pizza
Jagapathi Babu about Jaya Janaki Nayaka
నేను బ్యాడ్‌ బిజినెస్‌ మేన్‌, బ్యాడ్‌ ప్రొడ్యూసర్‌ని - జగపతిబాబు
You are at idlebrain.com > news today >
Follow Us

07 August 2017
Hyderabad

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయజానకినాయక'. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ - ''పటేల్‌సార్‌ టీజర్‌ విడుదలైనప్పుడు సినిమాకు అందెంత పెద్ద ఎసెట్‌ అయ్యిందో, అంతేలా మైనస్‌ కూడా అయ్యింది. ఎందుకంటే టీజర్‌ చూసిన ప్రేక్షకులు సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌, హారర్‌ మూవీలా, పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంటుందని భావించారు. ఆడియెన్స్‌ భారీ అంచనాలతో వచ్చారు. కానీ సినిమా ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో లేదు. ఇక సినిమా చాలా త్వరగా అనుకుని రిలీజ్‌ చేసేశారు. ఇవన్నీ కారణాలు అయితే, ఒకసారి ప్రేక్షకుల దృష్టిలో ఫేడ్‌ అవుట్‌ అయిపోయిన హీరో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరించరు. ఇది పటేల్‌సార్‌తో నిజమైంది. అయితే పటేల్‌సార్‌ వల్ల నేను నటించే ఇతర సినిమాలపై ఏ ప్రభావం పడదు. పటేల్‌సార్‌ సినిమాలో హీరోగా నటించడానికి కారణం మంచి కథ. సాయి కొర్రపాటి వంటి మంచి నిర్మాత కథను నమ్మి వచ్చినప్పుడు నేను చేయలేనని కూడా చెప్పలేను కదా..అయితే నాకున్న అనుమానాన్ని ఆయనకు కూడా చెప్పాను. అయితే సబ్జెక్ట్‌ చాలా బలమైనదని నమ్మాను. జయజానకి నాయక చిత్రాన్ని లెజెండ్‌తో పోల్చకూడదు కానీ, ఆ స్థాయిలో నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను.

బోయపాటి చాలా మంచి డైరెక్టర్‌. తనకేం కావాలోబాగా తెలిసిన వ్యక్తి. పరువు పోకూడదనే దానికోసం ఏమైనా చేయాలనుకునే వ్యక్తి. లెజెండ్‌లో ఈగో వున్న వ్యక్తిగా నటిస్తే, జయజానకి నాయకలో పరువుకోసం పాకులాడే వ్యక్తిగా నటించాను. హీరో విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో పెద్దవాడా, చిన్నవాడా అని పక్కనపెడితే, బోయపాటి చేతుల మీదుగా మరోస్టార్‌ ఇండస్ట్రీకి వస్తున్నాడని కచ్చితంగా చెప్పగలను. నన్ను హీరోగా పెట్టి మరో నిర్మాత సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను వారితో వద్దనే అన్నాను. కానీ ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాను. నిర్మాతగా నేను చేయను. ఎందుకంటే నాకు టైమ్‌కు ఆర్టిస్టు రాకపోతే తిట్టేస్తాను. నేను బ్యాడ్‌ బిజినెస్‌ మేన్‌, బ్యాడ్‌ ప్రొడ్యూసర్‌ని అందునే నిర్మాణం చేయదలుచుకోవడం లేదు. బోయపాటి మీద నమ్మకంతో నిర్మాత రవీందర్‌ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమా బిజినెస్‌ కూడా ఎక్కువే అయ్యింది. సినిమాను ప్యాషన్‌తో చేసే మిర్యాల రవీందర్‌రెడ్డి వంటి నిర్మాతలు మనకు ఎంతో అవసరం. ఈ సినిమాతో బోయపాటి ఓ హీరోను, ఓ నిర్మాతను నిలబెట్టాడు. ఇక డ్రగ్స్‌ వ్యవహారానికి వస్తే సినిమావాళ్లంటే సెలబ్రిటీలు కాబట్టి న్యూస్‌ అయ్యింది. మమూళ్లు వాళ్ల పేర్లు బయటకు రాలేదు. నేను ఫీల్‌ అయ్యిందేంటంటే, ఇన్వెస్టిగేషన్‌ చేసే సమయంలో ఎవరీ పేర్లు బయటపెట్టకుండా చేసుంటే బావుండేది. అఖిల్‌ సినిమా చేస్తున్నాను. అడవిశేష్‌ సినిమా చేయాల్సి ఉంది. ఇక కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తున్నాను'' అన్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved