pizza
Gautham Menon interview (Telugu) about Saahasam Swaasaga Saagipo
చైతును తమిళంలో లాంచ్ చేస్తాను - గౌత‌మ్ మీన‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2016
Hyderaba
d

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌జేశాడు....

ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌...
- సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డికి సినిమా రంగంతో పెద్ద‌గా ట‌చ్ లేన‌ప్ప‌టికీ చాలా ప్యాష‌న్‌తో సినిమాను చేశారు. అలాగే నా ఫేవ‌రేట్ హీరో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. తెలుగు, త‌మిళంలో సినిమాపై చాలా మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేసేటప్పుడు నాగ‌చైత‌న్య‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ సినిమాలు చేసే హీరోగా గుర్తింపు ఉండేది. ఈ సినిమాతో మాస్ హీరోగా అన్నీ సినిమాలు చేసే హీరోలా గుర్తింపు వ‌స్తుంద‌ని చెప్పాను. త‌ను న‌వ్వుతూ వింటుండేవాడు.

ప్ర‌భావం ప‌డ‌లేదు...
- ప్ర‌భుత్వం 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసినా ఆ ప్ర‌భావం మా సినిమాపై ఏం ప‌డ‌లేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. నోట్స్ క్యాన్సిలేష‌న్ ప్ర‌భావం కొద్దిగా ఉన్నా, మంచి క‌లెక్ష‌న్స్ ఉన్నాయి.

ఏ హీరోను అనుకుని క‌థ రాసుకోను...
- నేను సాధార‌ణంగా ఓ క‌థ‌ను రాసుకునేట‌ప్పుడు నా మైండ్‌లో ఏ హీరో ఉండ‌డు. నా రాసుకునే కాన్సెప్ట్ ప్ర‌కారం హీరో ఆ క్యారెక్ట‌ర్‌లో న‌టించేలా ప్లాన్ చేసుకుంటాను. సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాకు సంబంధించి తెలుగులో చై చాలా నార్మ‌ల్‌గానే యాక్ట్ చేశాడు. కానీ శింబు గ‌తంలో చాలా యాక్ష‌న్ సినిమాలు చేసి ఉండ‌టం వల్ల త‌ను క్యారెక్ట‌ర్‌కు త‌గిన విధంగా న‌టించాల్సి వ‌చ్చింది. అయితే నేను షాట్ తీసేట‌ప్పుడు యాక్ట‌ర్స్‌ను కంఫ‌ర్ట్‌గా ఉంచుతాను. శింబు ఓ షాట్‌లోన‌టించాడ‌నుకోండి. ఆ షాట్ గురించి చైతుకు చెబుతాను అత‌నెలా చేయాలో చెబుతానంతే కానీ శింబు ఎలా చేశాడో చెప్ప‌ను.

Gautham Menon interview gallery

క‌మ‌ర్షియ‌ల్‌గా ఉండాల‌ని ఆలోచించాను...
- సాహ‌సం శ్వాస‌గా సాగిసో సినిమా క్లైమాక్స్ కాస్తా సినిమాటిక్‌గా ఉండ‌టానికి కార‌ణం నేను క్లైమాక్స్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉండాల‌ని ఆలోచించాను. అలాగే సాంగ్స్ అన్నీ ఫ‌స్టాఫ్‌లోనే వ‌చ్చేస్తాయి. ముఖ్యంగా వెళ్లిపోమాకే సాంగ్ యాక్సిడెంట్ జ‌రిగే సంద‌ర్భంలో వ‌స్తుంది. అందుకు కార‌ణం హీరో, అంత‌కు ముందు సిచ్చువేష‌న్స్‌లో హీరోయిన్ త‌న‌ను వ‌దిలి వెళ్లిపోకూడ‌ద‌ని అనుకుంటూ ఉంటాడు. హీరో ఆ మైండ్ కాన్సెప్ట్‌లో ఉన్న‌ప్పుడు యాక్సిడెంట్ జ‌రుగుతుంది. అప్పుడు త‌ను ఇమాజినేష‌న్‌లోకి వెళ‌తాడు. అక్క‌డా సాంగ్ వ‌స్తుంది.

బాబా సెహ‌గ‌ల్ క్యారెక్ట‌ర్ గురించి....
- నా విల‌న్స్ అంద‌రూ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. కానీ సాహసం శ్వాస‌గా సాగిపో సినిమా విష‌యానికి వ‌స్తే బాబా సెహ‌గ‌ల్ పాత్ర చాలా చిరాకు తెప్పించేలా చూడ‌గానే కొట్టాల‌నిపించేలా కాస్తా హిందీ, మ‌రాఠీ మాట్లాడుతూ ఉండాల‌నుకున్నాను. బాబా సెహ‌గ‌ల్‌ను చూడ‌గానే నాకు త‌నైతే నా విల‌న్ పాత్ర‌కు సూట్ అవుతాడ‌నిపించింది.

న‌టుడిగా చైతు ఎంతో ప‌రిణితి చెందాడు.....
- ఏ మాయ చేశావె నుండి సాహ‌సం శ్వాస‌గా సాగిపో .. ఈ ప్ర‌యాణంలో నాగ‌చైత‌న్య న‌టుడుగా ఎంతోప‌రిణితి చెందాడు. ఏ మాయ చేశావె త‌న‌కు సెకండ్ మూవీ, నా స‌ల‌హాలు అవ‌స‌ర‌మైయ్యేవి. కానీ సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా విష‌యానికి వ‌స్తే నేను ఎలా చేయాలో చెప్పేవాడిని నేను అనుకున్న దాన్ని చేసేవాడు. అంత‌లా నాగ‌చైత‌న్య న‌టుడుగా ప‌రిణితి చెందాడు.

చైతును త‌మిళంలో లాంచ్ చేస్తాను...
- చైతు త‌మిళం బాగా మాట్లాడుతాడు. మంచి ప‌ర్స‌నాలిటీ ఉన్న హీరో. కాబ‌ట్టి త‌న‌ను త‌మిళంలో కూడా నేనే లాంచ్ చేయాల‌నుకుంటున్నాను.

తదుప‌రి చిత్రాలు...
- తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డంలో భాష‌ల్లో ఒకేసారి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమాకు తెలుగులో నాగ‌చైత‌న్య‌ను హీరోగా అనుకుంటున్నాను. అలాగే విక్ర‌మ్ హీరోగా ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాను. ప్ర‌స్తుతం అన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved