pizza
Jagapathi Babu interview (Telugu) about Aravinda Sametha
త‌న‌కి ఆ భ‌యం లేదు - జ‌గ‌ప‌తి బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

20 October 2018
Hyderabad

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే న‌టించిన చిత్రం `అర‌వింద స‌మేత‌..`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత‌. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం విడుద‌లైంది. ఈ సంద‌ర్బంగా ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించిన జ‌గ‌ప‌తిబాబు పాత్రికేయుల‌తో సినిమా గురించి మాట్లాడుతూ ..

క్రియేట్ చేసింది.. ఎంక‌రేజ్ చేసింది...
- ఈ పర్టిక్యులర్ సినిమా వరకు పూర్తిగా డైరెక్టర్, హీరో గురించి చెప్పుకోవాలి. ఈ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసింది డైరెక్టర్ అయితే, బాగా ఎంకరేజ్ చేసింది హీరో. ఈ సినిమాలో మంచి విషయం ఏమిటంటే.. అందరు ఆర్టిస్టులు అందర్నీ ఎంకరేజ్ చేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా అందరి క్యారెక్టర్ల గురించి ఆలోచించారు. మామూలుగా తమ తమ క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్‌ని గుట్టుగా రష్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి క్యారెక్టర్లు ఎలా వచ్చాయి అనేది మనకు తెలియదు. జనరల్‌గా నేను ఎవరినీ అడగను. అలాగే నాకు సంబంధించిన సీన్స్‌ని కూడా మానిటర్‌లో చూడను. అటువంటిది ప్రతిరోజూ రష్ చూసి ఇది బాగుంది, ఇతను బాగా చేశాడు అని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నారు. అది సినిమా బ్యూటీ. అలా నా క్యారెక్టర్‌కి నేచురల్‌గానే ఎంకరేజ్‌మెంట్ చాలా ఎక్కువ ఉంది. తారక్ చెప్పడం మొదలు పెడితే ఒక రేంజ్‌లో ఉంటుంది. ఒక టాప్ హీరో అయి ఉండి ఎప్పుడూ నన్నే పొగుడుతున్నాడు. చాలా బాగా చేశావు, ఇంకా బాగా చెయ్యాలి అంటూ తను ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ చాలా బాగుంది.

పోతే పోయింద‌నిపించింది..
- గొంతు వరకు నేను చాలా కష్టపడ్డానని చెప్పాలి. గొంతు పోతుందా.. పోతే పోయింది. ఏమైపోయినా ఫర్వాలేదు అనిపించింది. ఎందుకంటే త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక డైరెక్టర్‌గా అతనంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. తారక్ నాకు మంచి ఫ్రెండ్. ఒక బ్రదర్‌లా, ఫ్రెండ్‌లా అతనంటే నాకు ఇష్టం.

ఏదో చేయ్యాల‌నిపించింది...
- ఓపెన్ చెయ్యగానే నోట్లో బుల్లెట్ పెట్టుకొని ఫస్ట్ డైలాగ్ ‘కూత లేతగా ఉంది. నారపరెడ్డి కొడుకా’ అనగానే అక్కడ క్యారెక్టర్ ఎక్కేసింది. దాంతో ఈ సినిమాకి ఏదో చెయ్యాలి అనిపించింది. నా క్యారెక్టర్ ఇందులో బాగుంటుంది అనుకున్నాను. కానీ, ఇంత బాగా ఉంటుందని ఊహించలేదు. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ శబ్ధాలయా ఇంజనీర్ పప్పు, పెంచలదాస్‌గారికి, అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్‌కి ఇవ్వాలి. వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ ఎక్కువగా ఉంది. ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి అని ఇంప్రవైజ్ చేస్తూనే ఉన్నాం. యాక్టింగ్ కంటే డబ్బింగ్‌కి ఎక్కువ కష్టపడ్డాను.

ఎవ‌రికీ చెప్ప‌లేదు ...
నాకు ఆ భాష టచ్ లేదు. నాకు తెలీదు కూడా. పెంచలదాస్‌గారు మాడ్యులేషన్ గురించి చెప్పారు. ఆయన సినిమాకు కొత్త. తన చెప్పే విధానంలో ఆయన చెప్పేవారు. దాన్ని సినిమా పద్ధతిలో నేను చెప్పేవాడిని. నా వాయిస్ ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలి అనే డిస్కషన్ మొదట్లో రాలేదు. ఈ క్యారెక్టర్ వాయిస్ విషయంలో కొన్ని మాడ్యులేషన్స్ ఉన్నాయి. అది నేను మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. మనం చేసేటప్పటి కంటే డబ్బింగ్ చెప్పేటప్పటి కంటే కాపీలో అది బాగుంటుందని నాకు తెలుసు. అది సీక్రెట్‌గా దాచాను. ఎవరికీ చెప్పలేదు. డబ్బింగ్‌లో ఎన్నో రకాలుగా ఇంప్రవైజ్ చెయ్యొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ డబ్బింగ్. ఏదైనా మానిప్లేషన్ చెయ్యొచ్చు, మిస్టేక్స్‌ని కవర్ చేసుకోవచ్చు. నా క్యారెక్టర్‌కి డబ్బింగ్‌లోనే ఎక్కువ పేరు వచ్చింది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పేటప్పుడు కళ్ళు తిరిగి ఆల్‌మోస్ట్ పడిపోయే పరిస్థితి చాలాసార్లు వచ్చింది. వచ్చింది. క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయి పీక్ ఎమోషన్‌లో డబ్బింగ్ చెప్పినప్పుడు మేజర్ ఎక్స్‌టెంట్‌కైతే వెళ్ళింది. ముందు చెప్పినట్టు గొంతు పోయినా ఫర్వాలేదు అని చేశాను.

తార‌క్ గొప్ప‌త‌నం...
- విలన్ క్యారెక్టర్ ఇలా ఉన్నప్పుడు, అతని క్యారెక్టర్ నీ క్యారెక్టర్‌ని డామినేట్ చేస్తోంది అనిపించినపుడు నీ కాన్ఫిడెన్స్ లెవల్ ఏంటి? అని అడిగాను. ‘ఒకటే బాబు సినిమా ఈజ్ లార్జర్ దేన్ ఎ హీరో. సినిమా పెద్దది, హీరో కాదు. సినిమా పెద్దదైతేనే హీరో పెద్దోడవుతాడు. నువ్వు ఎంతైనా చెయ్యి, ఏదైనా చెయ్యి. హీరో నేను. సినిమా నాది’ అన్నాడు. తనకి ఆ భయం లేదు. ఎందుకంటే నన్ను తనే ఎంకరేజ్ చేసేవాడు. ప్రెస్‌మీట్‌కి కూడా మీరు రావాలి, బసిరెడ్డి లేకపోతే సినిమా లేదు’ అన్నాడు. నిజానికి ఏ హీరో అలా చెప్పడు. మొన్నామధ్య వరంగల రవి నా ఫ్యాన్‌తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు.. ‘మారుమూల విలేజెస్‌లో ఇప్పటివరకు జగపతిబాబు అంటే తెలీదు. ఇప్పుడు తెలిసింది’ అన్నారు. ఇన్ని సినిమాలు చేశాను. ఇప్పటివరకు తెలీదా అని ఆశ్చర్యమేసింది. జగపతిబాబు అంటే ఏమిటి అని ఇప్పుడు యూ ట్యూబ్‌లో చూడడం మొదలుపెట్టారు. అదే టైమ్‌లో హీరోని కూడా మెచ్చుకున్నాడు. ‘చాలా గొప్ప మనసుండాలి. క్యారెక్టర్ పెరిగినపుడు హీరో నొక్కేస్తుంటారు అని బయట చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్యారెక్టర్‌ని ఒప్పుకోవడం నిజంగా తారక గొప్పతనం. ఇది ఫ్యాన్స్ నుంచి వచ్చిన మాట. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా ఈజ్ లార్జర్. అందరూ పాత సినిమాలు చూసినవాళ్ళే. రంగారావుగారు, గుమ్మడిగారు, నాగభూషణంగారు.. ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందర్నీ డామినేట చేసినా ఫర్వాలేదు అని కోరుకుని మరీ పెట్టుకునే వారు. రంగారావుగారు... రామారావుగారిని డామినేట్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా యాక్సెప్ట్ చేశారు. అందుకే వాళ్లు చేసిన సినిమాలు అంత పెద్ద సినిమాలు అయ్యాయి. దాన్ని జస్టిఫై చెయ్యడానికి నేను కూడా ‘శుభలగ్నం’ వంటి సినిమాలు చేశాను. ఈ సినిమా చేసేటపుడు కృష్ణారెడ్డిగారు అనేవారు ‘ఆమని సినిమాని పట్టుకుపోతుంది బాబూ’ అని. అది ఆమని సినిమా, నా సినిమా కాదు. నేను హీరోని మాత్రమే. ఆ క్రెడిట్ అంతా ఆమనికే వెళ్ళాలి’ అని చెప్పాను. అలాగే ‘సామాన్యుడు’ సినిమాలో సాయికుమార్‌ని ‘బాగా చేస్తున్నావు. ఇంకా బాగా చెయ్యి’ అనేవారు. అదే మనకు కావాల్సింది. అదే తారక్ కూడా కోరుకున్నది.

interview gallery



అప్పుడంతా ఎంజాయ్ చేయ్య‌లేదు...
- నేను దేనికి హీరోని. హీరో అనేది జస్ట్ ట్యాగ్. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నంతగా నేను అప్పుడు ఎంజాయ్ చెయ్యలేదు. ఇప్పుడు చూస్తున్నంత సక్సెస్ అప్పుడు చూడలేదు. ఇప్పుడు చేస్తున్న ఆర్టిస్టులతో, డైరెక్టర్స్‌తో అప్పుడు చెయ్యలేదు. ఇన్ని భాషల్లోనూ చెయ్యలేదు. నాకు ఇంకేం కావాలి. అది నాకు చాలా చిన్న విషయం.

అనుకోలేదు..

- ఇక్కడ ఉన్నది నేను కాదు. నిజానికి నేను ఇలా మారతానని అనుకోలేదు. నాకు తెలిసి అంతఃపురంలో వైల్డ్ క్యారెక్టర్ చేశాను. మిగతా క్యారెక్టర్స్ అన్నీ సాఫ్టే. నిజంగా నేను కూడా ఈ క్యారెక్టర్ చేస్తానని అనుకోలేదు.

క్లాస్ క్యారెక్ట‌ర్స్ అంటే ఇష్టం...

- జనరల్‌గా నాకు పోష్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. క్లాస్‌గా ఉండే క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. గాడ్‌ఫాదర్‌లాంటి సినిమా చెయ్యాలని ఉంది. బేసిక్‌గా ఆ స్టైల్‌కి, నా వాయిస్‌కి అలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తాను. కానీ, ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్‌లో జస్టిఫై అయిపోయాను కాబట్టి నెక్స్‌ట్ ఏం చెయ్యాలనేది నాకు అర్థం కావడం లేదు. బసిరెడ్డి క్యారెక్టర్ దాటి ఎలాంటి క్యారెక్టర్ కన్‌సీవ్ చెయ్యగలనో నాకు తెలీదు. ఎందుకంటే బాగా చెయ్యగలనని కూడా నేను అనుకోవడం లేదు.

క‌థ విన‌లేదు..

- నేనసలు కథే వినలేదు. పెద్ద డైరెక్టర్స్‌ని, మంచి డైరెక్టర్స్‌ని నమ్మానంటే కథ వినను. జనరల్‌గా సినిమా అయిపోయింది.. ఇంకా ఏముంటుంది అనే దాంట్లోనే ఒక బ్యూటీ వచ్చింది. బసిరెడ్డి అనేవాడు సినిమా మొదట్లోనే చనిపోయాడు. చనిపోయాడనుకున్న మనిషి మళ్ళీ వస్తాడు. అక్కడే డైరెక్టర్ గొప్పతనం కనిపిస్తుంది. బసిరెడ్డి ఉన్నాడు అని చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. చివరలో నా క్యారెక్టర్ చనిపోయిన తర్వాత అనుకోకుండా పాట ఒకటి యాడ్ చేశారు. మళ్ళీ అక్కడ డైరెక్టర్ త్రివిక్రమ్ కనిపించాడు. అదంతా స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో వచ్చేసింది.

తిట్టుకున్నాను..

- ఇది చాలా వైజ్ మూవీ. త్రివిక్రమ్ తీశాడు కాబట్టి, సినిమా ఆడుతోంది కాబట్టి చెప్పడం లేదు. నేను సెట్స్‌కి వచ్చినపుడు నలభై మందితో ఓ ఫైట్ తీస్తున్నారు. తారక్ ఇరగ్గొడుతున్నాడు. నేను తిట్టుకుంటూ వచ్చాను. ‘ఈ గొడవ మానరా? ప్రతి సినిమాలో హీరో నలభై మందిని కొడుతుంటాడు. ఏం గొప్పతనం ఉంది దీంట్లో. త్రివిక్రమ్‌లాంటి వారయినా మార్చాలి కదా అనుకుంటూ వస్తున్నాను. ఆ మధ్యాహ్నానికి షూటింగ్ ఆపేశారు. ఫైట్ వద్దు.. ఇలా చేద్దాం అనుకున్నారు. అదే ఈ సినిమా బ్యూటీ.

కార‌ణం డైరెక్ట‌ర్సే...

- గూఢచారిలో టెర్రరిస్ట్, రంగస్థలంలో ప్రెసిడెంట్, అరవింద సమేతలో ఫ్యాక్షనిస్ట్. మూడు క్యారెక్టర్స్‌లో మూడు రకాల వేరియేషన్స్ ఉన్నాయి. మూడు రకాల యాక్టింగ్ ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అందుకు కార‌ణం డైరెక్ట‌ర్సే.. మూడు సినిమాలకు ముగ్గురు డైరెక్టర్స్. ముగ్గురూ వేర్వేరు జోనర్స్. వాళ్ళు కన్‌సీవ్ చేసిన క్యారెక్టర్స్, వాళ్ళు చూపించిన విధానం డిఫరెంట్‌గా ఉంది. నెక్స్‌ట్ ఏ సినిమా చేయాలి అని ప్రతి సినిమాకీ అనుకుంటాను. అలాగే మూడు సినిమాలు వచ్చాయి. అంతకుముందు సాక్ష్యం సినిమా అంత గొప్పగా ఆడకపోయినా అందులోనూ క్రూరంగా చేశాను, ఇంకేం చెయ్యగలను అనుకున్నాను. ఈ మూడు సినిమాల్లో అరవింద సమేత పీక్. నావరకు నాకు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చెయ్యాలని ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉన్నది కావచ్చు, సాఫ్ట్ హజ్బెండ్ కావచ్చు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved