pizza
Dasari Kiran Kumar interview (Telugu) about Siddhardha
మెగాస్టార్‌ చిరంజీవిగారితో 151వ చిత్రంగా `ఉయ్యాలవాడ నరసింహరెడ్డి` సినిమా చేయాలనే కోరిక ఉంది - దాసరి కిరణ్‌కుమార్‌
You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2016
Hyderaba
d

సాగర్‌, రాగిణి నంద్వాని, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దయానంద్‌ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం 'సిద్ధార్థ'. సెప్టెంబర్‌ 16న సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌తో ఇంటర్వ్యూ....

భారీ రిలీజ్‌.....
- మా రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై జీనియస్‌, రామ్‌లీల చిత్రాల తర్వాత వస్తోన్న సినిమా ఇది. సినిమా వయొలెంట్‌ లవ్‌స్టోరీ. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో కథ డిమాండ్‌ను బట్టి 28 రోజుల పాటు మలేషియాలో చిత్రీకరించాం. హైదరాబాద్‌, పూణేల్లో మిగిలిన రోజులు చిత్రీకరణ చేశాం. సెన్సార్‌ పూర్తి చేసుకున్న చితం ఎ సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది. సెప్టెంబర్‌ 16న సినిమాను దాదాపు మూడు వందల థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నాం.

సాగర్‌ను హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణం....
- 'సిద్ధార్థ' చాలా బలమైన పాయింట్‌తో రూపొందిన సినిమా, ఇలాంటి సినిమాను క్యారీ చేయాలంటే మంచి పర్సనాలిటీ, ఛరిష్మా ఉన్న హీరో కావాలి. స్టార్‌ హీరోతో సినిమా చేయవచ్చు కదా..అనవచ్చు. అయితే ఇప్పుడున్న హీరోలందరూ ప్రస్తుతం వారికున్న ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా మారిపోయారు. అందుకని అల్రెడి సీరియల్‌ ద్వారా సాగర్‌ మన ఇంట్లోని అందరికీ దగ్గరై ఉన్నాడు. అతనైతే ఈ కథకు న్యాయం చేయగలడనిపించి తననే హీరోగా తీసుకున్నాను.

రిస్క్‌ అనిపించలేదు...
- జీనియస్‌, రామ్‌లీల ఇప్పుడు సిద్ధార్థ, ఈ మూడు సినిమాలు కొత్త హీరోలతోనే చేశాను. నేను బేసిక్‌గా సినిమా లవర్‌ను కాబట్టి కథను హీరో చేయగలడా అని ఆలోచిస్తానంతే. కాబట్టి నాకెప్పుడూ రిస్క్‌ అనిపించలేదు. ఇక సీరియల్స్‌లో నటించిన సాగర్‌ వెండితెరపై ఎలా రాణిస్తాడో అనే సందేహం ఉంటుంది..అయితే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ఖాన్‌ కూడా సినిమాల్లో రాకమునుపు సీరియల్స్‌లోనే నటించాడు. ఢర్‌, బాజీగర్‌ సినిమాలతో ప్రేక్షకులు ఇంకా దగ్గరయ్యాడు. అలాగే ఏడేళ్లుగా నెంబర్‌వన్‌ సీరియల్‌లో హీరోగా ఉన్న సాగర్‌ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతాడనే భావించాను. సీరియల్స్‌లో నటించిన వారు సినిమాల్లో రాణించలేరని చెప్పలేం కదా..

ఇతర టెక్నిషియన్స్‌ గురించి....
- ఎస్‌.గోపాల్‌రెడ్డిగారు 'సిద్ధార్థ' సినిమా గురించి చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకన్నారు. ఆయన స్వయంగా మలేషియా వెళ్ళి అక్కడ లోకేషన్స్‌ను అన్వేషించారు. ఇప్పటి వరకు మలేషియాలో ఎవరూ చూపించని లోకేషన్స్‌ను ఆయన మా సిద్ధార్థ సినిమాలో చూపిస్తున్నారు. ఇక పరుచూరి బ్రదర్స్‌ అయితే సాగర్‌ను కథకు మెగాస్టార్‌లా భావించి అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. మణిశర్మగారు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందించారు. మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను చిత్రీకరించాం. సినిమాలో మూడు ఫైట్స్‌, మలేషియాలో భారీ చేజింగ్‌ సీన్‌ ఉంటుంది.

టాప్‌ 5 డైరెక్టర్స్‌లో ఒకడవుతాడు...
- డైరెక్టర్‌ దయానంద్‌రెడ్డి టాప్‌ 5 డైరెక్టర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమా కోసం ఎనిమిది నెలలు పాటు ఓ యజ్ఞంలా భావించి వర్క్‌ చేశాడు. సినిమాకు ఏ ఎలిమెంట్‌ ఎంత మోతాదులో కావాలో తెలిసిన దర్శకుడు. బోయపాటి, కొరటాల శివల తరహాలో సినిమాను తెరకెక్కింగల దర్శకుడు.

ఆ కోరిక తీరుతుందనుకుంటున్నాను...
- నాకు చిరంజీవిగారంటే ఎప్పటికీ అభిమానమే. ఆ అభిమానం చనిపోయే వరకు అలాగే ఉంటుంది. ఆయన ఒప్పుకుంటే ఆయనతో 151వ సినిమాగా పరుచూరి బ్రదర్స్‌ రచించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమాను ఎంత భారీ బడ్జెట్‌తో అయినా చేయడానికి రెడీగాఉన్నాను. చిరంజీవిగారిలాంటి నటుడు చేయాల్సిన చిత్రమిది.

అక్టోబర్‌ 2న 'వంగవీటి' టీజర్‌...
- రామ్‌గోపాల్‌ వర్మగారు లెజెండ్రీ డైరెక్టర్‌. అలాంటి సంచలన దర్శకుడితో చేసిన చిత్రమే 'వంగవీటి'. ఇప్పటి 80 రోజులు చిత్రీకరణ జరగింది. రామ్‌గోపాల్‌వర్మగారు ఇన్నిరోజులు కేటాయించి తీస్తున్న చిత్రమిదే. సినిమా ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. అక్టోబర్‌ 2న ఈ సినిమా టీజర్‌ విడుదలవుతుంది. ఈ ఏడాది ఆఖరును సినిమా విడుదల చేయాలనుకుంటున్నాను. వంగవీటి సమయంలో ఏం జరిగిందనే దానిపై ఎవరికీ సరైన అవగాహనలేదు. ఇప్పటి తరానికి ఆ అవగాహనను కల్పించాలనే సినిమా తీస్తున్నాను.

తదుపరి చిత్రాలు..
- ఇప్పటికైతే 'సిద్ధార్థ' సినిమా విడుదల విషయంలో బిజీగా ఉన్నాను. ఏడాది ఆఖరున వంగవీటి విడుదల అనుకుంటున్నాను. ఇవి పూర్తయితేనే వచ్చే ఏడాది స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే ఆలోచనలు ఉన్నాయి.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved