pizza
Jayam Ravi interview about Yamapasham
జాంబీ త‌ర‌హాలో `య‌మ‌పాశం` - జ‌యం ర‌వి
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2016
Hyderaba
d

 

ఎడిట‌ర్ మోహ‌న్ చిన్న‌కొడుకు ర‌వి. పెద్ద కొడుకు రాజా. తెలుగులో హిట్ అయిన `జ‌యం` చిత్రాన్ని త‌మిళంలో తెర‌కెక్కించారు. అప్ప‌టి నుంచి జ‌యం ర‌వి, జ‌యంరాజాగా వారి పేర్లు మారి పోయాయి. జ‌యం ర‌వి హీరోగా త‌మిళ సినిమాల‌తో కెరీర్ మొద‌లుపెట్టిన‌ప్ప‌టికీ బాల న‌టుడిగా `బావ బావ‌మ‌రిది`, `ప‌ల్నాటి పౌరుషం` సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ఆయ‌న న‌టించిన తాజా సినిమా `మిరుద‌న్‌` తెలుగులో `య‌మ‌పాశం` పేరుతో ఈ నెల 19న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌యం రవి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* య‌మ‌పాశం గురించి చెప్పండి?
- జాంబీ అనే వెస్ట్ర‌న్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన సినిమా. సౌత్‌లో కొత్త‌గా ఉంటుంది. హాలీవుడ్‌లో కొన్ని వంద‌ల సినిమాలు వ‌చ్చాయి. కానీ మ‌న‌కు కొత్త జాన‌రే. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను చెప్పిన‌ప్పుడు నాకు అర్థ‌మైంది. వెంట‌నే ఒప్పుకున్నాను. కొత్త త‌ర‌హా సినిమాలు చూడాల‌నుకునేవారికి ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది.

* జాంబీ అంటే ఏంటి?
- న‌డిచే శవం, న‌డిచే మ‌ర‌ణం అని అర్థం. అలాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాను చేశాం. సైన్స్ ఫిక్ష‌న్ త‌ర‌హా చిత్రం.

* క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ అవుతుందా?
- త‌ప్ప‌కుండా వ‌ర్క‌వుట్ అవుతుంది. ఔటాఫ్ ద బాక్స్ కంప్లీట్‌గా వెళ్ల‌లేదు. మ‌న ఆడియ‌న్స్ కి న‌చ్చే విష‌యాల‌న్నీ ఉన్నాయి. ఎమోష‌న్స్, ల‌వ్‌, సెంటిమెంట్‌, యాక్ష‌న్ అన్నీ ఉన్న సినిమా. సెప‌రేట్ జోన‌ర్‌గా అనిపించ‌దు. కానీ కొత్త‌గా ఉంటుంది.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ట్రాఫిక్ పోలీస్‌గా న‌టించాను. ఇప్ప‌టిదాకా మెయిన్ హీరో ట్రాఫిక్ పోలీస్‌గా ఫుల్ లెంగ్త్ పాత్ర‌లు చేయ‌లేదు. మ‌న‌కు కొత్తే. లైఫ్‌లో ఎలాంటి రిస్క్ లూ లేకుండా ఉండాల‌నుకునే పాత్ర అత‌నిది. అయితే అన్ని రిస్కులూ అత‌నికే వ‌స్తే ఎలా ఉంటుంద‌నే అంశంతో చేసిన సినిమా ఇది.

* తెలుగులోకి రావ‌డానికి ఇంత కాలం ప‌ట్టిందెందుకు?
- బాల న‌టుడిగా నేను కెరీర్‌ను మొద‌లు పెట్టింది తెలుగులోనే. మా నాన్న‌గారు తెలుగులో ఎన్నో సినిమాల‌కు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. నేను కూడా ఇక్క‌డ చాలా నేర్చుకున్నా. నేను హీరోగా ఎం.ఎస్‌.రాజుగారి సినిమా చేయాల్సింది. కానీ అంత‌లోనే జ‌యం సినిమా విడుద‌లైంది. నా డెబ్యూ సినిమా అది అయితే బావుంటుంద‌ని అనుకుని చేశాం. అలా తెలుగులో హిట్ అయిన సినిమాల‌న్నీ త‌మిళంలో చేస్తూ వ‌చ్చాను. ఇప్పుడు ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డం క‌రెక్ట్ అనిపించింది. అందుకే ఇస్తున్నా.

Jayam Ravi interview gallery 

* ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా ఉన్న‌ట్టున్నాయి?
- ఇప్ప‌టిదాకా మ‌న‌కు హ్యూమ‌న్ వ‌ర్పెస్ హ్యూమ‌న్ సినిమాలే వ‌చ్చాయి. అయితే ఓ గ్లోబ‌ల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను చేశాం. మ‌నం ఎన్నో ర‌కాలుగా ప్ర‌కృతిని ఇబ్బందుల పాలు చేస్తున్నాం. అదే మ‌న మీద‌కు తిర‌గ‌బ‌డితే ప‌రిస్థితి ఏంటి? అనేది ఇందులో చూపించాం. 55 రోజుల పాటు చిత్రీక‌రించాం. గ్రాఫిక్స్ కి ప్రాధాన్య‌త ఉంది. అయితే గ్రాఫిక్స్ అని ఎక్క‌డా అనిపించ‌దు. మొత్తం 1500 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. అవే సినిమాకు హైలైట్ అని చెప్పాలి. నేను జెనరల్ గా ఏ సినిమాకైనా 10 రోజులు డబ్బింగ్ చెప్తాను. కాని ఈ సినిమాకు ఒకరోజులోనే కంప్లీట్ చేశాను.
నా డైలాగ్స్ అంత తక్కువ ఉంటాయి.

* ఈ సినిమాకు రిఫ‌రెన్స్ చిత్రాలున్నాయా?
- నేను దాదాపుగా అన్ని సినిమాల‌నూ చూస్తా. జాంబీ త‌ర‌హా సినిమాలు కూడా చాలా చూశాను కానీ ఈ సినిమాకు రెఫ‌రెన్స్ కోసం అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ చూడ‌లేదు.

* లక్ష్మీ మీనన్ గురించి చెప్పండి?
- ఆ అమ్మాయి ఈ సినిమాలో బాధ్యత గల డాక్టర్ పాత్రలో నటించింది. తను సినిమాల‌ను ఎంపిక చేసుకునే తీరు చాలా బావుంటుంది. గ్లామ‌ర్‌కి కాకుండా న‌ట‌నకు ప్రాధాన్య‌త ఉన్న రోల్‌ను ఎంపిక చేసుకుంటుంది. ఈ సినిమాను, త‌న పాత్ర‌ను న‌మ్మి ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది.

* త‌ని ఒరువ‌న్ సినిమాపై సౌత్ ఇండియా మొత్తం మీ వైపు చూసిన‌ట్టుంది?
- అవునండీ. ఆ సినిమా నాపై మ‌రింత బాధ్య‌త‌ను పెంచింది.

* అర‌వింద్ స్వామితో ఇంకో సినిమా చేస్తున్నార‌ట క‌దా.
- నిజ‌మే. ఆ డీటైల్స్ ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా.

* త‌దుప‌రి సినిమా గురించి...
- రీసెంట్ గా అన్నయ్య జ‌యం రాజా రాజా ఒక లైన్ చెప్పాడు. బాగా నచ్చింది


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved