pizza
Harshika Poonacha about Appudalaa Ippudilaa
ఈ ఏడాది తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తా – హర్షికా పునాచా
You are at idlebrain.com > news today >
Follow Us

29 March 2016
Hyderaba
d

దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యతేజ, హర్షికా పునాచా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ హర్షికా పూనాచా మాట్లాడుతూ ‘’అప్పుడలా ఇప్పుడిలా చిత్రం తెలుగులో తొలి సినిమా. హీరోయిన్ గా కన్నడంలో ఇప్పటికి 10-12 సినిమాలు చేసిన తెలుగులో తొలి సినిమా రిలీజ్ అవుతుంటే ఓ రకమైన టెన్షన్ గా అనిపిస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ చూడదగ్గ చిత్రం. హీరో, హీరోయిన్ ఇద్దరికీ ప్రాముఖ్యత ఉండే సబ్జెక్ట్. సమాజానికి సేవ చేసే ఆలోచన ఉన్న, బాగా డబ్బున్న అమ్మాయి పాత్రలో కనపడుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

కన్నడలో నేను నంది అవార్డుతో పాటు సైమా అవార్డును కూడా పొందాను. అలాగే ఈ ఏడాది నేను కన్నడలో నటించిన రే చిత్రం విడుదలై అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ ఏడాది తెలుగులో విడుదలవతున్న అప్పుడలా ఇప్పుడిలా కూడా మంచి సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Harshika Poonacha interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved