pizza
Goverdhan Gajjala interview about "Prema Entha Maduram Priyuraalu Antha Katinam" (PEMPAK)
సినిమాల మీద ఆస‌క్తితో `ప్రేమ ఎంత మ‌ధురం ప్రియురాలు అంత క‌ఠినం` చేశా - గోవ‌ర్ధ‌న్ గుజ్జ‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

7 November 2017
Hyderabad

చంద్రకాంత్రా, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం `ప్రేమ ఎంత మ‌ధురం.. ప్రియురాలు అంత క‌ఠినం`. గోవ‌ర్ధ‌న్ గుజ్జ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌నే నిర్మాత‌. ఈ సినిమా గురించి ఆయ‌న హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు

మా `ప్రేమ ఎంత మ‌ధురం ప్రియురాలు అంత క‌ఠినం` సినిమాను ఎన్నారైలు అంద‌రం క‌లిసి యుఎస్‌లో తీశాం. నేను డైర‌క్ట‌ర్ని. ఒక నిర్మాత‌ను కూడా . ఫ్రెండ్స్ అంద‌రం క‌లిసి ప్రొడ్యూస్ చేశాం. నేను ఇక్క‌డే పుట్టి చ‌దువుకుని 2004లో యుఎస్‌కి వెళ్లాను. అక్క‌డ మాస్ట‌ర్స్ చేశా. 2006 నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టాను. సినిమాలంటే నాకు పిచ్చి. ఎనాల‌సిస్ చేశాను. మా బ్ర‌ద‌ర్ కార్తిక్ రెడ్డి అడ్డా సినిమా ద‌ర్శ‌కుడు. త‌న‌తో చాలా డిస్క‌స్ చేసేవాడిని. నేను యూనివ‌ర్శిటీ ఆఫ్ కేలిఫోర్నియాలో ఆరు నెల‌లు డైర‌క్ష‌న్ కోర్పు చేశాను. నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ కి మంచి అప్రిషియేష‌న్ వ‌చ్చింది. నా ఫ్రెండ్స్, వెల్ విష‌ర్స్ చాలా ఎంక‌రేజ్ చేశారు. ఆ ఎంక‌రేజ్‌మెంట్‌తోనే మ‌రో ఐదు షార్ట్ ఫిలిమ్స్ చేశా. నా షార్ట్ ఫిలిమ్స్ని నేనే ఎడిట్ చేసి, మ్యూజిక్ చేశా. అన్నీ అక్క‌డే నేర్చుకున్నా.

తెలుగు ఆస‌క్తి
నేను ఎన్ని సినిమాలు చూసినా, చేసినా నాకు తెలుగు సినిమా చేయాల‌ని ఉండేది. ఏడాది పాటు స్క్రిప్ట్ రాశాను. మొత్తం లాక్ చేశాక చాలా మంది ఇన్‌పుట్స్ చేశాను. నా ఫ్రెండ్స్ ని అప్రోచ్ అయి టీమ్‌ని ఫార్మ్ చేసి, బ‌డ్జెట్ ప్లాన్ చేశా. కాస్టింగ్‌, టీమ్‌ని ఫైన‌లైజ్ చేసి జాబ్ వ‌దిలేశా. నేను ఉద్యోగం వ‌దిలి ఏడాదైంది. 2017 జ‌న‌వ‌రిలో డ‌ల్లాస్‌, టెక్సాస్‌లో షూటింగ్ మొద‌లుపెట్టాను. 38 రోజులు షూటింగ్ చేశా. ఏడుగురు క్రూతో, లిమిటెడ్ క్యాస్ట్ తో చేశాం. ప్రొడ‌క్ష‌న్ క్వాలిటీస్‌, మేకింగ్ అన్నిటినీ అంద‌రూ మెచ్చుకుంటారు. నేను 300 మంది మెంబ‌ర్ల‌కు ప్రీమియ‌ర్ షోస్ వేసి చూపించాను. అంద‌రికీ న‌చ్చింది. జెన్యూన్‌గా తీశాన‌ని మెచ్చుకున్నారు. అది మంచి శుభారంభం అనిపించింది. థియేట‌ర్‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్ర‌స్టింగ్‌గా సినిమాను చూస్తారు.

మెయిన్ బ‌లం
ఈ సినిమాలో న‌టించిన హీరో, హీరోయిన్లు ఇద్ద‌రూ మెథ‌డ్ ఆర్టిస్ట్ లు. ప‌ల్ల‌వి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసింది. మంచి న‌టి. అక్క‌డ చాలా ఫేమ‌స్ అమ్మాయి. మ‌నోజ్ రెడ్డి కెమెరా చాలా బాగా ఉంటుంది. సినిమాటోగ్ర‌ఫీలో ఆయ‌న మాస్ట‌ర్స్ చేశారు. సిద్ధార్థ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. కొలంబ‌స్ సినిమా చేసిన వ్య‌క్తి ఈ సినిమాకు సంగీతం చేశారు. ఆదిత్య ద్వారా మా సంగీతం విడుద‌లైంది. కామెంట్స్ అన్నీ ఎంక‌రేజింగ్‌గా ఉంది. సినిమా విడుద‌ల‌య్యాక ఇంకా పాట‌ల‌కు మంచి పేరు వ‌స్తుంది. ఎడిటింగ్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడ‌తారు. చాలా మంచి ర‌న్‌టైమ్ ఉంటుంది. న‌వంబ‌ర్ 17న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇంత‌కుమ ఉందు థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డంతో పోస్ట్ పోన్ చేశాం. ఈ సారి మాత్రం త‌ప్ప‌కుండా వ‌స్తాం. ఫ‌స్ట ఆఫ్ మొత్తం ప్రేమ మ‌ధురంగా ఉంటుంది. సెకండాఫ్‌లో ప్రియురాలు క‌ఠినంగా మారుతుంది. ఎందుకు అనేది ఆస‌క్తిక‌రం. యూత్‌కి చాలా బాగా క‌నెక్ట్ అవుతుంది.

బెక్కం స‌పోర్ట్
ఈ సినిమాకు బెక్కం వేణుగోపాల్‌గారు చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. ఆయ‌న చాలా బాగా గైడ్ చేస్తున్నారు. థియేట‌ర్ల విష‌యంలోనూ చాలా స‌హ‌క‌రించారు. ఐదు పాట‌లుంటాయి. అన్నీ మాంటేజెస్‌. ఒక‌టి ఇంగ్లిష్ పాట ఉంటుంది. డ్యాన్సులు ఉండ‌వు. సినిమా చూస్తే ఇంత బాగా పాట‌ల‌ను బ్లెండ్ చేశార‌నే అంటారు. పాత సినిమా పాట నుంచి తీసుకున్న టైటిల్ ఇది. అంద‌రికీ చాలా బాగా న‌చ్చింది. లెంగ్తీగా ఉన్నా జ‌నాల్లోకి వెళ్తుంద‌ని, క‌థ‌కు సూట్ అయింద‌ని పెట్టాం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved