pizza
Catherine Tresa interview (Telugu) about Gautham Nanda
స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ అంటే ఇష్టం - కేథరిన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 July 2017
Hyderabad

గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'గౌతమ్‌నంద'. సంపత్‌నంది దర్శకుడు. జె.భగవాన్‌ పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. ఈసందర్భంగా హీరోయిన్‌ కేథరిన్‌తో ఇంటర్వ్యూ...

తెలుగు నేర్చుకుంటున్నాను...
- తెలుగు నేర్చుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే ఓ తెలుగు మాస్టర్‌ను అపాయింట్‌ చేసుకుని, ఆయన దగ్గర తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే సెట్స్‌లో కొంత నేర్చుకుంటున్నాను.

క్యారెక్టర్‌ గురించి...
- నేను సాధారణంగా స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ను చేయడానికి ఇష్టపడతాను. అలాంటి బలమైన పాత్రను 'గౌతమ్‌నంద' చిత్రంలో చేశాను. నా పాత్ర పేరు ముగ్ధ. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. గ్లామర్‌గా కూడా కనపడతాను. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. నా తొలి చిత్రం 'ఇద్దరమ్మాయిలతో..' నుండి తెలుగులో డబ్బింగ్‌ చెప్పాలనుకుంటే కుదరలేదు. ఈ సినిమాకు నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకునే అవకాశం కలిగింది.

హీరో గోపీచంద్‌ పాత్ర గురించి..
- ఇప్పటి వరకు గోపీచంద్‌ చేసిన పాత్రలన్నింటి కంటే 'గౌతమ్‌నంద' చిత్రంలో ఆయన చేసిన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా కూడా చాల కొత్తగా కనపడతారు. వ్యక్తిగతంగా చాలా డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌.

interview gallery

మంచి అనుభవం..
- ఈ సినిమాలో హన్సిక మరో హీరోయిన్‌గా చేశారు. నేను పూర్తి గ్లామర్‌ పాత్రలో నటిస్తే, హన్సిక డీ గ్లామర్‌ పాత్రలో నటించింది. క్లైమాక్స్‌లో ఇద్దరి కాంబినేషన్‌ సీన్‌ ఉంటుంది. హన్సికతో కలిసి వర్క్‌ చేయడం మంచి అనుభవం. నేను నా పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ ఏంటనే దాని గురించి ఆలోచిస్తానే తప్ప, సెకండ్‌ హీరోయిన్‌గా చేశానా, ఫస్ట్‌ హీరోయిన్‌గా చేశానా అని ఆలోచించను.

డైరెక్టర్‌ సంపత్‌నందితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌...
- చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. ఏ సీన్‌ను ఎలా తీయాలో, ఎంత అందంగా చూపించాలో బాగా తెలుసు. హీరోయిజంపై కాకుండా మంచి కథను రాసుకుని దాని ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇప్పటి వరకు ఆయన చేసిన స్క్రిప్ట్స్‌లో ది బెస్ట్‌ ఇదేనని చెప్పవచ్చు. బోల్డ్‌ క్యారెక్టర్‌....

- రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించాను. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. బోల్డ్‌ గా కూడా ఉంటుంది. పాత్రలో చాలా వేరియేషన్స్‌ ఉన్నాయి. అలాంటి పాత్ర చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.

తదుపరి చిత్రాలు...
తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్‌ ఏవీ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved