pizza
DJ Vasanth interview about Speedunnodu success
డైరెక్టర్‌కి కావాల్సిన విధంగా మ్యూజిక్‌ చేయడానికి ఇష్టపడతాను – డి.జె.వసంత్
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2016
Hyderaba
d

సీనియర్‌ మోస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సత్యం మనవడుగా ఇండస్ట్రీలోకి ఎంటరై వయొలిన్‌లో డిప్లమో, కర్నాటక సంగీతం, వెస్ట్రన్‌, కీబోర్డ్‌ ప్లేయర్‌గా సంగీతంలో అన్ని మెళకుమ నేర్చుకుని అల్లరి నరేష్‌ ‘సుడిగాడు’ చిత్రానికి మ్యూజిక్‌ అందించి సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు డి.జె. వసంత్‌. రీసెంట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ‘స్పీడున్నోడు’ చిత్రానికి సంగీతం అందించారు. ‘సుడిగాడు’, ‘స్పీడున్నోడు’తో వరుస మ్యూజికల్‌ హిట్స్‌ సాధించి తన టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకున్న యువ సంగీత సంచలనం డి.జె. వసంత్‌ ‘స్పీడున్నోడు’ చిత్రం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న నేపథ్యంలో డి.జె. వసంత్‌తో ఇంటర్వ్యూ.

‘స్పీడున్నోడు’ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
- చాలా హ్యాపీగా ఉంది. ‘సుడిగాడు’ హిట్‌ తర్వాత మళ్లీ భీమనేని శ్రీనివాసరావు గారితో కలిసి ‘స్పీడున్నోడు’ చిత్రానికి వర్క్‌ చేశాను. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా పెద్ద హిట్‌ అయి నాకు మంచి బ్రేక్‌నిచ్చింది.

ఈ సినిమా కోసం ఎలాంటి హోం వర్క్‌ చేశారు?
- దాదాపు రెండు సంవత్సరాల నుండి భీమనేని గారితో ట్రావెల్‌ అవుతూ 50కి పైగా ట్యూన్స్‌ ని కంపోజ్‌ చేశాను. అందులో 13 సాంగ్స్‌ ని రికార్డ్‌ చేశాం. వాటిలో ఆరు మంచి పాటల్ని సెలక్ట్‌ చేసుకున్నారు. నాతో పాటు ఎంతో కష్టపడి, ఇష్టపడి మంచి మ్యూజిక్‌ని భీమనేనిగారు రాబట్టుకున్నారు. అలాగే రచయితలందరూ కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా మంచి సాహిత్యంతో పాటు రాశారు.

ఇండస్ట్రీ నుండి ఎలాంటి అప్లాజ్‌ వస్తోంది?
- చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఫోన్‌చేసి మంచి మ్యూజిక్‌ చేశావని అప్రీషియేట్‌ చేశారు. చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్‌కి మంచి పేరు వచ్చింది. అది సినిమాకి బాగా హెల్ప్‌ అయింది. ఇండస్ట్రీకి మరో మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వచ్చాడు అని అందరూ అంటున్నారు.

ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సాంగ్స్‌?
- అన్ని పాటలను ఎంతో ఇష్టంతో చేశాను. ముఖ్యంగా చెప్పాలంటే ‘రెక్కతో చుక్కకెగిరే’, ‘అమ్మాయితో అబ్బాయి మాట్లాడితే’, తమన్నాతో చేసిన ‘బ్యాచిర్‌ బాబు’, ‘స్పీడున్నోడు’ ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌ అంటే చాలా ఇష్టం. ‘అరెరె బెల్లంకొండ’ పాట మాస్‌ ప్రేక్షకుల్లో పెద్ద హిట్‌ అయింది. మంచి రెస్పాన్స్‌ వుంది. అన్ని పాటు కార్‌ ట్యూన్స్‌ గా డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇంకా ఆనందంగా వుంది.

మీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ గురించి చెప్పండి?
- మా తాత సత్యంగారు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 650 చిత్రాకు పైగా మ్యూజిక్‌ చేశారు. నేను పుట్టి పెరిగింది అంతా విజయనగరంలోనే. అక్కడ వయొలిన్‌లో డిప్లమో కోర్సు చేశాను. కీబోర్డ్‌ చెన్నయ్‌లో నేర్చుకున్నాను. ఆ తర్వాత శ్రీ, హేరిస్‌ జైరాజ్‌, ఆర్‌.పి. పట్నాయక్‌, చక్రి వద్ద అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాను. ‘స్పీడున్నోడు’ నాకు 10వ సినిమా. ఎన్ని సినిమాలు చేసింది అనే దానికన్నా ఏ సినిమా బ్రేక్‌నిచ్చింది అనేది ఇంపార్టెంట్‌. ఇప్పుడు ‘స్పీడున్నోడు’తో నాకంటూ ఒక పేరొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.

DJ Vasanth interview gallery 

భీమనేని శ్రీనివాసరావు చిత్రాన్నీ మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్‌ అయ్యాయి. మరి ఈ సినిమా ఎంతవరకు రీచ్‌ అయిందనుకుంటున్నారు?
- భీమనేనిగారి గత చిత్రాలకన్నా ఇంకా బెటర్‌గా మ్యూజిక్‌ ఉండాలి అని ప్రత్యేకంగా చాలా కేర్‌ తీసుకుని నా నుంచి మంచి మ్యూజిక్‌ని చేయించుకున్నారు. సినిమాతోపాటు ఆడియో కూడా పెద్ద సక్సెస్‌ అయింది. భీమనేని గారి గోల్‌ని రీచ్‌ అయ్యానని అనుకుంటున్నాను.

ఒక సినిమాకి మ్యూజిక్‌ కంపోజ్‌ చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
- డైరెక్టర్‌కి కావాల్సిన విధంగా మ్యూజిక్‌ చేయడానికి ఇష్టపడతాను. రెగ్యులర్‌గా కాకుండా కొత్తగా ట్యూన్స్‌ ని కంపోజ్‌ చేసి మెలోడీలో స్ట్రాంగ్‌ బీట్‌ ఉండేలా ట్యూన్స్‌ ని కంపోజ్‌ చేస్తాను. ‘స్పీడున్నోడు’కి రెగ్యులర్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ వాడకుండా రాజస్ధాన్‌, వెస్ట్రన్‌ కల్చర్‌ స్టైల్‌లో న్యూ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ని వాడాం.

సాంగ్స్‌ని రీమిక్స్‌ చేస్తారా?
- పర్సనల్‌గా రీమిక్స్‌ నాకు ఇష్టంవుండదు. ఒకవేళ దర్శకు చేయాని ఫోర్స్‌ చేస్తే చేయడానికి నేను రెడీ. దర్శకు టేస్ట్‌ మేరకు సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మ్యూజిక్‌ చేయడానికి ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ ఇస్తాను. డైరెక్టర్‌ని హర్ట్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు.

ఎలాంటి చిత్రాలకు మ్యూజిక్‌ చేయాలని ఉంది?
- నిర్మాత బడ్జెట్‌కి తగ్గట్టుగా కథను దృష్టిలో పెట్టుకుని ది బెస్ట్‌ మ్యూజిక్‌ చేస్తాను.

నెక్ట్స్‌ చేయబోయే సినిమాలేంటి?
- జయగారి ‘వైశాఖం’ సినిమా చేస్తున్నాను. ఆల్‌రెడీ షూటింగ్‌ జరుగుతోంది. ఐదు పాటలు ఉన్నాయి. మూడు పాటలు కంపోజ్‌ చేశాను. చాలా అద్భుతంగా వచ్చాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా చాలా క్లారిటీతో జయ మేడమ్‌గారు పాటు చేయించుకుంటున్నారు. ఈ సినిమాకి చాలా ఈజీగా వర్క్‌ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో జయ మేడమ్‌ గారు నాచేత ఒక పాట కూడా రాయించారు. కొత్త కాన్సెప్ట్‌ తో ఈ పాట ఉంటుంది. 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved