pizza
Gopichand Malineni interview (Telugu) about Winner
`విన్న‌ర్` త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను విన్ చేస్తుంది - గోపీచంద్ మ‌లినేని
You are at idlebrain.com > news today >
Follow Us

23 February 2017
Hyderabad

`డాన్ శీను`, `బాడీ గార్డ్`, `బ‌లుపు`, `పండ‌గ‌చేస్కో` చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని. తాజాగా సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా `విన్న‌ర్‌`నుతెర‌కెక్కించారు. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్న ఈ సినిమాకు న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లు. ఈ నెల 24న మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి గురువారం గోపీచంద్ మ‌లినేని విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* విన్న‌ర్ గురించి చెప్పండి?
- మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మా విన్న‌ర్‌ను ఈ నెల 24న విడుద‌ల చేస్తున్నాం. ఈ సినిమాను కొత్త బ్యాక్‌డ్రాప్‌తో చేశాం. హార్స్ రే్స్ బ్యాక్‌డ్రాప్‌లో చేశాం. క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇందులో మంచి యాక్ష‌న్ ఉంటుంది. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఎక్స్ పెక్ట్ చేయ‌నంత ఎమోష‌న్స్ ఉంటాయి. జ‌గ‌ప‌తిబాబుగారు, సాయిధ‌ర‌మ్‌తేజ్‌గారి మ‌ధ్య చాలా హార్ట్ ట‌చింగ్ సీన్లు ఉంటాయి. తేజ్‌కి నెక్స్ట్ లెవ‌ల్ సినిమా అవుతుంది. త‌మ‌న్ చ‌క్క‌టి మాస్ సాంగ్స్ ఇచ్చారు. తేజ్‌లో ఎమోష‌న‌ల్ యాంగిల్ ఇందులో కొత్త‌గా ఉంటుంది. తేజ్ చాలా బాగా చేశాడు. ఇందులో హైలైట్స్ ఏంటంటే తేజ్ కొత్తగా క‌నిపిస్తాడు. డైలాగ్ డెలివ‌రీ, లుక్స్ అన్నీ కొత్త‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు తేజ్‌. క‌థ‌తో పాటే ఉంటుంది యాక్ష‌న్ ఎపిసోడ్ కూడా. క్లైమాక్స్ లో చివ‌రి 15-20 నిమిషాలు హార్స్ చేజ్ ఉంటుంది. ఆ ఫైట్‌ను హాలీవుడ్ ఫైట్‌మాస్ట‌ర్ క‌ల‌యాన్ చేశారు. ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు ఫైట్ మాస్ట‌ర్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి ఆయ‌న‌. క్లైమాక్స్ ను ట‌ర్కీ ఇస్తాంబుల్‌లో చిత్రీక‌రించిన‌ప్పుడు చాలా బాగా చేశారు. తేజ్‌కి ఎక్క‌డా దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా చాలా కేరింగ్‌గా చేశారు. ట‌ర్కీ హార్స్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌. అక్క‌డి మేం వాడిన గుర్రాలు రేసుల్లో పాల్గొనేవి. వాటిని మేం షూటింగ్ కోసం వాడాం. మ‌నిషిని పోలిన మ‌నిషి ఉండ‌రు అని అంటారు క‌దా, అలాగే గుర్రాన్ని పోలిన గుర్రం కూడా ఉండ‌దు. ప్ర‌తి గుర్రానికి దాని ప్ర‌త్యేక‌త ఉంటూనే ఉంటుంది. ఈ చిత్రంలో మేం తేజ్ కోసం వాడిన గుర్రం 15-20 సినిమాల్లో న‌టించింది. మేం యాక్ష‌న్ అన‌గానే వెళ్లేది. క‌ట్ అన‌గానే ఆగేది. అంత‌టి ట్రైనింగ్ ఉన్న గుర్ర‌మ‌ది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ఇంకో హైలైట్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. త‌న‌తో నేను పండ‌గ‌చేస్కోలో ప‌నిచేశాను. అనుష్క త‌ర్వాత అంత కంఫ‌ర్ట‌బుల్ హీరోయిన్ త‌ను. ఇందులో అథ్లెట్‌గా న‌టించింది. రన్నింగ్ రేసులో మెడ‌ల్ తెచ్చుకోవాల‌న్న ఎయిమ్ ఉన్న అమ్మాయిగా న‌టించింది. ర‌కుల్ చిన్న కంప్ల‌యింట్ కూడా చెప్ప‌దు. త‌న‌తో ప‌నిచేస్తుంటే ఇంకెన్ని సినిమాల్లోనైనా చేయాల‌ని అనిపిస్తుంటుంది. అంత కంఫ‌ర్ట‌బుల్‌గా ఉంటుంది. తెలుగు చాలా బాగా మాట్లాడుతోంది. ఇంకో నాలుగు సినిమాల త‌ర్వాత తెలుగులో త‌ను డైలాగులు రాసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. తెలుగులో ఏ అక్ష‌రాన్ని ఒత్తి ప‌ల‌కాలో కూడా చ‌క్క‌గా తెలుసుకుంది. అంత‌టి డెడికేట‌డ్ హీరోయిన్ త‌ను. జ‌గ‌ప‌తిబాబుగారి పాత్ర హైలైట్ అవుతుంది.

* ఇందులో హీరో పాత్ర ఎలా ఉంటుంది?
- గుర్రాల‌న్నా, రేసుల‌న్నా ప‌డ‌ని హీరో.. ఒకానొక సంద‌ర్భంలో గుర్రాల‌మీద రేసులో పాల్గొని ఎలా గెలిచాడు? అత‌ను రేసుల్లోకి వెళ్లింది నాన్న కోస‌మా? ల‌వ‌ర్ కోస‌మా? ఇంకేమైనానా అనేది కీల‌కం. సినిమా ఫ‌స్టాఫ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. సెకండాఫ్ బెంగుళూరులో జ‌రుగుతుంది.

* ఈ సినిమా కోస‌మే తేజ్ గుర్ర‌పు స్వారీ నేర్చుకున్నారా?
- త‌ను హీరో కావాల‌నుకున్న‌ప్పుడే కాస్త నేర్చుకున్నారు. ఈ సినిమా కోసం కూడా కొన్నాళ్ల పాటు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. గండిపేట‌లో హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్‌లో నేర్చుకున్నారు.

* హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్‌తో ప్ర‌త్యేకంగా యాక్ష‌న్ ఎపిసోడ్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి?
- మోర్ కేరింగ్‌గా ఉంటారండీ. ఇందాకే చెప్పిన‌ట్టు తేజ్‌కి వాడిన గుర్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న చాలా బాగా యాక్ష‌న్ ఎపిసోడ్ ని కంపోజ్ చేశారు.

* గ‌బ్బ‌ర్‌సింగ్ ట‌వ‌ల్‌ని వాడిన‌ట్టున్నారు?
- అది సినిమాలో చాలా బ్యూటీఫుల్ టైమింగ్‌లో వ‌స్తుందండీ. హీరో కేర‌క్ట‌ర్ బిల్డ‌ప్ చేసే స‌మ‌యంలో ప‌వ‌ర్‌ని చూపించాల‌ని పెట్టాం.

* ప‌వ‌ర్‌ని చూపించ‌డానికా? ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని చూపించ‌డానికా?
- అదే ప‌వ‌ర్‌ని... (న‌వ్వు)

Gopichand Malineni interview gallery

* నిర్మాత‌ల గురించి చెప్పండి?
- నేను ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ లో ల‌క్ష్యం సినిమాకి ప‌నిచేశా. అలాగే ఠాగూర్ మ‌ధుగారి లియో ప్రొడ‌క్ష‌న్స్ లో `స్టాలిన్‌`కి ప‌నిచేశా. ఇప్పుడు వారిద్ద‌రూ క‌లిసి చేస్తున్న ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మురుగ‌దాస్‌గారి దగ్గ‌ర కూడా యాక్టివ్ అసోసియేట్‌గా ఉండేవాడిని. తేజ్‌కి మంచి సినిమా అవుతుంది. ఈ క‌థ‌కి స్పాన్ ఎక్కువ‌గా ఉంద‌ని న‌మ్మకంగా ఖ‌ర్చుపెట్టారు. మంచి టెక్నీషియ‌న్స్ ఇచ్చారు. చోటాగారు ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యారు. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఫిల్మ్ ఉక్రెయిన్‌లో సాంగ్స్ చేసింది మాదే. షూటింగ్ చాలా చోట్ల చేశాం. బెంగుళూరులో విజ‌య్ మాల్యా స్ట‌డ్ ఫామ్ ఉంది. అక్క‌డ గుర్రాల‌కి సంబంధించిన ప్ర‌తిదీ దొరుకుతుంది. దాదాపు 700 ఎక‌రాల్లో ఉంది ఆ ఫామ్‌. గ‌వ‌ర్న‌మెంట్ నుంచి లీజ్‌కు తీసుకుని ర‌న్ చేస్తున్నారాయ‌న‌. మేజ‌ర్ సీక్వెన్స్ అన్నీ అక్క‌డే చేశాం. విజ‌య్ మాల్యా గెస్ట్ హౌస్ కూడా వాడాం. అర‌కులో కూడా కీల‌క స‌న్నివేశాల‌ను చేశాం. ఎక్కువ లొకేష‌న్ల‌లో చేశాం. నిర్మాత‌ల స‌హ‌కారంతో చాలా బాగా చేశాం.

* అన‌సూయ ఐట‌మ్ సాంగ్ ఎవ‌రి సెల‌క్ష‌న్‌?
- అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్ర‌తి ఇంట్లో అంద‌రికీ తెలుసు. మాది ఒంగోలు. మా ప్రాంతంలో కూడా అన‌సూయ‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆమెను సంప్ర‌దించాం. ముందు వ‌ద్ద‌న్న‌దే కానీ, త‌ర్వాత ఒప్ప‌కుంది.

* సుమ ఎవ‌రి సెల‌క్ష‌న్?
- త‌మ‌న్ సెల‌క్ష‌న్‌. సుమ‌గారు ఎక్క‌డో స్టేజ్ మీద పాట పాడిన‌ప్పుడు విని త‌మ‌న్ పాడిద్దామ‌న్నారు. స‌రేన‌ని పాడించాం. చాలా బాగా యాప్ట్ అయింది. ఇద్ద‌రు యాంక‌ర్లు అందులోనూ టాప్ యాంక‌ర్లు క‌లిసి చేసే ఈ పాట చాలా క్రేజీగా ఉంటుంది అని అనుకున్నాం.

* ఎక్కువ ఖ‌ర్చుపెట్టి తీసిన‌ట్టున్నారు? భ‌య‌మ‌నిపించ‌లేదా?
- డే ఒన్ నుంచి నాకు ఆ భ‌యం ఉంటూనే ఉంటుంది. ఈ సినిమాకు కూడా ఉంది. కాక‌పోతే ఈ క‌థ‌ను, హీరోను, ద‌ర్శ‌కుడిని న‌మ్మి నిర్మాత‌లు పెట్టారు. ఈ సినిమా వారి న‌మ్మ‌కాన్ని నిలబెడుతుంది. మామూలుగా సినిమా చూసిన వారు రూ.40కోట్లు అయి ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ అందులో స‌గం బ‌డ్జెట్‌లోనే తీసేశాం.

*ఇతర పాత్ర‌ల గురించి చెప్పండి?
- పృథ్వి సింగం సుజాత అనే పాత్ర‌లో చేశారు. ఆలీగారు పీట‌ర్ హెయిన్స్ అనే పాత్ర‌లో చేశారు. వెన్నెల‌కిశోర్ చేసిన ప‌ద్మ అనే పాత్ర కూడా మెప్పిస్తుంది.

* మీరు ఆచితూచి సినిమాలు చేయ‌డానికి కార‌ణం?
- హిట్ సినిమా చేయాల‌నే. గ‌బ‌గ‌బా సినిమాలు తీసి వాటిని ఫ్లాప్ చేయ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. అందుకే జాగ్ర‌త్త‌గా తీసుకుంటున్నా.

* సొంత క‌థ‌తో సినిమాలు తీయ‌డంలో ఉన్న సౌల‌భ్యం ఏంటి?
- నా తొలి సినిమా డాన్ శీను నా క‌థే. ఆ త‌ర్వాత ఒక‌టి రీమేక్‌. రెండు ఇత‌రుల క‌థ‌ల‌తో చేసుకున్నా. ఈ సినిమా కూడా పాయింట్‌గా నాకు ముందు నుంచే తెలుసు. క‌లిసి ట్రావెల్ అయి చేసిన సినిమా కాబ‌ట్టి నాకేం కొత్త‌గా అనిపించ‌లేదు.

* పెద్ద హీరోల సినిమాల‌ను చేయ‌లేక‌పోతున్నామ‌నే బాధ ఉందా?
- ఈ సినిమా త‌ర్వాత అది తీరిపోతుంది. న‌న్ను నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లే చిత్ర‌మ‌వుతుంది.

* నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి?
- రెండు, మూడు ఉన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved