pizza
Chandoo Mondeti interview (Telugu) about Premam
ఆ సమయంలో భయపడలేదు కానీ బాధపడ్డాను – చందు మొండేటి
You are at idlebrain.com > news today >
Follow Us

08 October 2016
Hyderaba
d

అక్కినేని నాగచైతన్య హీరోగా పిడివి ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ప్రేమమ్‌'. అక్టోబర్‌ 7న విడులైన ఈ చిత్రం గురించి చిత్ర దర్శకుడు చందు మొండేటి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.... 

ఆయన కాన్ఫిడెంట్‌ చూసి నమ్మకం పెరిగింది.... 
నాగార్జునగారుత్రివిక్రమ్‌గారు ఫస్ట్‌ కాపీ కంటే ముందు వచ్చే ఫస్ట్‌ కట్‌ను చూశారు. చూడగానే నాగ్‌సార్‌కు సినిమా బాగా నచ్చేసింది. హ్యాపీగా ఫీలై..నాకు కంగ్రాట్స్‌ చెప్పారు. ఆయన కాన్ఫిడెంట్‌ చూసి మాలో నమ్మకం పెరిగింది దాంతో  మేం పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఇంకా బాగా చేశాం. ఆయన నమ్మకం ఈరోజు ఆడియెన్స్‌ నుండి వస్తున్న రెస్పాన్స్‌ తో నిజమైంది. 

ముందురీమేక్‌ చేయాలనే ఆలోచనే లేదు... 
హైదరాబాద్‌లో ప్రేమమ్‌ సినిమా ఫస్ట్‌ షో పడ్డప్పుడు చూసిన వాళ్లలో నేను కూడా ఒకడిని. అంటే తెలుగు ప్రేమమ్‌ యూనిట్‌లో మలయాళ ప్రేమమ్‌ చూసిన మొదటి వ్యక్తిని నేనే. మలయాళ ప్రేమమ్‌ బావుందని నేనే అందరికీ చెప్పాను. అప్పుడు రీమేక్‌ చేసే ఉద్దేశం అయితే లేదు. నేనుచైతు కలిసి వేరే సినిమాకు సంబంధించిన డిస్కషన్స్‌ చేస్తున్నాం. అయితే ఒకట్రెండు వారాల్లో ఓ పది మంది నిర్మాతలు నాగచైతన్య ఒప్పుకుంటే ఆయనతో ప్రేమమ్‌ను రీమేక్‌ చేస్తామని అన్నారు. అలా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుండి కూడా ప్రపోజల్‌ వచ్చింది. 

ముందుగానే వర్క్‌ చేశాం... 
మలయాళ ప్రేమమ్‌ స్టోరీ కంటే ఎమోషన్స్‌ తోమూమెంట్స్‌ తోమలయాళ నెటివిటీతో రన్‌ అవుతుంది. అంత పెద్ద హిట్‌ సినిమాను అనుకున్న విధంగా తీయగలమా అని ఆలోచించాం..అయితే తీస్తే ఎలా ఉంటుందో అని కూడా పేపర్‌పై వర్క్‌ చేశాం. సీన్‌ఎపిసోడ్‌ తరహాలో రాసుకుంటూ వెళుతున్నప్పుడు మన నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేసుకుంటూఅతిథి పాత్రలు ఎవరు చేయాలని కూడా ఆలోచించుకున్నాం. నేనుచైతునిర్మాతలు అంతా చూసుకుని ఓకే ఇది వర్కవుట్‌ అవుతుందనుకోగానే..సినిమా చేయడానికి రెడీ అయ్యాం. 

Chandoo Mondeti interview gallery

శృతిహాసన్‌ను సెలక్ట్‌ చేసుకోవడానికి కారణమదే...
శృతిహాసన్‌ లాంటి హీరోయిన్‌ ఉంటే సినిమాకు వచ్చే లుక్‌ వేరుగా ఉంటుందనే భావించిశృతిని హీరోయిన్‌గా తీసుకున్నాం. ఒక స్టార్‌ హీరోయిన్‌ ఉండగా సమంత వంటి మరో స్టార్‌ హీరోయిన్‌ వద్దనుకున్నాం. 

ప్రేమమ్‌ అనే టైటిల్‌ను పెట్టడానికి రీజన్‌...
ముందు ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్‌ను అనుకున్నాం. కానీ బయట క నాగార్జునగారు నటించిన శాడ్‌ లవ్‌ స్టోరీ మజ్ను గుర్తుకు వచ్చేస్తుందని కొంత మంది చెప్పడంతో ప్రేమమ్‌ అనే టైటిల్‌నే పెడదామనుకున్నాం. అదీ కాకుండా ప్రేమమ్‌ అనేది సంస్కృత పదం. 

భయపడలేదు..బాధపడ్డాను....
ప్రేమమ్‌ రీమేక్‌ చేయాలనుకోగానే ఏం టెన్షన్‌ పడలేదు. సినిమా మొదలు పెట్టక ముందే రెవెన్యూ ప్రకారమే కాస్టింగ్‌స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైంది. అయితే బయట ఇది వర్కవుట్‌ కాదనే వార్తలు వచ్చాయి. ఈ విషయంలో నేను భయపడలేదు..కానీ కాస్తా బాధపడ్డాను. 

ఆ విషయంలో నేను నెమ్మది...
దర్శకత్వం కంటే రచయితగా నేను నెమ్మదిగానే ఆలోచించి రాసుకుంటాను. దర్శకత్వం చాలా వేగంగా చేసేస్తాను. మలయాళ ప్రేమమ్‌ను 104 రోజుల్లో చేస్తే తెలుగు ప్రేమమ్‌ను 62 రోజుల్లోనే పూర్తి చేసేశాను. 

తదుపరి చిత్రాలు....
నేను ఎగ్జయిట్‌ అయ్యే స్టోరీస్‌ను నేను రాసుకున్నాను. ప్రస్తుతం రెండుమూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. హీరోలకు కూడా నచ్చింది..ఏ హీరో డేట్స్‌ ముందు కేటాయిస్తారో వారితో ముందుకెళతాం. అలాగే నాగార్జునగారికి కూడా రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి పోలీస్‌ సబ్జెక్ట్‌. నా తదుపరి చిత్రం ఐ డ్రీమ్‌ ప్రొడక్షన్‌లో నా మూడో సినిమా ఉంటుంది. హీరో ఎవరనేది ఫిక్స్‌ కాలేదు. అలాగే దిల్‌రాజుగారి బ్యానర్‌లో ఓ సినిమా అనుకుంటున్నాం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మరో మూవీ చేస్తాను. అయితే అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved