pizza
DVV Danayya interview (Telugu) about Bharat Ane Nenu
నిర్మాత‌ దాన‌య్య అనే నేను `భ‌ర‌త్ అనే నేను` సినిమా చాలా బావుంటుంద‌ని హామీ ఇస్తున్నాను - దాన‌య్య డి.వి.వి
You are at idlebrain.com > news today >
Follow Us

17 April 2018
Hyderabad

సూప‌ర్‌స్టార్ మహేశ్, కియ‌రా అద్వాని జంట‌గా నటించిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య.డి.వి.వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 20న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో దాన‌య్య డి.వి.వి సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌చేశారు...

నిర్మాత‌గా పాతికేళ్లు...
- మాది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాళ్ల‌పూడి గ్రామం. అప్ప‌ట్లో మా ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు ఎక్కువ‌గా జ‌రిగేవి. అందాల‌రాముడు, శంక‌రాభ‌ర‌ణం, సిరిసిరిమువ్వ‌, భ‌క్త‌క‌న్న‌ప్ప‌, శార‌ద‌, హిమ్మ‌త్‌వాలా, పాడి పంట‌లు సినిమాల‌న్నీ మా ప్రాంతంలోనే జ‌రిగాయి. చ‌దువుకునే వ‌య‌సులో పాడిపంటు షూటింగ్ జ‌రుగుతుంటే చూడ‌టానికి వెళ్లాను. అక్క‌డ జ‌నం ఎక్కువ కావ‌డంతో.. పోలీసులు జ‌నాలను వెళ్లిపొమ్మ‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో కృష్ణ‌గారు అంద‌రూర గోల చేస్తే షూటింగ్ చేయకుండా వెళ్లిపోతామ‌ని అన్నారు. అప్ప‌డు జ‌నాలు బాబూ వ‌ద్దండీ ..గోల చేయం షూటింగ్ చేసుకోండ‌ని అన్నారు. అలా సినిమాల ప్ర‌భావంతో ఓ మోటివ్‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చేశాను. అదృష్ట‌వ‌శాతు నిర్మాత‌గా మారాను. ఈవీవీ సత్య‌నారాయ‌ణతో క‌లిసి జంధ్యాల‌గారి వ‌ద్ద అసోసియేట్‌గా వ‌ర్క్‌చేశాను. ఆ స‌మయంలో ఈవీవీతో మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. నేను నిర్మాత‌గా మారి సినిమా చేద్దామ‌నుకుంటుండ‌గా... ఈవీవీగారు కూడా నేను నిర్మాత‌గా ఉంటాన‌ని అన్నారు. అలా నేను, నా స్నేహితులు భ‌గ‌వాన్‌, పుల్లారావుల‌తో కలిసి `జంబ‌ల‌కిడి పంబ‌` సినిమా చేశాను. 1992లో జంబ‌ల‌కిడి పంబ సినిమాతో నిర్మాత‌గా ప్ర‌యాణం ప్రారంభించాను. సినీ జ‌ర్నీ స్టార్ట్ చేసి పాతికేళ్లు అయ్యింది. ఈ ప్ర‌యాణంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశాం.. యావ‌రేజ్ సినిమాలు కూడా చేశాం. ఈ జ‌ర్నీకి స‌హ‌క‌రించిన అంద‌రికీ థాంక్స్‌.

ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను...
- ఇప్పుడు డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో ఏప్రిల్ 20న రానున్న సినిమా `భ‌ర‌త్ అనే నేను`. సెన్సార్ పూర్త‌య్యింది. యు/ఎ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు సినిమా చాలా బావుంద‌ని అప్రిసియేట్ చేశారు. బిగ్ స్పాన్‌లో... వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. మహేశ్‌బాబుగారితో సినిమా చేయడం అనేది నా క‌ల‌. ఆయ‌న్ను నాతో సినిమా చేయ‌మ‌ని చాలా రోజులుగా అడుగుతున్నాను. అది ఇప్ప‌టికీ ..కొర‌టాల శివ గారి ద్వారా కుద‌రడం చాలా ఆనందంగాఉంది. నా బ్యాన‌ర్‌కు చాలా గొప్ప సినిమా అవుతుంది. కొర‌టాల శివ‌గారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను.

ఏ పార్టీకీ సంబంధం లేదు...
- ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న క‌థ‌తో సాగే చిత్ర‌మిది. ఏ పార్టీకి సంబంధం ఉండ‌దు. మంచి ముఖ్య‌మంత్రి ఎలాంటి ప‌నులు చేశాడ‌నేదే సినిమా. ఎవ‌రినీ విమ‌ర్శించే విధంగా సినిమా ఉండ‌దు. మంచి మెసేజ్‌తో ఉన్న చిత్ర‌మిది.

క‌థ విన్న‌ప్పుడే ఆ నిర్ణ‌యం తీసుకున్నా...?
- మ‌హేశ్ గారితో సినిమా అనుకున్న‌ప్పుడు కొర‌టాల‌గారు ఈ క‌థ‌నున నాకు చెప్పారు. చాలా బావుంటుంద‌ని నేను చెప్పాను. త‌ర్వాత హీరోగారు క‌థ విన్నారు. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చింది. క‌థ విన్న‌ప్పుడే కాంప్ర‌మైజ్‌కాకుండా సినిమా చేయాల‌ని నిర్ణ‌యించాం. అసెంబ్లీ సెట్‌ను రెండు కోట్లు ఖ‌ర్చు పెట్టి చేశాం. వ‌చ్చావ‌య్యా సామీ .. అనే సాంగ్ కోసం ఓ సెట్ వేసి నాలుగు కోట్లు ఖ‌ర్చుపెట్టి చేశాం. పెద్ద స్క్రీన్‌పై సాంగ్ చూస్తే థ్రిల్ అయ్యేలా ఉంటుంది.

అది ముందుగా తెలియ‌దు...
- ఏప్రిల్ 20న రిలీజ్ చేయాల‌ని అంద‌రూ అనుకున్న‌దే. కానీ అదే రోజు మ‌హేశ్‌గారి అమ్మ‌గారు ఇందిర‌మ్మ‌గారి పుట్టిన‌రోజు అని త‌ర్వాత మ‌హేశ్‌గారు చెప్పారు. ఏప్రిల్ 20న సినిమాను ఎక్కువ థియేట‌ర్స్‌లో భారీగా విడుద‌ల చేస్తున్నాం.

అంచ‌నాల‌ను మించేలా...
సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను దాటే సినిమా ఉంటుంది కానీ.. అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ద‌ని చెప్ప‌గ‌ల‌ను. `భ‌ర‌త్ అనే నేను` నిర్మాత దాన‌య్య అనే నేను సినిమా చాలా చాలా బావుంటుంద‌ని హామీ ఇస్తున్నాను. మ‌హేశ్‌బాబుగారి గ‌త చిత్రాల రికార్డుల‌ను దాటుతుంది.

interview gallery



మ‌హేశ్‌తో ఎక్కువ ర్యాపో..
- నేను స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేశాను. అంద‌రి కంటే మ‌హేశ్‌గారితో కాస్త ర్యాపో ఎక్కువ‌గా ఏర్ప‌డింది. ఎందుకంటే మ‌హేశ్‌గారు ఉద‌యం ఏ మూడ్‌తో న‌వ్వుతూ షూటింగ్‌కి వ‌స్తారో అదే మూడ్‌తో న‌వ్వుతూ వెళ‌తారు. ఇక దేవిశ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా కుదిరింది. ప్రతి ఒక‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. కియ‌రా అద్వాని తొలి తెలుగు చిత్రం. తెలుగు అమ్మాయిలా క‌న‌ప‌డుతుంది. తెలుగులో మ‌రిన్ని సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తాయి. ఆమె త‌దుప‌రి సినిమాకు కూడా నేనే నిర్మాత‌ను.

కంటెంట్ ఉంటే.. లెంగ్త్‌తో సంబంధం లేదు...
- సినిమా కంటెంట్ సూప‌ర్బ్‌. ఆడియెన్‌ను థియేట‌ర్‌లో కూర్చుని బెడుతుంది. కొర‌టాలగారు చాలా మందిని అడిగి ఏ కాంట్రెవ‌ర్సీ లేకుండా సినిమా చేశారు. సినిమా నిడివి ఎక్కువ‌గా ఉంటే.. ఏమ‌వుతుంది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. `రంగ‌స్థ‌లం` సినిమా అందుకు ఉదాహ‌ర‌ణ‌.

తుద‌ప‌రి చిత్రాలు....
- చ‌ర‌ణ్‌గారు, బోయ‌పాటిగారి సినిమా ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. ఈ నెల 21 నుండి చ‌ర‌ణ్‌గారు షూటింగ్‌లో పాల్గొంటారు. అలాగే రాజ‌మౌళిగారు, ఎన్టీఆర్‌గారు, చ‌ర‌ణ్‌గారు క‌లిసి చేసే సినిమా ఈ ఏడాదినే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా చేయ‌డాన్ని గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. రాజ‌మౌళిగారితో సినిమా చేయ‌డ‌మ‌నేది నా క‌ల. 2006 నుండి ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఇప్ప‌టికీ కుదిరింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved