pizza
Jayathi interview
భవిష్యత్ లో నిర్మాతగానే కొనసాగుతా – జయతి
You are at idlebrain.com > news today >
Follow Us

6 April 2016
Hyderaba
d


ఉదయబాను, అనసూయ, రష్మీ గౌతమ్ ఇలా యాంకర్స్ అందరూ వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇప్పుడు అలా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంది జయతి. జెమిని మ్యూజిక్ లో వెన్నెల ప్రోగ్రాంతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన జయతి లచ్చి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ సందర్భంగా..

ముందు వద్దన్నాను...
నేను జెమిని మ్యూజిక్ లో చేసిన వెన్నెల ప్రోగ్రాంతో అందరికీ బాగా దగ్గరయ్యాను. మంచి పాపులారిటీ సంపాదించుకున్నాను. చాలా రోజులుగా సినిమాల్లో నటించడానికి అవకాశాలు వస్తున్నాయి. కానీ నేను వద్దని చెప్పేదాన్ని.

ప్రొడక్షన్ అంటే ఆసక్తి...
నాకు ముందు నుండి ప్రొడక్షన్ అంటే ఆసక్తి ఉంది. అందువల్ల మలయాళంలో విజయవంతమైన మై బాస్ అనే చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాను. అయితే ఈ సినిమా కంటే ముందు డైరెక్టర్ ఈశ్వర్ లచ్చి కథను నాకు వినిపించాడు. కథ నాకు చాలా బాగా నచ్చింది. మీరే హీరోయిన్ గా చేస్తే బావుంటుందని ఆయన ఆనడంతో నేను కూడా ఒప్పుకున్నాను.

Jayathi interview gallery

పోస్ ప్రొడక్షన్ ...
లచ్చి ఓ థ్రిల్లింగ్ హర్రర్ కామెడి మూవీ. సినిమాను తిరుపతి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

నిర్మాతగానే...
నాకు ముందు నుండి ప్రొడక్షన్ చేయాలనేదే ప్యాషన్. భవిష్యత్ లో కూడా నిర్మాతగానే కొనసాగాలనుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved