pizza
D. Suresh Babu interview about Pelli Choopulu
'పెళ్లిచూపులు' ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది - సురేశ్‌బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

23 July 2016
Hyderaba
d

పెళ్లిచూపులు చిత్రాన్ని డి.సురేశ్‌బాబు స‌మ‌ర్పిస్తున్నారు. ఈ నెల 29న విడుద‌ల కానున్న ఈ సినిమాకు త‌రుణ్ ద‌ర్శ‌కుడు. రాజ్ కందుకూరి నిర్మాత‌. ఈ సినిమా గురించి డి.సురేశ్‌బాబు హైద‌రాబాద్‌లో శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఈ కాలంలో `పెళ్లిచూపులు` జ‌రుగుతున్నాయంటారా?
- `పెళ్లిచూపులు` చూసేవారి ప‌ర్సంటేజ్ ఎంత ఉందో చెప్ప‌లేను. కానీ విద్యావంతుల శాతం పెరిగేకొద్దీ పెళ్లిచూపులు స్లోగా త‌గ్గుతున్నాయి. ఎక‌నామిక్ ఇండిపెండెన్స్ వ‌ల్ల కూడా ఇలాంటివి జ‌రుగుతున్నాయి. న్యూక్లియ‌ర్ ఫ్యామిలీస్‌లో వేరుగా ఉంటుంది. ట్రెడిష‌న‌ల్ గా వేరుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది ప్లాన్డ్ గా ల‌వ్ చేసుకుంటున్నారు. ఒకే కేస్ట్ వాళ్లేనా? ఆర్థికంగా త‌మ‌కు స‌మానంగా ఉన్నారా? లేదా? వ‌ంటి ప‌లు అంశాల‌ను ఆరా తీసి మ‌రీ ప్రేమ‌లో ప‌డుతున్నారు.

* ఇప్పుడు కూడా పెళ్లిచూపుల‌కు విలువ ఇచ్చేవాళ్లున్నారా?
- ఎందుకుండ‌రు. ఉంటారు. ఆయా కుటుంబాల‌ను బ‌ట్టి పెళ్లిచూపుల‌ను అరేంజ్ చేస్తున్నారు. కొంద‌రు ఇళ్ల‌లో అరేంజ్ చేస్తారు. మ‌రి కొంద‌రు ఫ్రెండ్స్ మ‌ధ్య అరేంజ్ చేస్తారు. ఇంకొంద‌రు తెలిసిన వారి పెళ్లిళ్ల‌ల్లో త‌మ పిల్ల‌ల‌ను అందంగా త‌యారుచేస్తారు. దీని ద్వారా ఎవ‌రింట్లో పిల్ల‌లు ఎదిగారో అంద‌రికీ తెలుస్తుంది క‌దా. వీటిని ఇన్‌డైర‌క్ట్ పెళ్లిచూపులు అని అంటారు. నిజంగా పెళ్లిచూపులు లేక‌పోతే ఇన్ని మేట్రిమోనియ‌ల్ సైట్లు ఎందుకుంటాయి?

* మీ `పెళ్లిచూపులు` గుర్తున్నాయా?
- నాకు చాలా సిగ్గు. అప్ప‌ట్లో సిగ్గుతో బ‌తికేవాళ్లం. ఆ అమ్మాయిని మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి ర‌మ్మంటే వ‌చ్చింది. వ‌రుస‌గా మూడు రోజులు ర‌మ్మ‌న్నాను వ‌చ్చింది. మూడు రోజులు కూడా త‌నతో నేను ఒక్క ముక్కా మాట్లాడ‌లేదు. మూడో రోజు ఆ అమ్మాయిని చేసుకుంటాన‌ని చెప్పేశాను.

Suresh Babu interview gallery

* ఈ `పెళ్లిచూపులు` క‌థ ఎలా ఉంటుంది?
- చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ఓ బ‌ద్ధ‌క‌స్తుడు ఓ నిబ‌ద్ధ‌త క‌లిగిన అమ్మాయిని చూడ‌టానికి వెళ్తాడు. త‌ను చాలా డిసిప్లిన్ ఉన్న గ‌ర్ల్. వారిద్ద‌రికి జ‌రిగిన పెళ్లిచూపులు, ఇద్ద‌రూ ఒకే గ‌దిలో ఉండాల్సి రావ‌డం, వాళ్ల గురించి చెప్పుకోవ‌డం... ఇలా సాగుతుంది సినిమా.

* మీరు ఈ సినిమాలో అసోసియేట్ కావ‌డం గురించి చెప్పండి?
- ఈ సినిమా క‌థ‌ను త‌రుణ్ నాకు చెప్పాడు. రాజ్ కందుకూరి కూడా చెప్పాడు. ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్లాను. ఫ‌స్ట్ కాపీ చూశాను. చాలా బాగా న‌చ్చింది. ఆహ్లాద‌క‌రంగా అనిపించింది. కొన్ని చోట్ల క‌నెక్ట్ అయ్యా. అన్నిటికీ మించి ఈ సినిమాను వారు తీసిన విధానం నాకు బాగా న‌చ్చింది. బౌండ్ స్క్రిప్ట్ చేసుకుని, స్టోరీ బోర్డ్ వేసుకుని, ఉత్త‌మ ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌ను పాటిస్తూ, సింక్ సౌండ్‌తో, రియ‌ల్ లొకేష‌న్ల‌లో, వారికున్న బ‌డ్జెట్‌లో చాలా బాగా చేశారు. అది నాకు బాగా న‌చ్చింది.

* ఇప్పుడు చిన్న సినిమాల‌కున్న స‌మ‌స్య‌లేంటి?
- మంచి క‌థ దొర‌కాలి. తీసిన సినిమాను స‌రిగా మార్కెటింగ్ చేసుకోవాలి.

* సింక్ సౌండ్ గురించి చెప్పండి?
- మ‌న పాత సినిమాల్లో చేసేవారు. మిచ్చెల్ కెమెరాలున్న‌ప్పుడు అది కుదిరేది. ఆ త‌ర్వాత ఏరీ ఫ్లెక్స్ వ‌చ్చాక బాగా నాయిస్ ఉండేది. లైట్స్ కూడా కొన్ని బాగా సౌండ్ చేసేవి. దానికి తోడు ప‌ర‌భాషా న‌టులు స‌రిగా డైలాగులు చెప్ప‌లేక‌పోవ‌డంతో డ‌బ్బింగ్‌లో క‌రెక్ష‌న్ చేయించుకుందామ‌ని వారితో ఒన్‌టూత్రీలు, ఏబీసీడీలు చెప్పి కానిచ్చేవారు. దానికితోడు కొన్ని సంద‌ర్భాల్లో ద‌ర్శ‌కుడు డైలాగులు రాయ‌కుండా డ‌బ్బింగ్‌లో మేనేజ్ చేద్దామ‌ని అనుకునేవారు. మేనేజ్ చేద్దామ‌ని అనుకోక‌పోతే సింక్ సౌండ్ ప‌ద్ధ‌తి చాలా బావుంటుంది. బాలీవుడ్‌లోనూ, హాలీవుడ్‌లోనూ ఇప్ప‌టికీ సౌండ్ సింక్ ప‌ద్ధ‌తినే వాడుతున్నారు.

* ఇప్పుడొస్తున్న ద‌ర్శ‌కులు ఎలా ఉన్నారు?
- కొంత‌మంది సింపుల్‌గా ఉన్నారు. మంచీ చెడులు క‌లిసే ఉంటున్నాయి. కాక‌పోతే క‌థ అల్టిమేట్ కాబ‌ట్టి. క‌థాప‌రంగా వాళ్లెక్కువ క్లారిటీతో ఉండాలి.

* మీ సంస్థ‌లో చేస్తున్న సినిమాలేంటి?
- ఇప్పుడేమీ లేవు. నాగ‌చైత‌న్య‌తో ఒక‌టి, రానాతో ఒక‌టి, త‌రుణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి, వెంక‌టేశ్‌తో ఒక‌టి చేయాలి.

* రానా, వెంక‌టేశ్‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది?
- క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

* బాహుబ‌లి2ను మీరు తీసుకున్నార‌ట క‌దా?
- ఎవ‌రు చెప్పారు?

* శ్రీ సిటీలో స్టూడియో క‌డుతున్నార‌ట క‌దా?
- ప్లాన్స్ ఉన్నాయి.

* ఇంత‌కీ మీ ఇంట్లో పెళ్లిచూపులు ఎప్పుడు?
- ఏమో. రానా మ‌మ్మ‌ల్ని చూడ‌మంటాడో, వాడు చూసుకుంటాడో?

* ఆ న‌లుగురు అన్న‌ప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి?
- అలా అనేవాళ్లు ఎవ‌రు? వాళ్లవ‌ల్ల సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఏం ఉప‌యోగం జ‌రుగుతుంది? ప్రారంభంలో అలా అంటే నాకు బాధ‌గానే ఉండేది. కానీ వాళ్ల గురించి ఆలోచించ‌డం మానేశా. నేనేం ఇల్లీగ‌ల్ ప‌నులు చేయ‌డం లేదు క‌దా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved