pizza
Boyapati Srinu interview (Telugu) about Jaya Janaki Nayaka
'జయజానకినాయక' ప్రతి ఒక్కరి గుండెను టచ్‌ చేసే సినిమా - బోయపాటి శ్రీను
You are at idlebrain.com > news today >
Follow Us

09 August 2017
Hyderabad

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడుగా ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'జయజానకినాయక'. ఈ సినిమా ఆగస్ట్‌ 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఇంటర్వ్యూ...

హార్ట్‌ఫుల్‌ మూవీ..
- 'జయజానకినాయక' ప్రతి ఒక్కరి గుండెను టచ్‌ చేసే సినిమా. హార్ట్‌ఫుల్‌ మూవీ. నేను నా మొదటి సినిమా భద్రను మంచి లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ కలగలిపి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీగా ఎలా చేశానో అలాంటి లవ్‌స్టోరీ జయజానకినాయక. ఇందులో కూడా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ అన్ని ఉంటాయి. కొత్తగా ఉండాలనే ఆలోచనతోనే టైటిల్‌ విషయంలో కొత్తగా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాను. నేను ఇప్పటి వరకు చేసిన ఆరు సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. జయజానకినాయక భద్ర స్టయిల్‌లో ఉంటుంది. అలాగే నా స్టయిల్‌లో యాక్షన్‌ పార్ట్‌ కూడా ఉంటుంది. కథలో భాగంగానే పాటలు, ఫైట్స్‌ అన్నీ చక్కగా అమరాయి.

ఇచ్చిన మాట కోసం చేసిన సినిమా...
- మనకొక క్యారెక్టర్‌ ఉండాలి. మన మాటకు ఒక విలువుండాలి. అలా సరైనోడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తానని మాటిచ్చాను. ఆ మాట కోసం ఈ సినిమా చేశాను. అలాగని ఏదో సినిమా చేయాలని కాకుండా నేను చేసిన ఆరు సినిమాలకంటే ఓ పాయింట్‌ ఎక్కువగానే ఈ సినిమాను తెరకెక్కించాను.

వయసుకు తగ్గ డైలాగ్స్‌...
- లెజండ్‌ తర్వాత బన్నితో సరైనోడు సినిమా చేసే సమయంలో మీకెలా సరిపోతుందని చాలా మంది అన్నారు. అయితే సరైనోడు సినిమాను బన్ని బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగానే తెరకెక్కించాను. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఈ సినిమాను తెరకెక్కించాను. డైలాగ్స్‌ కూడా తన వయసుకు తగ్గట్టే ఉంటాయి.

interview gallery

శ్రీనులాంటివాడు మన ఇంట్లో ఉండాలనుకుంటారు..
- శ్రీను రా మెటీరియల్‌. ఈ సినిమా కోసం 25-30 కిలోల బరువు పెరిగాడు. తర్వాత 17 కిలోల వరకు తగ్గి మేకోవర్‌ అయ్యాడు. సినిమా చూసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి యువకుడు మన కుంటుంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

మెసేజ్‌ ఇస్తున్నాను..
- నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్‌ ఇస్తూనే వచ్చాను. అలాగే ఈ సినిమాలో అమ్మాయిలకు సంబంధించి మంచి మెసేజ్‌ ఉంటుంది. నిజమైన ప్రేమేంటి? మనం అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలని ఈ సినిమాలో చూపించాను.

బడ్జెట్‌ను మించి బిజినెస్‌ అయ్యింది
- మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అందుకే బడ్జెట్‌ ఎక్కువైంది. అయితే ఇది ముందుగానే అనుక్నుదే. అలాగే బిజినెస్‌ బడ్జెట్‌ను మించి అయ్యింది. ఎందుకంటే నేను సినిమా చేసేటప్పుడు ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్స్‌ నా సినిమా ఎలా ఉంటుందోనని ఓ ఎక్స్‌పెక్‌టేషన్స్‌తో ఉంటారు. ఆ అంచనాలకు తగ్గకుండా సినిమా చేయాలనుకుంటాను. చేస్తాను. అలాగే ప్రతి సినిమాను మొదటి సినిమాలా ఫీలై చేస్తాను.

నిర్మాత చాలా గ్రేట్‌...
- ఈ సినిమాకు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి డబ్బు పెట్టాడని కాదుగానీ తనకి సినిమాలంటే ప్యాషన్‌. నన్ను కలిసిన రోజు ఒక మాట అన్నాడు. సార్‌..నేను జీవితంలో చెప్పుకునే సినిమా ఒకటి చేయాలి. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలి. డబ్బుతో నాకు సంబంధం లేదు' అని చెప్పాడు. తన మాట ప్రకారం ఎక్కడ ఎంత అవసరమో అంతగా ఖర్చు పెట్టి చేసిన సినిమా ఇది.

తదుపరి చిత్రాలు...
- ప్రస్తుతం చిరంజీవిగారు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా చేయబోతున్నారు. తర్వాత ఏ సినిమా చేస్తారో తెలియదు కానీ, ఆయనకు కథ రెడీ చేసేశాను. రెండు నెలలు ఇంకా టైమ్‌ తీసుకుని ఇంకా బాగా వచ్చేలా రాసుకుంటున్నాను. అలాగే మహేష్‌గారికి తగ్గ కథ కూడా రెడీ. ఇప్పటి వరకు ఆయన చేయని జోనర్‌ మూవీ. ఆయన డేట్స్‌ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది జూన్‌, జూలైకంతా బాలయ్యబాబుతో సినిమా స్టార్ట్‌ చేసేస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved