pizza
G. Nageswara Reddy interview about Eedo Rakam Aado Rakam
పొగరుతో కాదు..నమ్మకంతో వస్తున్నాం –జి.నాగేశ్వరరెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

10 April 2016
Hyderaba
d

ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై మంచు విష్ణు, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డితో ఇంటర్వ్యూ...

కాన్సెప్ట్ ఏంటంటే...
ఇద్దరు అబద్దాలు చెప్పే మిత్రులు, వారి అబద్దాలతో పనులు సాధించుకుంటూ ఉంటారు. వీరి అబద్దాలు వల్ల వారికి అనుకోకుండా చిన్నపాటి కన్ ఫ్యూజన్స్ ఏర్పడుతాయి. దానివల్ల వీరికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? దాని నుండి వారెలా బయట పడ్డారనేదే కథ.

సినిమా ఎలా ప్రారంమైంది...
ముందు ఈ సినిమాను విష్ణుగారితో చేయాలనుకున్నాను. రాజా రవీంద్ర మాకు ఫోన్ చేసి రాజ్ తరుణ్ ఈ సినిమా చూసి తను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాడని చెప్పాడు. తనకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమేనని చెప్పాను. తర్వాత విష్ణు, రాజ్ తరుణ్ లు కలుసుకుని మాట్లాడుకున్నారు. సినిమా ప్రారంభమైంది. నిజానికి విష్ణు హీరోగా భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను. అలాగే విష్ణు వాళ్లు వేరే నిర్మాతతో ఈ సినిమా చేద్దామనుకున్నారు. కానీ చివరగా ఆ రెండు ప్రాజెక్ట్స్ కొన్ని కారణాలతో కుదరకపోవడం, చివరకు రాజారవీంద్రగారు ముందుకు రావడంతో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా రూపొందింది. పంజాబీ మాతృకలోని మెయిన్ పాయింట్ ను తీసుకుని సినిమాను మన నెటివిటీకి తగిన విధంగా రూపొందించారు.

మెయిన్ హీరోలతో చేయకపోవడానికి....
నన్ను సినిమాలు చేయమని నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి సీనియర్ హీరోలు అడిగారు. అయితే వారు అడిగినప్పుడు నేను చేయలేకపోయాను. నేను చేయాలనుకున్నప్పుడు వారు బిజీగా ఉన్నారంతే తప్ప నేను అందరితో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను.

ఈ సినిమాతో చెప్పాలనుకున్న విషయమదే...
ఈ తరంలో అమ్మాయిలు పెళ్లి కాగానే వారికంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటారు కానీ అత్తమామలతో ఉండాలనుకోరు. కానీ ప్రతి ఒక్కరికీ కుటుంబం అనేది చాలా ముఖ్యం. ఆ కుటుంబం ప్రాముఖ్యతను చెప్పడమే ఈ సినిమా మెయిన్ పాయింట్.

రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్...
రాజేంద్రప్రసాద్ గారు చాలా కీలకమైన పాత్ర చేశారు. విష్ణుగారి తండ్రిపాత్రలో కనపడతారు. హీరోలు తమ అబద్దాలతో ఆయన్ని కన్ ఫ్యూజన్ చేయడమే లక్ష్యంగా ఉంటారు.

G. Nageswara Reddy interview gallery

ప్రొడక్షన్ హౌస్ గురించి....
అనీల్ సుంకరగారు మనసాక్షితో సినిమాలు చేస్తారు. ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం చాలా సులభం. సినిమాకి ఏది అవసరమో దాన్ని చేయడానికి మనకు కావాల్సినంత స్వేచ్చనిస్తారు.

సినిమాపై నమ్మకంతోనే...
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రన్ అవుతుంది. అలాగే ఏప్రిల్ 22న సరైనోడు విడుదలవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య మా సినిమాను విడుదల చేయడానికి కారణం పొగరుతో రావడం లేదు. మా సినిమాపై నమ్మకంతో వస్తున్నాం. సర్దార్, సరైనోడు రెండు సినిమాలు మాస్ ఎంటర్ టైనర్స్ అయితే మా సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

అక్కడ కూడా సక్సెస్ కావాలి...
నాకు బిజినెస్ మైండ్ లేదు. అందుకే జయసూర్య తర్వాత సినిమాను ప్రొడక్షన్ చేయలేదు. అయితే ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ సాధించాలనుకుంటున్నాను. కచ్చితంగా సక్సెస్ సాధిస్తాను.

రీమేక్ చేయడం కష్టం..
స్ట్రయిట్ సినిమా కంటే రీమేక్ చేయడం కష్టం. ఎందుకంటే సక్సెస్ అయిన రీమేక్ పై అందరికీ ఒక్కో దృక్పథం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని రీమేక్ చేయాల్సి ఉంటుంది. అందుకనే నా దృష్టిలో రీమేక్ చేయడం కష్టం.

తదుపరి చిత్రాలు...
ఆటాడుకుందాం రా చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత భోగవల్లి ప్రసాద్, నరేష్ కాంబినేషన్ లో నా నెక్ట్స్ మూవీ ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved