప‌వ‌ర్ చిత్రం 2014లో విడుదలైంది. అది రిలీజైంది సెస్టెంబర్‌లో. క‌రెక్ట్ గా రెండు నెల‌ల త‌ర్వాత నాకు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఫోన్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారితో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చేస్తారా అని అడిగారు. అది నాకు క‌ల‌లాగా అనిపించింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆ సినిమా అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేవ‌ర‌కు నేను దాన్ని క‌ల అనే అనుకున్నా.

* క‌ల్యాణ్‌గారి పాయింట్‌ని మీరు డెవ‌ల‌ప్ చేశారా?
- క‌ల్యాణ్‌గారి స్క్రిప్ట్ ను నేను అడాప్ట్ చేసుకున్నాను. అందుకు దాదాపు 5 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. 2015లో ఏప్రిల్ నుంచి షూటింగ్ మొద‌లుపెట్టాం. ఈ ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తున్నాం. అంటే ఏడాది పాటు స‌మ‌యం ప‌ట్టింది.

* క‌థ విన‌గానే ఏమ‌నిపించింది?
- చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే క‌ల్యాణ్‌గారు క‌థ చాలా బాగా చెప్పారు. స్పాన్ ఉన్న సినిమా. దానికి త‌గ్గ‌ట్టు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా బావున్నాయి.

* ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్యాణ్‌గారి ఇన్వాల్వ్ మెంట్ ఎంత వ‌ర‌కు ఉంది?
- ర‌చ‌యిత‌గా ఆయ‌న నాకు హెల్ప్ చేశారు. అంతేగానీ డైర‌క్ష‌న్‌, ఫోటోగ్ర‌ఫీలో ఆయ‌న ఎక్క‌డా జోక్యం చేసుకోలేదు. ద‌ర్శ‌కుడికి ఇవ్వాల్సిన ఫ్రీడ‌మ్ ఏంటో ఆయ‌న‌కు బాగా తెలుసు. పైగా ఇద్ద‌రి వేవ్‌లెంగ్త్ లు క‌లిశాయ‌నే అనుకుంటున్నాను. లేకుంటే ఆయ‌న న‌న్ను భ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది నా ఫీలింగ్‌.

* ట్రైల‌ర్‌లోనే క‌థ చెప్పేసిన‌ట్టున్నారు?
- కావాల‌నే అలా చేశాం. ఎందుకంటే క‌ల్యాణ్‌గారి సినిమాల‌కు భారీ అంచ‌నాలు ఉంటాయి. దాన్ని త‌ట్టుకోవాలంటే ముందే హింట్ ఇవ్వాలి. దానికి తోడు క‌ల్యాణ్‌గారి ఫ్యాన్స్ కి విజువ‌ల్‌గా థియేట‌ర్‌లో ట్రీట్ ఇవ్వాల‌నుకున్నాం. అందుకే అలా ట్రైల‌ర్ క‌ట్ చేశాం. బాలీవుడ్‌, హాలీవుడ్‌లో అదే ప‌ద్ధ‌తి ఉంది. క‌థ చెప్ప‌కుండా మాయ చేయాల‌ని మేమెప్పుడూ అనుకోలేదు.

* ఏప్రిల్ రిలీజ్ అన‌గానే ఏమ‌నిపించింది?
- ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ ఏడాది జ‌న‌వ‌రి దాకా ఆడుతూ పాడుతూనే సినిమాను చేశాం. కానీ క‌ల్యాణ్‌గారు ఓ రోజు పిలిచి ఏప్రిల్‌లో మ‌న సినిమాను ఎందుకు విడుద‌ల చేయ‌కూడ‌దు? అని అడిగారు .అంతే నేను, శ‌ర‌త్‌గారు ఒక‌టే టెన్ష‌న్ ప‌డ్డాం. నిర్విరామంగా చిత్రీక‌రించేశాం. ఇటీవ‌లే సెన్సార్ కి వెళ్లాం. ఇంకా సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయ‌నే మాట‌లో నిజం లేదు. నిన్న‌నే స్విట్జ‌ర్లాండ్‌లో పాట‌ల‌ను కూడా చిత్రీక‌రించేశాం. సెన్సార్ నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

Bobby interview gallery

* ఈ చిత్రం ద్వారా ఏమైనా నేర్చుకున్నారా?
- చాలా నేర్చుకున్నా. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారితో ప‌నిచేశాక స‌హ‌నం నేర్చుకున్నా. ఆయ‌న్ను త‌ట్టుకుంటే వ‌చ్చే కిక్కు ఇంకో ర‌కంగా ఉంటుంది. ఆయ‌న ప్ర‌శంసించే తీరు, గుర్తించే తీరు జీవితంలో మ‌ర్చిపోలేం. నేను చిన్న‌ప్ప‌టి నుంచి చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ళి `బాబీ బాగా సినిమా చేస్తున్నాడు. నువ్వు కూడా త‌న‌తో సినిమా చెయ్ అన్న‌య్యా` అని చెప్పార‌ట ప‌వ‌న్‌గారు. అంత‌క‌న్నా ఏం కావాలి. అదే పెద్ద అప్రిషియేష‌న్ నాకు.

* ఈ చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేయాల‌ని ఎందుకు అనిపించింది?
- ఆ ఆలోచ‌న కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారిదే. ఎందుకంటే హిందీకి కూడా స‌రిపోయే క‌థ ఇది. అందుకే హిందీ కోసం ఓ స్పెష‌ల్ టీమ్‌ని పెట్టి సినిమాను చేశాం.

* ఈ సినిమా అవ‌కాశం రాగానే ఎవ‌రితో షేర్ చేసుకున్నారు?
- ముందు ర‌వితేజ‌గారికే ఫోన్ చేసి చెప్పా. ఆయ‌న న‌న్ను సొంత త‌మ్ముడిగా చూసుకుంటారు కాబట్టి విన్న వెంట‌నే సంతోషించారు. అస‌లు ఆయ‌నతో క‌లిసి ఓఫోటో తీసుకుంటే చాలు అనుకుని వెళ్ళిన నాకు ఆయ‌న సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం అనేది ఊహించ‌ని అవ‌కాశం.

* వీణ స్టెప్ పెట్టాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?
- ఈ సినిమాలో ఏదో ర‌కంగా చిరుగారిని ట‌చ్ చేయాల‌ని అనుకున్నాం. అందుకే వీణ స్టెప్‌ని పెట్టాం. వీణ స్టెప్‌ని ప‌వ‌న్ ఎలా వేస్తే బావుంటుందో ఈ సినిమాలో చూపించాం. మ‌రో విష‌యం ఏంటంటే ఆయ‌న ప్ర‌త్యేకంగా ఇందులో పొలిటిక‌ల్ డైలాగ్స్ ఏమీ చెప్ప‌రు. కానీ ఆయ‌న ఆల్రెడీ పొలిటిక‌ల్ ప‌ర్స‌న్ కావ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా ఏమైనా క‌నెక్ట్ అయినా ఏమీ చెప్ప‌లేం. ఎందుకంటే ఆయ‌న ఓ వైపు సినిమాల గురించి ఆలోచిస్తూనే మ‌రో వైపు ప్ర‌జ‌లగురించి ఆలోచిస్తుంటారు. స‌చ్ ఎ మ‌ల్టీ టాస్కింగ్ ప‌ర్స‌నాలిటీ ఆయ‌న‌. ఆ మ‌ల్టీ టాస్కింగ్ ని కూడా నేను ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నేర్చుకోవాల‌ని అనుకుంటున్నాను.

* మీరు వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తారా?
- నాకూ, ప్ర‌జ‌ల‌కు బోర్ కొట్టే వ‌ర‌కు అవే చేస్తా. ఆ త‌ర్వాత మా ఇద్ద‌రిలో ఎవ‌రికి బోర్ కొట్టినా ఏం చేయాలోన‌ని ఆలోచిస్తా. ఇప్ప‌టికైతే నెల రోజులు నా భార్య‌కోసం టైమ్ కేటాయించాల‌ని అనుకుంటున్నా.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved