pizza
Catherine Tresa interview about Sarrainodu
తెలుగు కంటే తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి - క్యాథరిన్
You are at idlebrain.com > news today >
Follow Us

17 April 2016
Hyderaba
d

స్ష్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా అల్లు రామలింగయ్య సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం `స‌రైనోడు`. రకుల్ ప్రీత్ సింగ్,క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా క్యాథరిన్ తో ఇంటర్వ్యూ...

క్యారెక్టర్ గురించి...
ఈ సినిమాలోయంగ్ ఎమ్మెల్యే రోల్ చేస్తున్నాను. రాజకీయాల నాయకురాలిగా చేయడం కొత్త అనుభూతినిచ్చింది. అయితే రియల్ లైఫ్ లో నాకు ఓటు హక్కు కూడా లేదు.

పాత్ర నచ్చితేనే...
తెలుగులో మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయడం లేదెందుకని అడుగుతున్నారు. కానీ నేను అలాంటివి పట్టించుకోను. పాత్ర నచ్చితేనే చేస్తాను. తెలుగులో వచ్చే అవకాశాలు ఎగ్జయిట్ మెంట్ గా లేవు. తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి.

Catherine interview gallery

బెస్ట్ ఇవ్వడానికే...
నేను నా క్యారెక్టర్ పరంగా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సినిమా సక్సెస్. ఫెయిల్యూర్ అనేవి నా చేతిలో ఉండవు. సినిమా అంటే ఫ్యాషన్.

మూడోసారి..ప్లాన్ చేయలేదు...
బన్నితో మూడోసారి యాక్ట్ చేశాను. బన్ని మంచి ఎనర్జిటిక్ యాక్టర్. చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాలో రకుల్ మరో హీరోయిన్. తనతో నాకు మంచి సీన్స్ కుదిరాయి.

బాలీవుడ్ ఆలోచన లేదు...
తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను. బాలీవుడ్ వెళ్లే ఆలోచనే లేదు.

తదుపరి చిత్రాలు ..
తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను. అందులో ఒకటి విశాల్ హీరోగా చేస్తున్నారు, మరో చిత్రంలో ఆర్య నటిస్తున్నారు. తెలుగులో ఏ సినిమాలు చేయడం లేదు. 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved