pizza
Dil Raju interview about Supreme success
సినిమా అంటేనే మ్యాజిక్.... అదృష్టముంటే ఆయనతో సినిమా చేస్తాను – దిల్ రాజు
ou are at idlebrain.com > news today >
Follow Us

13 May 2016
Hyderaba
d

 

సాయిధరమ్ తేజ్ హీరోగారాశీఖన్నా హీరోయిన్ గాఅనిల్ రావిపూడి దర్శకత్వం లో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్'. మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు దిల్ రాజు శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ...

సూపర్ రెస్పాన్స్....
అనిల్ రావిపూడి కథ చెప్పినప్పుడు సుప్రీమ్ పెద్ద కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్మి సినిమా చేశామో..ఈ రోజు అది నిజమైంది. సాధారణంగా నా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ముఖ్యంగా నలుగురైదుగురు ఫోన్ చేసి సినిమా ఎలా ఉందో కచ్చితంగా చెప్పేసేవారు. అయితే సుప్రీమ్ సినిమా విడుదలైన రోజు వారెవరు నాకు ఫోన్ చేయలేదు. శ్రీరాములు థియేటర్ కు  నేను, అనిల్ రావిపూడి కలిసి వెళ్లాం. అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక నాకు ధైర్యం వచ్చింది. రెండు మూడు రోజుల వరకు ఏం భయపడవద్దని యూనిట్ కు చెప్పాను. ఫస్ట్ వీక్ లో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి.

మమ్మల్ని ఫాలో అయ్యాడంతే...
సాయిధరమ్ తో మూడు సినిమాలు చేశాను. మూడింటిలో తన పనిని మాత్రం చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సినిమాలో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి, నన్ను ఫాలో అయ్యాడంతే

ఆలోచన అనిల్ దే...
దివ్యాంగులున్న వ్యక్తుల ఫైట్ సీన్ ఆలోచన అనిల్ రావిపూడిదే. తను సెకండాఫ్ రాసుకున్నప్పుడు ఈ సీన్ ఉండాలని ముందే రాసుకున్నాడు. క్లయిమాక్స్ ముందు ఇలాంటి సీన్ ఉండాలనుకున్నప్పుడు దాని ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇదో రకమైన రిస్క్ అని చెప్పవచ్చు. తన కరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండటంతో క్లయిమాక్స్ ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

కథే లేదని ముందే తెలుసు...
సుప్రీమ్ లో ఓ హీరో, పిల్లాడిని కలుస్తాడు. ఆ పిల్లాడికి ఉన్న సమస్యేంటో తెలుస్తుంది. దాని కోసం హీరో ఏం చేశాడనేదే సినిమా. అనిల్ రావిపూడి కథను చెప్పినప్పుడు ఇందులో కథ ఏం లేదని తెలుసు. అయితే అనిల్ రావిపూడి మంచి కమర్షియల్ ఫార్మేట్ డైరెక్టర్. సినిమా అంతా కామెడి ఉండేలా మధ్యలో ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి ఆడియెన్స్ ను ఎంగేజ్ చేశాడు.

రెండు నిర్మాణ సంస్థలు...
ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం చిత్రాలు తర్వాత నేను కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టాను. అప్పుడు నేను కూడా ఎకనిమిక్ గా బిజినెస్ పరంగా ఆలోచించడం మొదలు పెట్టాను. ఒకట్రెండు మినహా స్టార్ హీరోలతో చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే నా మార్కు సినిమాలు రావడం లేదని చాలా మంది అంటున్నారు. అలాగని దర్శకులు కమర్షియల్ సినిమాలను చేయాలని వస్తే కాదనలేదు. అందుకని నా మార్క్ ప్యామిలీ, యూత్ ఫుల్ సినిమాల కోసం నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. అలాగే ఇప్పుడు నేను మారుతి తో కలిసి ఓ సినిమానున, బెక్కం వేణుగోపాల్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాను. ఇలాంటి సినిమాల కోసం ఓ కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేసి నా సమర్పణలోనే, నా బ్యానర్ రిలీజ్ లోనో శిరీష్, హర్షిత్ లను నిర్మాతలుగా పెట్టి సినిమాలు చేస్తాను. ఆ కొత్త బ్యానర్ పేరు ఏంటో ఇంకా అనుకోలేదు. త్వరలోనే తెలియజేస్తాను.

రెండింటినీ ఒకేలా తీసుకుంటాను....
ఓ సినిమా నా బ్యానర్ లో వచ్చి అపజయం అయ్యిందంటే డైరెక్టర్ లేదా హీరోని తప్పు పట్టను. ఎందుకంటే కథను నేను ఓకే చేసిన తర్వాత సెట్స్ లోకి వెళుతుంది. అందుకనే జయాపజయాలను ఒకేలా తీసుకుంటాను. కృష్ణాష్టమి విషయానికి వస్తే సునీల్ ను కొత్తగా చూపించాలని ప్రయత్నించాం. అయితే మా ప్రయత్నం సక్సెస్ కాలేదు. కృష్ణాష్టమి సినిమా నాకొక పాఠంగా భావిస్తాను.

పూరి అడిగితే ఇచ్చేశాను...
నేను నా బ్యానర్ లో జనగణమన అనే టైటిల్ రిజిష్టర్ చేశాను. అయితే ఆ టైటిల్ పై సినిమా చేయడానికి టైం తీసుకుంటూ వచ్చింది. ఈ లోపు పూరి జగన్నాథ్ గారు నాకు ఫోన్ చేసి నాకు ఆ టైటిల్ కావాలని అడిగారు. సరే ఎలాగూ ఆ సినిమా ఇప్పుడు తీయడం లేదు కదా , అని పది సెకన్ల పాటు ఆలోచించి ఆయనకిచ్చేశాను.

సినిమా అంటే మ్యాజిక్ ...
పవన్ కల్యాణ్ గారితో సినిమా చేస్తానని అనుకున్నాను. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళితే సినిమాలు చేయనంటున్నారు. మరి ఆయనతో సినిమా చేసే అదృష్టముందా, ఉంటే తప్పకుండా చేస్తాను. అలాగే చిరంజీవిగారితో సినిమా చేస్తానా, లేదా అని చెప్పలేను. అందుకే సినిమాల విషయంలో ముందే ఏదీ కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే సినిమా అంటే మ్యాజిక్. మధ్యలో ఏ మార్పులైనా జరగవచ్చు.

ఎక్స్ పెరిమెమెంట్స్ చేయను...
24 వంటి ఎక్స్ పెరిమెంట్స్ సినిమా కథలను నేను జడ్జ్ చేయలేను. అదీగాక సినిమాపై ఆధారపడి చాలా మంది ఉంటారు కాబట్టి నేను ఎక్స్ పెరిమెంట్స్ మూవీస్ చేయను.

ఏ గొడవలు లేవు...
సతీష్ వెగ్నేశ దర్శకత్వంలో శతమానం భవతి సినిమా చేస్తాను. ఈ సినిమాకు ఫెస్టివల్ లాంటి సినిమా అనే క్యాప్షన్ అనుకున్నాను. ముందు ఆ కథను సాయిధరమ్ విని చేస్తానన్నాడు, అలాగే రాజ్ తరుణ్ విని తను కూడా చేస్తానని అన్నాడు. అయితే రాజ్ తరుణ్ తో ఏదో గొడవలు వచ్చాయని, అందుకే తనతో సినిమా చేయడం లేదని, మరో హీరోతో ఆ సినిమా చేస్తున్నాననే వార్తలు వచ్చాయి. కానీ నిజానికి శతమానం భవతి సినిమాను ఆగస్టులో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేశాను. అప్పుడు ఏ హీరో డేట్స్ ఖాళీగా ఉంటాయో వారితో సినిమా చేస్తాను. 

.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved