pizza
Chandni Bhagwanani interview about Ratham
నాకు కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య ఎదురు కాలేదు ఎందుకంటే... - చాందీని భ‌గ్వ‌నాని
You are at idlebrain.com > news today >
Follow Us

23 October 2018
Hyderabad

రాజ్ గురు బ్యానర్ పై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజ్ ధారపనేని నిర్మించిన చిత్రం `రథం` ఈ చిత్రంలో గీతానంద్, చాందీని భ‌గ్వ‌నాని జంట‌గా న‌టించారు. ఈ నెల 26 న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వాం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో.. హీరోయిన్ చాందిని భగ్వనాని మాట్లాడుతూ ..

నేప‌థ్యం...
- నేను చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఏక్ రిస్తా చిత్రంలో అమితాబ్‌గారితో న‌టించాను. `ఏక్ దిన్ చౌబీస్ గంటే`, `రాజుచాచా` వంటి చిత్రాల్లో న‌టించాను. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని చ‌దువుకున్నాను. మాస్ క‌మ్యూనికేష‌న్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశాను. సీరియ‌ల్స్‌లో న‌టించాను. క‌ల‌ర్స్‌, సోనీ, జీ టీవీల్లో ప‌నిచేశాను.

తెలుగులో అవ‌కాశం...
- ఎలాగో తెలియ‌దు కానీ.. తెలుగు న‌టిస్తారా! అని ఓ వ్య‌క్తి అడిగారు. నా నెంబ‌ర్ ఎలా వ‌చ్చింద‌ని అడిగితే.. మా ద‌గ్గ‌ర ఉన్న డేటా బేస్ నుండి అని చెప్పారంతే. స‌రేన‌ని క‌థ విన్నాను. న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాను.

సీరియ‌ల్స్.. సినిమాలు...
- సీరియ‌ల్స్ అంటే ప‌ర్టికుల‌ర్ టైమ్ ఉండ‌దు. ఇర‌వై నాలుగు గంట‌లు ప‌నిచేయాల్సి ఉంటుంది. కానీ సినిమాల్లో ఓ ప‌ర్టికుల‌ర్ టైమ్ ఉంటుంది. వ‌ర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అయితే రెండింటిలో వ‌ర్క్ చేయ‌డాన్ని ఇష్ట‌ప‌డ్డాను.

సినిమాలో పాత్ర గురించి..
- `ర‌థం` కంప్లీట్ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ఎంబిబిఎస్ చదివే అమ్మాయి. డాన్స్ అంటే కూడా ఈ అమ్మాయికి ఇష్టం. బాధ్యత లేకుండా ఉండే ఒక తండ్రిని చూసి తన తల్లి పడే ఇబ్బందుల వల్ల ఆ అమ్మాయికి మగవాళ్ళంటే అంత ఇష్ట‌ముండ‌దు. త‌న జీవితంలో వేరే మగవాడు ఎంటర్ అయితే తన జీవితం ఏ విధంగా మారుతుందో అని భయప‌డుతూ ఉంటుంది.

బ‌లాలు.. బ‌ల‌హీన‌త‌లు..
- ఒక యాక్టర్‌గా నేను ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తాను. అదే విధంగా నాలో మైనస్ అంటే నవ్వు ఏదన్నా ఒక విషయంలో నవ్వు వస్తే తొందరగా ఆపుకోలేను.

interview gallery



టీమ్ స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను..
- తెలుగు రాక‌పోయినా సినిమా స‌క్ర‌మంగా పూర్తి చేశానంటే కార‌ణం నా టీమ్‌. అలాగే హీరో గీతానంద్.. నాకు చాలా సపోర్ట్ చేశారు. గీతానంద్ చాలా మంచి వాడు. నాకు తెలుగు రాదు. నాకు ఏమైనా సందేహాలుంటే తను హిందీలో, ఇంగ్లీష్‌లో చెప్పేవారు. ప్రతి సీన్‌ని చాలా జాగ్రత్తగా గమనించేవారు. యాక్టింగ్ అంటే తనకి మంచి ఇంట్రస్ట్ ఉంది.

అనువాద సినిమాలు చూస్తుంటా..
- హిందీలోకి అనువాద‌మైయ్యే తెలుగు చిత్రాల‌ను చూస్తుంటా. హీరోల్లో నాకు నాని, నాగ‌చైత‌న్య‌లంటే ఇష్టం. అలాగే హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే.. సమంత, రకుల్, పూజాహెగ్డే ఇష్టమైన హీరోయిన్స్.

చాలా కో ఆప‌రేటివ్‌...
- సౌత్ ఇండస్ట్రీ వెరీ కోపరేటివ్. డైరెక్టర్ కూడా చాలా మంచి వారు ప్రతి సీన్ నాకు చాలా జాగ్రత్తగా చెప్పేవారు. నేను ఒక్కోసారి టేక్స్ తీసుకున్నా ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పేవారు.

నాకు ఆ స‌మ‌స్య లేదు..
- నేను ఎక్కడికి వెళ్ళినా నా తల్లిదండ్రులతో వెళ్ళడం వల్ల నాకు పెద్దగా మీటూ, క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు కలగలేదు.

త‌దుప‌రి చిత్రం...
- `దిక్సూచి` అనే తెలుగు చిత్రం చేశాను. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. రథం విడుద‌ల‌కు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved