pizza
Chandini Chowdary interview about Kundanapu Bomma
ఎవరినీ నమ్మకూడదని అనుకుంటున్నాను – చాందిని చౌదరి
You are at idlebrain.com > news today >
Follow Us

23 June 2016
Hyderaba
d

కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుధాక‌ర్సుధీర్చాందిని చౌద‌రి హీరోహీరోయిన్స్ గా  వ‌ర ముళ్ల‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కుంద‌న‌పు బొమ్మ‌.   ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరోయిన్ చాందిని చౌద‌రితో ఇంట‌ర్వ్యూ.....

బ్యాక్ గ్రౌండ్...
నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. చిన్న‌ప్ప‌టి నుంచి నటన అంటే బాగా ఇష్టం. బెంగుళూరులో  ఇంజ‌నీరింగ్ చేశారు.  ఆ సమయంలో స‌ర‌దాగా మ‌ధురం అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి 'కుంద‌న‌పు బొమ్మ'లో అవ‌కాశం ఇచ్చారు. తెలుగుద‌నం ఉన్న ఓ మంచి సినిమాలో న‌టించినందుకు చాలా సంతోషంగా ఉంది.

అందుకే ఒప్పుకున్నాను
రాఘ‌వేంద్ర‌రావుగారుకీర‌వాణి గారువ‌ర ముళ్ల‌పూడి గారు క‌లిసి చేస్తున్న‌సినిమాలో అవ‌కాశం అన‌గానే ఎవరైనా హ్యపీగా ఫీలవుతారు. అలాంటి లెజెండ్స్ తో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావించి ఫ‌స్ట్ ఓకే చెప్పాను. క‌థ విన్న‌ప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల‌య్యాను. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ అంటే అవునని,  కాదని చెప్ప‌లేం. ఇదొక డిఫ‌రెంట్ స్టోరీ. నేను చెప్ప‌డం క‌న్నా తెర‌ పై చూస్తే మీకే తెలుస్తుంది.

క్యారెక్ట‌ర్ గురించి....
సుచిత్రం అనే ప‌ల్లెటూరి అమ్మాయి క్యారెక్ట‌ర్ లో కనపడతాను. ఇంట్లోనే కాదు, ఆ ఊరులో చాలా గారాబంగా చూసుకుంటారు. మంచి అమ్మాయి అనిపించేలా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. ప‌ర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న‌క్యారెక్ట‌ర్ ఇది. మంచి పేరు తీసుకువ‌స్తుంద‌నే నమ్మ‌కం ఉంది.

ఇకపై చేయను....
మ‌హేష్ బాబు సినిమా అన్నారు కాబట్టి బ్రహ్మోత్సవంలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ అంటే చేశాను. ఇక నుంచి స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకోవ‌డం లేదు. హీరోయిన్ గానే చేస్తాను.

Chandini Chowdary interview gallery

ఆ కారణమే తెలియడం లేదు....
ఒక అమ్మాయి హీరోయిన్ అవుతానంటే త‌ల్లిదండ్ర‌లు నో చెబుతున్నారో లేక మ‌న డైరెక్ట‌ర్స్
ప్రొడ్యూస‌ర్స్ ముంబాయి హీరోయిన్స్ కావాల‌నుకుంటున్నారో తెలియ‌డం లేదు కానీ భాష రాని వాళ్ల‌ను ముంబాయి నుంచి తీసుకువ‌చ్చి ఎందుకు అవ‌కాశాలు ఇస్తున్నారో నాకు తెలియ‌డం లేదు.

ఎవరినీ నమ్మను...
నాకు ఫ్రాంక్ గా ఉండటం అలవాటు. అయితే ఇండస్ట్రీలో అలా ఉండకూడదని తెలిసింది. ఓ సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేయమన్నారు. దాని వల్ల చాలా అవకాశాలు పొగొట్టుకున్నాను.

గ్లామర్ రోల్స్ గురించి...
క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ రోల్స్ చేస్తాను. స్కిన్ షో అనేది మితిమీర‌కుండా ఓ ప‌రిమితి వ‌ర‌కు చేస్తాను. న‌ట‌కు అవ‌కాశం ఉన్న వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నాను.

 ఫేవ‌రేట్ హీరో..
ర‌జ‌నీకాంత్. జీవితంలో ఎప్ప‌టికైనా ర‌జ‌నీకాంత్ ని క‌ల‌వాలనుకుంటున్నాను. తెలుగులో అంత‌గా అభిమాన హీరో అంటూ ఎవ‌రూ లేరు.

తదుపరి చిత్రాలు...
రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా రేవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాను. అలాగే మ‌ధురం షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ ఫ‌ణీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం గారి అబ్బాయితో రాజా గౌత‌మ్ తో క‌లిసి మను చిత్రంలో నటిస్తున్నాను.  ఇది ఓ డిఫ‌రెంట్ మూవీ. ఇందులో పాట‌లు ఉండ‌వు. ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంది. బెంగళూరులో చదవడం వల్ల కన్నడం బాగా వచ్చు. చదువుకునేటప్పుడు కన్నడ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ చేయలేదు. ఏ భాషలో అయినా నటించడానికి సిద్ధమే.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved